Baby movie : ఈ మధ్యకాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బేబీ. అంతలా ఈసినిమా ప్రేక్షుకులని అలరించడానికి ముఖ్య కారణం.. ఆసినిమాలోని వైష్ణవి క్యారక్టర్. కారణాలు ఏవైనా ఒకే సమయంలో ( Vizag real story like Baby movie ) ఇద్దరు అబ్బాయలతో ఆమె ప్రేమాయణం జరపడమే. నిజం నిప్పు కంటే బలమైంది, ఎందుకంటే నిప్పయిన కాలగమనంలో ఆరిపోవచ్చు. కానీ నిజం మాత్రం ఖచ్చితంగా లైవ్ లో ఉంటుంది. మన నీడలాగా మనవల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనం ఎంత బాగా కవర్ చేసిన, ఎంత బాగా నటించిన మన తప్పు బయటపడినప్పుడు అపరాధ భావన తో కుంగిపోక తప్పదు..
పోనీ తెగించి అన్నీ తెలిసే నీచమైన పనులు చేస్తే.. నీ బాధితుడు నిజాయతీ పరులు అయితే.. వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో నీ ఊహకు కూడా అందదు. కారణం అప్పటి వరకు నిన్ను నమ్మి ప్రేమించిన అదే మనిషి నీ అంతం చూడటానికి కూడా వెనుకాడడు. ఒక్కసారిగా నీ చేతిలో మోసపోయిన మనిషి పిచ్చి పట్టినవారిలా మరిపోతారు. ఎప్పుడైతే ( Vizag real story like Baby movie ) మనిషి విచక్షణ కోల్పోతారో అప్పుడు అన్నీ మరిచిపోయి తప్పులు చేస్తారు. ఆ తప్పులు నేరాలు కూడా కావచ్చు.. అబ్బాయిలు ఒకరిని మించి అమ్మాయిలతో రిలేషన్ మైంటైన్ చేయడం, దొరికిపోవడం ఏదో గొడవలు అయ్యి విడిపోతారు. ఒక్కోసారి పెళ్ళైన వారి విషయంలో అయితే పోలీస్ స్టేషన్, కోర్టులూ,పెద్దమనుషుల అంటూ తిప్పుతారు. కానీ తప్పు చేసినవాళ్ళు తల వంచక తప్పదు.
అన్ని రంగాల్లో అబ్బాయలతో పోటీ పడుతాం అంటున్న అమ్మాయిలు.. చాలా కాలం నుండి ఒకటికి మించి రిలేషనెస్ మైంటైన్ చేయడంలో చాలా బలంగా పోటీ పడుతున్నారు.. ఆమధ్య హైద్రాబాద్ లో ఒక అమ్మాయి ఇద్దరితో చనువుగా ఉండటం, ఆ అమ్మాయి మాజీ బాయ్ ఫ్రెండ్ ని ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ముక్కలు ముక్కలుగా నరికి చంపడం ( Vizag real story like Baby movie ) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే.. ఒక బలమైన సంఘటన జరిగినప్పుడు దాని తాలూకా రిలేటెడ్ కొన్ని గుర్తు చేసుకోవాలి కాబట్టీ.. విశాఖపట్నం లో ఇంటర్ మీడియట్ చదువుతున్న అమ్మాయి(17) ఒకే సమయంలో సాయి, సూర్య అనే అబ్బాయలతో లవ్వాట ఆడింది.
అక్కడితో ఆగ కుండా ఇంకా మేజర్ కూడా కాని ఆ అమ్మాయి సాయితో తాళి సైతం కట్టించుకునింది. అది వీడియో సైతం తీసుకున్నారు. సాయి తో తాళి కట్టించుకుంటున్న మహా తల్లి సూర్య తో కూడా రిలేషన్ మైంటైన్ చేయడం ఆపలేదు. పాపం పండి ఒకరోజు సాయి, సూర్య కి ఆ అమ్మాయి ఇద్దరితో ఎలా ఆడుకుంటుందో ఒకరికి ఒకరు చెప్పుకోవడంతో.. ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి ఇంటికి నేరుగా వెళ్లి ఆ అమ్మాయి తల్లి తండ్రి ముందే గట్టిగా నిలదీశారు. దీనితో తన బండారం బయపడిందని ముఖం చెల్లక ఆత్మహత్య చేసుకుంది. కానీ తనో సూసైడ్ నోట్ రాసింది. అందులో సాయి మీద కోపం చూపుతూ.. సూర్య వాళ్లని ఎవరిని వదలకు వాళ్ళంతా కుక్క చావు చావాలి అని.. అతన్ని హంతకుడుగా మారిపోమన్ని ప్రేరేపిస్తూ లెటర్ రాసింది. కానీ సూర్య ఇవన్నీ చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ని అరెస్ట్ చేశారు. తప్పు చేసింది ఒక అమ్మాయి, చనిపోయింది ఇంకో అబ్బాయి, జైల్ పాలు అయింది ఇంకో అబ్బాయి. మూడు కుటుంబాల తల్లి తండ్రులకి ఎంతటి కడుపుకోత!?.
బాటమ్ లైన్ ఒకటే… తప్పు ఎవరు చేసినా! శిక్ష ఆఒక్కరికే పరిమితం అవదు.. ఆవేశంలోనో, అవగాహన లోపంతోనో చేసే తప్పులకు ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. టీనేజ్ లోని పిల్లల విషయంలో తల్లి తండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.