Vijay Antony wife Fatima : ఈ సృష్టిలో మనిషి ఎంత కష్టపడుతున్నా, ఎన్ని సాధిస్తున్నా, కొన్ని మన చేతుల్లో లేవు అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నా కూడా.. తాపత్రయం, బాధ అనే దాని నుంచి తప్పించుకోవడం సగటు ( Vijay Antony wife Fatima ) మనిషికి కష్టమే. ఇటీవల విజయ్ ఆంటోని కూతురు మీరా 16 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. మీరా తన ఇంట్లో ఉరేసుకొని స్వయంగా తన ప్రాణాన్ని తానే తీసుకున్న విషయం అందరికీ ఎంతో బాధని కలిగిస్తుంది. ఈ బాధ నుంచి విజయ్ ఆంటోనీ అభిమానులే తేరుకోవడం కష్టంగా ఉంటే.. ఇక అతని కుటుంబం ఎంత ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో ఊహించగలం.
పెద్ద కూతురు మీరాకి అలా జరగడంతో.. విజయ్ ఆంటోని తాను ఇటీవల ఎక్కడికి వెళ్తున్నా కూడా తన చిన్న కూతురుని తనతో కూడా తీసుకునే వెళ్ళిపోతున్నాడు. విజయ్ ఆంటోని పలు సినిమాల్లో షూటింగుల్లో బిజీగా ఉండడమే కాకుండా.. ఆయన భార్య ఫాతిమా కూడా ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉంటుంది. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా సినిమా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ బాధ్యతలు స్వీకరించి అన్ని తానే నడిపిస్తుంది. వాళ్ల సొంత ( Vijay Antony wife Fatima ) నిర్మాణ సంస్థను చూసుకునే బాధ్యతలన్నీ.. భర్త బిజీగా ఉండడం వల్ల తానే చూసుకుంటూ కుటుంబాన్ని చక్కగా ముందుకు తీసుకుని వెళ్తుంది. అలాంటి వాళ్ళ కుటుంబంలో ఇలాంటి సంఘటన నిజంగా బాధాకరం. భార్యాభర్తలు ఇద్దరు వాళ్ల వృత్తుల్లో ఎంతో కష్టపడి సంపాదించేది ఎవరికోసం?
ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసమే ఎంతైనా కష్టపడతారు. వాళ్ల కోసం పడే కష్టంలో కష్టమే కనిపించదు. ఇంకా ఇంకా కష్టపడి పిల్లలకు ఏదో చేయాలనుకుంటారు. అలాంటి పిల్లలు కళ్ళముందునే బలవంతంగా ప్రాణాలు తీసుకొనిపోతే.. అది తల్లిదండ్రులకు తీరని బాధ. అలాంటి బాధలోనే ప్రస్తుతం విజయ్ ఆంటోనీ కుటుంబం ఉన్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా ఇటీవల తన కూతురు గురించి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది. అది ( Vijay Antony wife Fatima ) చూసిన సామాన్య నెటిజనులు అందరూ కూడా కన్నీళ్ళతో బాధపడుతున్నారు. ఇంతకీ విజయ్ ఆంటోని భార్య ఫాతిమా ఏమని పోస్ట్ చేసిందో తెలుసుకుందాం..
ఫాతిమా పోస్ట్ ఇలా చేసింది.. ” 16 ఏళ్ళు మాత్రమే జీవిస్తావని నాకు తెలిస్తే.. నిన్ను నాకు మరింత చెరువుగా ఉంచుకుందను. కనీసం నిన్ను సూర్యచంద్రులు ఇద్దరికీ కూడా చూపించకుండా నేనే దాచుకునే దాన్ని.. ప్రస్తుతం మా మధ్య నువ్వు లేకపోవడంతో ఎప్పుడు నీ ఆలోచనలతోనే మునిగిపోతున్నాను. నువ్వు లేకుండా మేము జీవించడం చాలా కష్టంగా ఉంది. ఈ అమ్మ నాన్న దగ్గరికి వచ్చాయి తల్లి.. నీ చెల్లి కూడా నీకోసం ఎదురు చూస్తుంది” అంటూ ఆమె పెట్టిన ట్విట్టర్ లో పోస్ట్ ని చూసి అందరూ కళ్ళ నిండా నీళ్లు నింపుకుంటున్నారు. సూర్యచంద్రులు ఇద్దరికీ సైతం చూపించకుండా నిన్ను దాచుకుందును.. నువ్వు ఇలా వెళ్ళిపోతావు అని తెలిస్తే నేను ఇంకా జాగ్రత్తగా ఉందును.. అనే ఆ తల్లి బాధని ప్రతి తల్లి హార్టుకు తీసుకొని హర్ట్ అవుతున్నారు. ఏదేమైనా ఆ కుటుంబం తొందరగా ఈ బాధ నుంచి తేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.