Home Cinema Kushi Review and Rating : ఖుషి సినిమాతో వాళ్ళ జీవితాలు మారిపోతాయా.. రివ్యూ మరియు...

Kushi Review and Rating : ఖుషి సినిమాతో వాళ్ళ జీవితాలు మారిపోతాయా.. రివ్యూ మరియు రేటింగ్..

vijay-deverakonda-and-samantha-movie-kushi-review-and-rating

Kushi movie review : చిత్రం: ఖుషి ( Kushi )
తారాగణం: విజయ్ దేవరకొండ,సమంత,జయరామ్,సచిన్ ఖేడేకర్,మురళీ శర్మ,వెన్నెల కిషోర్,లక్ష్మి,అలీ మొదలగువారు..
కెమెరా: మురళి జి.
సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
దర్శకత్వం : శివ నిర్వాణ
విడుదల తేదీ: 1 సెప్టెంబర్ 2023 ( Kushi Movie Review and Rating )

విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్గా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన కృషి సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాపై సమంత, విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి విపరీతమైన ప్రమోషన్ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సినిమా అందరి అంచనాన్ని రీచ్ అయ్యిందో లేదో తెలియాలంటే కథలోకి వెళ్దాం.( Kushi Review and Rating )

vijay-deverakonda-and-samantha-movie-kushi-review-and-rating

కథ.
సినిమా మొదలు సైన్స్ ని నమ్మాలని.. శాస్త్రాలని, మూఢనమ్మకాల్ని నమ్మకూడదని లెనిన్ సత్య (సచిన్ ఖేడేకర్ ) చెబుతాడు. నిజాన్ని నమ్మకం కప్పేస్తే, ఆ నమ్మకాన్ని మూఢనమ్మకం కప్పేస్తాది అంటూ అతను నినాదం పలుకుతాడు. లెనిన్ సత్య కుటుంబం సొసైటీలో పేరు ఉన్న కుటుంబం. అతనికి భార్య మాత్రం దేవుడిని గట్టిగా నమ్ముతాది గాని, భర్తకు భయపడి కొంచెం కంట్రోల్ లో ఉంటాది. లెనిన్ సత్య కొడుకు విప్లవ్ ( విజయ్ దేవరకొండ ). విప్లవ ఉద్యోగరీత్యా కాశ్మీర్ వెళ్తాడు. అక్కడ ముస్లిం గా తన తమ్ముడిని వెతుక్కుంటూ ఆరాధ్య ( సమంత ) కనిపిస్తుంది. ఆరాధ్య ని చూసి చూడగానే విప్లవ్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమె ముస్లిం అయినా, పాకిస్థానీ అమ్మాయి అయినా కూడా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. కానీ తర్వాత ఆమె ఒక బ్రాహ్మిన్ అని, ఆమె కూడా హైదరాబాదు అమ్మాయి అని.. ఆమె తండ్రి చదరంగం శ్రీనివాస్ ( మురళీ శర్మ ) కాకినాడకు చెందిన శాస్త్రాన్ని గట్టిగా నమ్మే మనిషి అని తెలుస్తుంది. అప్పటికే విప్లవ ఆరాధ్య ఇద్దరు ప్రేమలో పడతారు కానీ.. ఇద్దరు కుటుంబాలు కూడా రెండు డిఫరెంట్ కోణాల్లో ఉంటారని వాళ్ళిద్దరి నమ్మకాలు చాలా సెపరేట్ అని ఇద్దరికీ తెలుస్తుంది. విప్లవ్ ఇంట్లో నాస్తికత్వం ఉంటే, సైన్స్ నమ్ముతుంటే.. సమంత ఇంట్లో సాంప్రదాయాల్ని, మూఢనమ్మకాల్ని నమ్ముతారు. ఆరాధ్య, విప్లవ్ తండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరు. తల్లిదండ్రులను ఎదిరించి వీళ్ళిద్దరూ సపరేట్గా వెళ్లి పెళ్లి చేసుకొని ఎలాగైనా వీళ్ళ జంట కంటే గొప్ప జంట ఈ ప్రపంచంలో లేదని నిరూపించుకోవాలని అనుకుంటూ పెళ్లి చేసుకుంటారు. అసలు వాళ్ళ కుటుంబాలు ఎందుకు పెళ్ళికి ఒప్పుకోవు? వాళ్ళు పెట్టిన కండిషన్ ఏమిటి? మరి అలా పెళ్లయిన ఈ జంట ఏమి నిరూపించింది?చివరికి విప్లవ్ తండ్రి గెలిచాడా? సమంత తండ్రి గెలిచాడా? ఈ రెండు కుటుంబాల్లో ఎవరు ఏం చేశారు? అసలు సమంత విజయ్ దేవరకొండ కలిసి ఉన్నారా? విడిపోవలసిన పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

See also  Balagam : అవతార్ తో అక్కడ పోటీ పడతున్న బలగం..

