Saindhav Teaser Review : వెంకటేష్ హీరోగా, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా, ఆర్య, జవాజుద్దీన్ సిద్ధికి, సుహాని శర్మ ముఖ్యపాత్రలో శైలేష్ కొలను దర్శకత్వం వహించిన యాక్షన్ త్రిల్లర్ మూవీ సైంధవ్ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించగా.. ఎస్ మణికంఠం ఫోటోగ్రఫీ ( Saindhav Teaser Review ) అందించగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట బోయినపల్లి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ సినిమా అనగానే సినీ అభిమానులకు కొంత ఖచ్చితమైన అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న కథలు, కుటుంబ కథా చిత్రాలుగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని అందరి ఆలోచన.
అయితే సైంధవ్ సినిమా యాక్షన్ ట్రైలర్ సినిమాగా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఒక చిన్న పాప మీద సినిమా ఫోకస్ అంతా ఉంటుందనేది అర్థమవుతుంది. టీజర్ మొదలు.. వెంకటేష్ ( Saindhav Teaser Review ) ఆనందంగా తన కూతురుతో సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్నట్టు, తన భార్య కూతురుతో అలా ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించారు. ఆ తర్వాత విలన్లు నవాజుద్దీన్ సిద్ధికి ఒక ముఖ్యమైన పనిని అప్పజెప్పినట్టు.. నన్ను నమ్మండి నేను హ్యాండిల్ చేస్తానని చెప్పడం వెనుక విలన్లు చాలా గట్టిపధకమే ఒకదానిమీద వేస్తున్నారని అర్థమవుతుంది.
20వేల మంది పిల్లలకి గన్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని దానిని సీల్ చేస్తున్నామని అధికారులు తెలియజేయడం జరిగింది. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి వెళ్లాల్సిన ఆ గన్స్ ని అధికారులు నిలిపివేశారు. దీంతో విలన్ ( Saindhav Teaser Review ) కోపంతో ఊగిపోవడం చూపించారు. పిల్లలను టెర్రరిస్టులుగా తయారు చేస్తున్న ఒక గ్యాంగ్ ఉన్నట్టు టీజర్ లో అర్థం అవుతుంది. అయితే విలన్ ని మళ్లీ ఒకసారి ఆలోచించు అంటే ఎందుకు భయం సైకో నా అని అడిగితే అప్పుడు వెంకటేష్ను వెనకనుంచి చూపించారు. వెంకటేష్ విలన్ల గుండెల్లో భయం పుట్టించే సైకో అని అర్థమవుతుంది. వెంకటేష్ ని ఒక సైకోగా చూపించబోతున్నారని అర్థమవుతుంది. ఈ సినిమా వెంకటేష్కి 75వ సినిమా.
ఇక వెంకటేష్ ఈ గ్యాంగ్ తో చాలా గట్టిగానే ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. ” వెళ్లే ముందు చెప్పి వెళ్లాను అయినా వినలేదు అంటే భయం లేదు” ” లెక్క మారుతాది రా నా కొడకల్లారా ” అని వెంకటేష్ డైలాగు పవర్ఫుల్ గానే ఉంది గాని.. వెంకటేష్ పవర్ఫుల్ గా నిపించలేదు. టీజర్ లో అప్పటివరకు విపరీతంగా ఫైట్స్ చూపించి లాస్ట్ లో మాత్రం వెంకటేష్ ఒక చిన్నారితో కలిసి ప్రశాంతంగా పడుకున్నట్టు చూపిస్తూ ఆపేశారు. టీజర్ చూస్తుంటే వెంకటేష్ కి తన కూతురు అంటే ప్రాణం అని.. తన కూతురికి విలన్ గ్యాంగ్ వలన ఏదో నష్టం జరిగిందని.. దాని వలన వెంకటేష్ సైకో లా మారి వాళ్ళ ను అంతం చేస్తాడని అర్థమవుతుంది. కానీ ఇలాంటి కథలు ఇప్పటికే చాలా వచ్చాయి. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులు ఆదరిస్తుందో, ఎలా ఉంటుంది అనేది ప్రశ్నార్థకమే. టీజర్ లో సెంటిమెంటు లవ్ ఎఫెక్షన్ ఇలాంటివి ఏమీ కూడా పెద్దగా చూపించలేదు. ఎక్కువగా ఫైట్స్ , డైలాగ్స్ మాత్రమే చూపించారు. టీజర్ యావరేజ్ గా అనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..