Prabhas – Vijay Devarakonda : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన హీరో విజయ్ దేవరకొండ. ఆ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్డం ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో అందరూ ఫిదా అయిపోయారు. విజయ్ దేవరకొండ అంటే అందరికీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. విజయ్ దేవరకొండ తో ( Prabhas and Vijay Devarakonda ) సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్, మినిమం గ్యారెంటీ ఉన్న హీరో అని అనుకునేవారు. అలాంటి విజయ్ దేవరకొండ కూడా తర్వాత వచ్చిన సినిమాలు, ఎన్నుకున్న కథల లోపమో ఏమో గానీ ఫ్లాప్స్ చూడాల్సి వచ్చింది. ఇక లైకర్ సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో భారీ అంచనాలతో, భారీ బడ్జెట్ తో చిత్రీకరించిన లైగర్ సినిమా అంత అట్టర్ ఫ్లాప్ అవడం వెనక రీజన్ ఏంటో పెద్దగా ఎవరికి అర్థం కాలేదు.
కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక హిట్స్ లేక కొంతకాలంగా బాధలు పడుతున్న విజయ్ దేవరకొండకి ఇటీవల రిలీజ్ అయిన ఖుషి సినిమా ఊరటనిచ్చింది. శివానిర్వాణ దర్శకత్వంలో.. సమంత హీరోయిన్గా, విజయ్ దేవరకొండ ( Prabhas and Vijay Devarakonda ) హీరోగా నటించిన ఖుషి సినిమా మంచి రిజల్ట్ నే ఇచ్చింది. స్టార్టింగ్ ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం మంచి రిజల్ట్ ఇచ్చాయి. ఖుషి సినిమా హిట్ అవడంతో విజయ్ దేవరకొండ కి మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిందని అభిమానులు ఆనందపడ్డారు. ఇక మళ్ళీ విజయ్ దేవరకొండ అభిమానుల్లో నూతన ఉత్సాహం మొదలైంది.
కేవలం అభిమానుల్లో మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా విజయ్ దేవరకొండపై మళ్లీ దృష్టి పడింది. ఇక విజయ్ దేవరకొండకి వరస హీరో ఛాన్సెస్, మంచి మంచి ప్రొజక్ట్స్ దొరుకుతాయి అనుకునే క్రమంలో.. ఇప్పుడు ఒక వినూత్నమైన వార్త బయటకు వస్తుంది. విజయ్ దేవరకొండ కి హీరో గా ఎన్ని ప్రాజెక్ట్స్ చేతికి వస్తున్నాయో ( Prabhas and Vijay Devarakonda ) ఇంకా తెలియదు కానీ.. విలన్ గా మాత్రం ఒక మంచి ప్రాజెక్టు చేతికి వచ్చింది అని వార్తలు వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చిత్రీకస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో ప్రభాస్ తో తీస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాకి సరైన దీటైన విలన్ అవసరం. అయితే ప్రభాస్ కి ధీటుగా విలన్ పాత్రలో విజయ్ దేవరకొండ ను ఎన్నుకున్నారు అంట.
ఎందుకంటే.. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడంట. ఈ పవర్ ఫుల్ పోలీస్ కి పవర్ఫుల్ విలన్ కూడా కావాలని ఆలోచిస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండ అయితే బాగుంటాడని అనుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండని ప్రభాస్ కి విలన్ గా నటించమని అడగ్గా.. విజయ్ దేవరకొండ కూడా ఒప్పుకున్నాడంట. అయితే మంచి ప్రాజెక్టులో మంచి రెమ్యూనరేషన్ కోసం ప్రభాస్ తో విజయ్ దేవరకొండ రీల్ లైఫ్ లో పెద్ద పెద్ద గొడవలు చేసి.. సూపర్ ఫైట్స్ తో, సూపర్ ట్యాలెంట్ చూపించి విలన్ గా ప్రభాస్ తో సరి సమానంగా పేరు పొందాలని అనుకుంటున్నాడన్నమాట అని నెటిజనులు అనుకుంటున్నారు. ప్రభాస్ కి విలన్ గా విజయ్ దేవరకొండ అంటే ఆ సినిమా చూడడానికి కచ్చితంగా ఆడియన్స్ చాలా మంది వస్తారని అందరి అంచనా..