సినిమా ఎలా ఉందంటే..

సినిమా మొదలు ఒక మంచి కాన్సెప్ట్ మీద వెళ్ళబోతుందేమో అనిపిస్తాది. నాస్తికత్వం అలాగే భగవంతుడు మీద పూజల మీద నమ్మకం ఈ రెండిటికీ రెండు దారుల్లో ఉంటే.. అందులో ఏది రైటు ఏది రాంగ్ అనే దాని మీద కాన్సెప్ట్ వెళ్తుంది. అయితే సినిమా పాయింట్ అయితే బాగుంది గాని.. అసలు ఆ సినిమాని చూపించే విధానం గాని, ప్రేక్షకుడికి దాన్ని ఒప్పించే విధానం గాని అన్నిటిలోను ఫెయిల్ అయినట్టు క్లియర్గా అర్థం అవుతుంది. ఈ సినిమాలో ( Kushi Review and Rating ) విజయ్ దేవరకొండ నటన యావరేజ్ గా, బాగానే ఉంది. పెద్ద సూపర్ హిట్ గా అనిపించలేదు. అలాగని ఏమి కొత్తగా కూడా అనిపించలేదు. అలాగని మరీ చిరాగ్గా కూడా అనిపించలేదు.. పర్వాలేదు. ఎప్పుడు లాగే బానే ఉన్నాడు అనిపించింది. లుక్ అయితే బాగున్నాడు.

vijay-deverakonda-and-samantha-movie-kushi-review-and-rating

సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా బోర్ కొడుతుంది. ఎందుకు సాగదీస్తున్నాడో, ఏం జరుగుతుందో ఎవరికీ చూడాలని అనిపించేలా సినిమా తీయలేకపోయాడు. అసలు ఆ సినిమా కథకి, పాయింట్ కి కాశ్మీర్లో ఏదో ఒక పాయింట్ క్రియేట్ చేసుకుని అక్కడ కొంత షూటింగ్ తీయాలనుకోవడం వల్లే కొంత భాగం నడిచింది అని అర్థమవుతుంది తప్పా నిజానికి అసలు ఆ ( Kushi Review and Rating ) సినిమాలో కాశ్మీర్లో అంశం అవసరం లేదు. దానికి తోడు విజయ్ దేవరకొండ – సుమంతల మధ్య కెమిస్ట్రీ అయితే బాగా ఏమి మనసుకు హత్తుకునేలా లేదు. ఫస్ట్ ఆఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ ఎప్పుడు లాగా ఉండడం వల్ల అది కూడా పెద్దగా ఎవరిని ఆకట్టుకోలేదు. ఫస్ట్ అఫ్ స్టోరీ మొత్తం ఊరికే సాగదీసినట్టు ఉంటె.. ఇంటర్వెల్ బ్యాంగ్ లో మిగిలిన స్టోరీ ఏమిటో క్లియర్ గా అర్ధవుతుంది.

See also  RRR - Pushpa 2 : రిలీజ్ కి ముందే అందులో RRR రికార్డ్ ని బద్దలుకొట్టిన పుష్పా 2 !

