Home Cinema Soundarya Son: హీరోలను తల దన్నె గ్లామర్ తో సౌందర్య కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా.?

Soundarya Son: హీరోలను తల దన్నె గ్లామర్ తో సౌందర్య కొడుకు ఎలా ఉన్నాడో తెలుసా.?

Soundarya Son: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని సినీ ఇండస్ట్రీ ని ఏలిన సౌందర్య గారంటే తెలియని సినీ ప్రియలు ఉండనే ఉండరు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకొని తనదైన శైలిలో తన అందంతో, నటనతో అందరినీ ఇట్టే ఆకర్షిస్తూ అచ్చ తెలుగు అందం తో ప్రతి ఒక్కరి హీరోయిన్ గా మారి.. సావిత్రి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు సౌందర్య.. ఇక తనలో ఉన్న టాలెంట్ తోనే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌందర్య కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులు తన సొంతం చేసుకుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించిన సౌందర్య..

See also  Baby movie : విశాఖ బేబీ విషయంలో సినిమాని మించిన ట్విస్ట్ వెలుగులోకి..

veteran-actress-soundarya-son-krishna-pradeep-is-now-all-grown-up

దురదృష్టవశాత్తూ కేవలం 31 ఏళ్లకే ఊహించని హెలికాఫ్టర్ ప్రమాదంలో తన తనువు చాలించింది.ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆమె ఇప్పటికీ చిర స్థాయిగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానాన్ని అయితే సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సౌందర్యకు సంబంధించిన వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే సౌందర్య నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో అంత:పురం ఓ సినిమా.. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి కుమార్, సౌందర్య జంటగా నటించారు. వీళ్లే కాకుండా జగపతి బాబు, ప్రకాష్ రాజ్ మొదలైన వారు ముఖ్య పాత్రలలో నటించారు.

See also  Pushpa3 : పుష్ప 3 గురించి అదిరిపోయే లీక్..

veteran-actress-soundarya-son-krishna-pradeep-is-now-all-grown-up

ఇక ఈ చిత్రం ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం 1998వ సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూలను కొల్లగొట్టింది. సౌందర్య చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని కన్న కొడుకుని రక్షించేందుకు పడే తపన ఏ విధంగా ఉంటుందో తల్లిగా అందులో పాత్ర పోషించింది. ఇక తన నటన ఎంతగానో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ చిత్రంలో సౌందర్య ముద్దుల కొడుకుగా నటించిన బుడ్డోడు పేరు (Soundarya Son) కృష్ణ ప్రదీప్.. సౌందర్య కొడుకుగా అంత:పురం చిత్రంలో కృష్ణ ప్రదీప్ నటించిన సమయానికి అతడి వయసు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే..

veteran-actress-soundarya-son-krishna-pradeep-is-now-all-grown-up

కానీ ఆ తర్వాత ఈ బుడ్డోడు మరే సినిమాలలో కనిపించలేదు.. కాగా ఆ బుడ్డోడు ఇప్పుడు చాలా పెద్దోడు అయిపోయాడు. అతడు మరే చిత్రాలలో కనిపించకపోవడానికి కారణం అతని తల్లి దండ్రులు చదువు దెబ్బ తీయకూడదని ఒకే ఒక ఉద్దేశంతో కృష్ణ ప్రదీప్ ను సినిమాలకు దూరంగా ఉంచారట.. ప్రస్తుతం కృష్ణ ప్రదీప్ వయసు 27 సంవత్సరాలు. హీరోలకు ఏమాత్రం తీసుకొని కటౌట్ అతడిది. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటున్న కృష్ణ ప్రదీప్ మంచి ఫిజిక్స్ తో తరచూ లేటెస్ట్ అప్డేట్స్ తో తాజా తాజా ఫోటోలు షేర్ చేసుకుంటూ అందరిని ఆకట్టుకుంటూ అలరిస్తుంటాడు. ప్రస్తుతం ఇతడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు అని సమాచారం..