Chiranjeevi : గత కొన్ని నెలలుగా ఉపాసన ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి మెగా కుటుంబం, మెగా అభిమానులు అందరూ కూడా ఎదురుచూస్తున్న శుభ ఘడియలు వచ్చేసాయి. ఎప్పుడెప్పుడా మెగాస్టార్ చిరంజీవికి మనవడు గాని, మనవరాలు ( Chiranjeevi Ramcharan and Upasana ) గాని పుడతారని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. 20వ తారీకు జూన్ 2023న తెల్లవారుజామునే ఉపాసన పండంటి ఆడబిడ్డని కన్నది. ఈ విషయం అపోలో హాస్పిటల్ నుంచి బయటికి రాగానే మెగా అభిమానులు ఆనందానికి ఏ మాత్రం ఆనకట్టలేనంతగా పొంగిపొర్లారి వెంటనే అపోలో హాస్పిటల్ దగ్గరికి అభిమానులు తరలి వెళ్లారు. మెగా ప్రిన్సెస్ పుట్టిందని ఆనందంతో పొంగిపోయారు. ఇక మెగా కుటుంబం అయితే ఇంకా ఎంత ఆనంద పడుతుందో మాటలతో చెప్పగలిగేది కాదు.
నిన్న సాయంత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి జూబ్లీహిల్స్ హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కి వెళ్ళారు. వాళ్ళు వెళ్లిన మరుక్షణమే మీడియా వాళ్ళు ఉపాసన డెలివరీ కోసం జాయిన్ అయిందని, డెలివరీ ఎప్పుడు ( Chiranjeevi Ramcharan and Upasana ) కాబోతుంది అని ఆత్రంలో ఉన్నారు. సాధారణంగా సామాన్యుల కుటుంబంలో కూడా ఎవరైనా పండంటి బిడ్డను కంటే వాళ్లకు తెలిసిన వాళ్లందరికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. వేడుకగా చేసుకునే పండుగలా అందరూ ఆ చిన్న పాపను చూసి మురిసిపోతారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వారసురాలు పుట్టింది అంటే.. మెగా ఫ్యాన్స్ అందరికీ పండగలా ఉంది. కేవలం చిరంజీవి అభిమానులకే కాకుండా మెగా హీరోలందరూ అభిమానులు కూడా ఆనందంతో గంతులు వేస్తున్నారు.
నిన్న రాత్రి హాస్పిటల్కి చేరుకున్న రామ్ చరణ్, ఉపాసన, సురేఖ కనిపించారు. తర్వాత చిరంజీవి ఇంకా రాలేదంటూ అభిమానులు ఆలోచిస్తుండగా.. మీడియా వాళ్ళు చిరంజీవి షూటింగ్లో ఉన్నారని.. రాత్రికి ఏ టైం కైనా వస్తారని ( Chiranjeevi Ramcharan and Upasana ) చెప్పడం జరిగింది. అయితే రాత్రి అయితే చిరంజీవి రాలేదు కానీ.. పొద్దున్న వస్తారని న్యూస్ లో చెప్తూ ఉన్నారు. మరోపక్క అభిమానులు అపోలో దగ్గర టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఏ క్షణమైనా రాంచరణ్ బేబీ గర్ల్ ని చూపించే అవకాశం ఉందేమో.. కనీసం ఒక చిన్న వీడియో అయినా బయటికి రివీల్ చేస్తారేమో అంటూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరూ రాంచరణ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే మనవరాలు పుట్టిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో మెగా ఫ్యామిలీతో పాటు కోట్లాదిమందిలో ఆనందాన్ని నింపావు. రామ్ చరణ్ ఉపాసనలకు తల్లిదండ్రులుగా, మమ్మల్ని గ్రాండ్ పేరెంట్స్ గా ప్రమోట్ చేసి.. సంతోషం కలిగేలా చేశావు.. ఇది మాకు ఎంతో గర్వకారణం అన్నారు. ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టిందని మన పెద్దలు అంటూనే ఉంటారు. చిరంజీవి కూడా మనవరాలను అలా లక్ష్మీదేవిల, రాజకుమారిలా భావిస్తూ.. ఆనందంతో ట్విట్ చేశారు. ఇక మెగాస్టార్ ఆనందాన్ని ఒక్కసారి అయినా వీడియో విసువల్ చూడాలని ఆయన అభిమానులందరూ ఎంతగానో ఆశపడుతున్నారు.