ఇక సెకండ్ హాఫ్ లోకి వెళ్తే చాలా సహజంగా ఆడియన్ ఊహించినట్టే సినిమా సాగింది. ట్రైలర్ చూసిన తర్వాతే సినిమా మొత్తం అర్థమైంది కానీ.. సినిమా చూస్తూ ఉంటే ఎందుకు తీసారు ఈ సినిమాని అనే ఫీలింగ్ మాత్రం గట్టిగా వచ్చింది. ఈ సినిమాకి పెద్ద మైనస్ హీరోయిన్ సమంత. ఆమె పేస్ ఎక్కడ కూడా ముందు సమంతాని చూసినట్టు లేదు. దానికి తోడు సమంత, విజయ్ దేవరకొండల జంట చూడ్డానికి బానే ఉన్నప్పటికీ.. నటించేటప్పుడు వాళ్ళిద్దరికీ ( Kushi Review and Rating ) కెమిస్ట్రీ కుదిరినట్టు అనిపించలేదు. ఇక స్టోరీ దగ్గరకు వస్తే ఎప్పుడూ ఇలాగే రొటీన్ గా మొగుడు పెళ్ళాలు ప్రేమించి, పెళ్లి చేసుకున్న మొగుడు పెళ్ళాలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, దాని గురించి మనస్పర్ధలు రావడం వాళ్లకు ఒక సీనియర్ జంట పక్కన ఉండడం, వాళ్ళు ఎలాగ అడ్జస్ట్ అవుతున్నారు? వాళ్ళు ఎలాగ జీవితంలో భార్యాభర్తలు ఒకరికి ఒకరు సపోర్ట్ ఇస్తున్నారు చూసి నేర్చుకోవడం..

అయినా ఇగో తో వాళ్ళిద్దరూ విడిపోవడం.. విడిపోయిన తర్వాతే ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇంకొకరు వేల్యూ బాగా తెలియడం.. ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేక అవతల వాళ్ళు ఏం చెప్తే అది వింటానని ముందుకెళ్లడం.. ఇలాంటి కథలు ఇప్పటికీ కొన్ని వందల సినిమాలు రావడం, చూడడం, విసిగి పోవడం కూడా జరిగింది. వచ్చిన స్టోరీయే రాదా? తీసిన సినిమాలే తీసినట్టు ఉండవా? అంటే ఉంటాయి. కానీ కథ తెలుస్తున్న కూడా ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ నీ.. ప్రతి సీన్ ని ఎంజాయ్ చేస్తూ బోర్ కొట్టకుండా ఉండేలా తీగలగడమే గొప్ప.. కానీ ఈ సినిమాలో ఎక్కడా కూడా అలా తీయలేకపోయారు. ఇక సినిమా అయిపోతున్న లాస్ట్ కొన్ని నిమిషాలు పరవాలేదు అనిపించింది. ఎందుకంటే.. ఇప్పుడు ఏం జరగబోతాది? ఇప్పుడు ఎవరు ఎలా డిసిషన్ తీసుకుంటారు? ఇప్పుడు ఏమవుతాది అని కొత్త సమయం ఆలోచిస్తూ చూడగలిగారు.

See also  Shobita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలవ్వాలంటే సమంతలా శోభితకు అలాంటి కండీషన్ నాగార్జున పెట్టాడా.?

కానీ మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంతేనా అనిపించేలా ఉంది. మొత్తం మీద ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ అంటే ఒకటి కాదు రెండు కాదు అన్ని మైనస్ పాయింట్ లే అనిపించింది. సినిమాలో కామెడీ అనేది అస్సలు లేదు. అలాగని సూపర్ సెంటిమెంట్ గాని, సూపర్ సీన్స్ గాని లేవు. ఈ సినిమాలో మురళీ శర్మ నటన ఎప్పుడు లాగానే బాగానే ఉంది. అసలు ఈ కథని విజయ్ దేవరకొండ గాని సమంత గాని ఎలా ఒప్పుకున్నారు అని అనిపించింది. నటీనటులను బట్టి.. పలానా హీరో, పలానా హీరోయిన్ ను కలిసి నటిస్తే చాలు ఆ సినిమా హిట్ అయిపోతది అనే మూఢనమ్మకల్లో మొదట దర్శకుడున్నాడో? ప్రొడ్యూసర్స్ ఉన్నారో? లేక నటీనటులు ఉంటున్నారో తెలీదు కానీ.. అందులోంచి బయటికి వస్తేనే వీళ్ళు మంచి సినిమాలను చేసుకోగలరు అనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా అందర్నీ నిరాశపరిచిందనే అనుకోవచ్చు. ఈ సినిమాతో విజయదేవరకొండ, సమంత ల కెరీర్ ఎలా మారిపోతాదో, ఏమౌతాదో ప్రశ్నార్థకమే.. ( Kushi Review and Rating ).

రేటింగ్: 2/5

ఈ రివ్యూ మరియు రేటింగ్ కేవలం ఒక ప్రేక్షకుడి అభిప్రాయం. అసలు రివ్యూ మీకు మీరే ఇవ్వాలి.