
VD12 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే ఒకప్పుడు యూత్ లో విపరీతమైన క్రేజీ ఉండేది. ఇప్పుడు కూడా చాలావరకు ఉందిగాని, గత కొంతకాలంగా అనేక ఫ్లాప్స్ తో విజయ్ దేవరకొండ తన ఇమేజ్ను తగ్గించుకుంటూ వస్తున్నాడు. గీతాగోవిందం ( Vijay Deverakonda movie VD12 latest update ) తర్వాత అంత పెద్దగా బ్లాక్ బస్టర్ హిట్టుని ఇంతవరకు మళ్లీ సొంతం చేసుకోలేకపోయాడు విజయ్ దేవరకొండ. సమంతతో కలిసి చేసిన ఖుషి సినిమా కొంతవరకు ఏదో కలెక్షన్స్ తీసుకొచ్చినప్పటికీ.. ఈ సినిమాపై కూడా పెద్దగా అభిమానులు సంతృప్తి చెందలేదు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతో అసంతృప్తిలో ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండ తదుపరి సినిమా VD12. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులకు కొంచెం అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కు సంబందించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ చూసి విపరీతంగా అంచనాలు పెరుగుతున్నాయి.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయింది. వచ్చే సంవత్సరం 28 మార్చ్ నెలలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అభిమానులకైతే ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ లుక్ లో విజయ్ దేవరకొండ ఒక కొత్త తరహాగా కనిపించాడు. ఖచ్చితంగా ఈ సినిమా ( Vijay Deverakonda movie VD12 latest update ) సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయితే రెండు భాగాలుగా కూడా తీస్తారని అంటున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అటు ఖైదీగా, ఇటు పోలీస్ ఆఫీసర్గా కూడా రెండు పాత్రలను పోషిస్తున్నాడని అంటున్నారు. రెండు పాత్రలను ఒకే సినిమాలో ఇమిడ్చి చూపించగలరా? అందుకేనేమో రెండు సినిమాలు తీస్తున్నారేమో అని అనుకుంటున్నారు. కానీ సినిమా సక్సెస్ అయితేనే రెండవ భాగం తీస్తారని కూడా అంటున్నారు.
మరి సినిమా కథ ఎలా ఉంటుందో, ఆ రెండు పాత్రలు ఎలా కనిపిస్తాయి అనేది తెలియదు. ఇకపోతే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన రాహుల్ సంక్రుత్యన్ దర్శకుడుతో కలిసి.. మళ్ళీ మరొక సినిమా చేయబోతున్నాడు అంట. అయితే VD12 సినిమా గాని సక్సెస్ అయితే.. దాని తర్వాత ( Vijay Deverakonda movie VD12 latest update ) చేయబోయే సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటిస్తుందని అంటున్నారు. రష్మిక కు విజయ్ దేవరకొండకు ఎంత మంచి కెమిస్ట్రీ ఉందో .. వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏమిటో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే రష్మిక ప్రస్తుతం పుష్పా2 లాంటి సినిమాలో నటించి చాలా పై స్థాయిలో ఉందనే చెప్పుకోవాలి. అందుకే విజయ్ దేవరకొండ VD12 సక్సెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అసలు రష్మిక విజయ్ దేవరకొండతో నటించాలి అంటే.. VD12 సినిమా సక్సెస్ తో లింక్ ఉందా అంటూ మరికొందరు అభిమానులు వాపోతున్నారు..