Chiranjeevi : పిల్లల్ని కనగానే కాదు.. వాళ్ళని పెంచిన విధానంలో.. వాళ్ళ విషయంలో తీసుకునే జాగ్రత్తలు అన్నీ కలిపితేనే ఎదిగిన తర్వాత నిలువెత్తు రూపంలో మన ముందు నిలబడతారు. మనం ఎలా ఉంటే, మనం ఏం ఆలోచిస్తే, మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా, జాగ్రత్తగా ఉంటే మన పిల్లల్ని ఎంత రెస్పాన్సిబిలిటీగా జాగ్రత్తగా ( Chiranjeevi gave strong warning ) పెంచితే.. అయినా కూడా అందులో సగానికే రీచ్ అవుతారు వాళ్ళు. పిల్లల మీద ముద్దు అంటే వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి.. అడగని వల్ల తెచ్చి.. ఏం చేసినా ఊరుకుంటే చివరికి వాళ్లతో వచ్చేది సమస్యలే. ఇది అతి సామాన్యుడికి, మిడిల్ క్లాస్ మనిషికి ఎప్పుడూ అర్థమవుతూనే ఉంటుంది. సెలబ్రిటీస్, బాగా డబ్బున్న వాళ్లకి ఇలాంటి సమస్యలు వస్తాయిగాని అర్థం కావు అని అందరూ అనుకుంటారు.
కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం అలా కాదు.. ఆయన ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి.. సినిమా ఇండస్ట్రీలో నిలబడడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో.. కష్టం, శ్రమ, కృషి, పట్టుదల ఎంత ముఖ్యమో మనిషికి.. అలాగే ఒక ( Chiranjeevi gave strong warning ) క్రమశిక్షణ విధానం కూడా అంతే ముఖ్యమని తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఆయన మాట్లాడే విధానంలో.. మర్యాదనేది ఉట్టిపడుతుంది. ఆయనకంటే చిన్నవాళ్ళతో గాని, పెద్దవాళ్లతో గాని, నచ్చిన వాళ్ళతో గాని, విభేదం ఉన్న వాళ్ళతో గాని ఎవ్వరైనా మాట్లాడినా కూడా ఆ విధానంలో ఒక ఒక పెద్దరికం, ఒక సంస్కారం అన్ని ఉంటాయి. అలాగే ఆయనకి ఒక్కగానొక్క కొడుకు రామ్ చరణ్ ని అల్లారం ముద్దుగా పెంచినప్పటికీ.. ఆయన తీసుకున్న జాగ్రత్తలు నిజంగా చాలా గొప్పది.
మెగాస్టార్ చిరంజీవికి వారసుడైనప్పటికీ.. వారసుడంటే మామూలు వారసుడు కాదు ఏకైక వారసుడైనప్పటికీ.. రామ్ చరణ్ తన మొదటి సినిమా నుంచి కూడా ఎంతో కష్టపడుతూనే వచ్చాడు. అసలు రామ్ చరణ్ ఫేస్ ( Chiranjeevi gave strong warning ) చూసి వీడొక హీరోనా? చిరంజీవి పరువు తీశాడు, ఎప్పటికీ హీరోగా నిలబడలేడు అనుకునే వాళ్ళకి సరైన సమాధానం చెప్పే వరకు కూడా.. అతను చేసిన కృషి మామూలు కృషి కాదు. ఒకపక్క ఈరోజు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్నప్పటికీ.. ఆయన భార్య కూడా ఒక పెద్ద స్టేటస్ లో ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్ లో కూడా చిరంజీవిలాగే ఒక మర్యాద అనే వ్యక్తిత్వం కనబడుతూ ఉంటుంది. రామ్ చరణ్ లో.. జీవితం అంటే ఒక రకమైన ఒక చిన్న భయంతో కూడిన గౌరవం, జాగ్రత్త కనిపిస్తూ ఉంటాయి.
ఇదంతా కేవలం చిరంజీవి ఆయన కొడుక్కి నేర్పుకున్న జాగ్రత్త. చిరంజీవి ఆయన కొడుక్కి అన్ని ఫ్రీడమ్ లు ఇచ్చినప్పటికీ.. అన్ని వైపులా కన్నేసి ఉండేవారట. రామ్ చరణ్ ఒక స్టార్ హీరో కొడుకుతో బాగా స్నేహం చేస్తే.. ఆ స్టార్ హీరో కొడుకు మందు, సిగరెట్టు అన్నీ నేర్చుకొని.. ఎలాగైనా బతకచ్చు అదే జీవితం.. ఇలా బ్రతకడం కాదు అని తిరిగి చెప్పేవాడు అంట ఫ్రెండ్స్ కి. అది తెలుసుకున్న చిరంజీవి నేరుగా స్టార్ హీరో కొడుకు దగ్గరికి వెళ్లి ఇలాంటి మాటలు గాని, ఇలాంటి పనులు గాని అందరికీ నేర్పించద్దు.. అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంట. అలాగే రామ్ చరణ్ కూడా ఇలాంటి వాడితో స్నేహం చెయ్యు పరవాలేదు.. కానీ అవి నేర్చుకొని పాడయ్యావా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడంట. ఈరోజు ఆ స్టార్ హీరో కొడుకు ఇతర దేశంలో ఉద్యోగం చేసుకుంటూ సెటిల్ అయ్యాడు. కానీ రామ్ చరణ్ ఒక స్టార్ హీరోగా ఎదిగి చిరంజీవిని మించిన తనయుడు గా మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఇదే పెంపకంలో తేడా..