VaniJayaram: సినీ ఇండస్ర్టీలో వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. నిన్నటి రోజున నటుడు, డైరెక్టరైనటువంటి కె. విశ్వనాథ్ మరణించిన వార్త నుండి బయటపడకముందే ఇప్పుడు మరొక విషాధ సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ గాయనీ వాణీ జయరాం గారు మరణించారు. ఇవాళ మధ్యహన్నం సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. చైన్నైలోని తన వసతి గృహంలోనే ఈ విషాధ సంఘటన చోటుచేసుకుందట..
78 సంవత్సరాల వయసులో ఈమె మరణించినట్లు తెలుస్తోంది. ఇటీవలె ఆమె గానానికి ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు కూడా ప్రకటించింది. ఇలాంటి సమయంలో తను ఇలా మరణించడం పై సినీ పరిశ్రమ ఒక్కసారి షాక్ కు గురయ్యింది. ఇదే సమయంలో ఆమె ఆత్మకు శాంతి కలగాలని పలువురు పెద్దలు, సినీ ప్రముఖులతో పాటు, ఇటు అభిమానులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని తన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు వేలూరులో వాణి జయరాం గారు జన్మించారు.
తెలుగు, తమిళంలో కలిపి దాదాపు ఇరవై వేలకు పైగా పాటలు పాడింది వాణి జయరాం. ముఖ్యంగా భక్తి పాటలకు పేరు పెట్టింది వాణి జయరాం గారు. వెయ్యికి పైగా చిత్రాలకు బ్యాగ్రౌండ్ సింగర్ గా వ్యవహరించింది. అలా దాదాపు 19 బాషలకు పైగా తన పాపులారిటీ సంపాదించుకుంది. ఐతే ఇటీవలే ఈ గానకోకిలకు పద్మభూషన్ అవార్డు వరించింది. కానీ అది అందుకోకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయింది.
తమిళనాడులోని వేలూరులో వాణి జయరాం 1945 నవంబర్ 30వ తారీకున జన్మించింది. తన ఎనమిదవ ఏటనే ఆలిండియా రేడియోలో పాటలు పాడే అవకాశం దక్కింది. దాంతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. తన సినీ జీవితం మాత్రం చిత్ర విచిత్రంగా జరిగింది. వివాహం జరిగి ముంబైలో స్థిరపడిన తర్వాత బాలీవుడ్ లో గుడ్డి అనే సినిమాతో సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అలా ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించి వేలల్లో పాటలు పాడింది.