Home Cinema Rajasekhar: శ్రీదేవిని పెళ్లాడాల్సిన రాజశేఖర్ ను చేసుకోకుండా అడ్డుకుంది ఎవరు.? ఎందుకు.??

Rajasekhar: శ్రీదేవిని పెళ్లాడాల్సిన రాజశేఖర్ ను చేసుకోకుండా అడ్డుకుంది ఎవరు.? ఎందుకు.??

Rajasekhar: సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ గురించి మనందరికీ సుపరిచితమే..తమిళనాడులోని లక్ష్మీపురంలో జన్మించిన రాజశేఖర్ యాక్టర్ అవ్వాలని అస్సలు అనుకోలేదు ఆయన చదివింది డాక్టర్ చదువు అయినప్పటికీ యాక్టర్ గా మారాడు. తనకున్న టాలెంట్ ఆయన ముఖంలోని తేజస్సు తో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఓ పక్క సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తన వైద్య వృత్తిని మాత్రం నిర్వహిస్తూనే ఉన్నాడు. ఆయన నటించిన తొలి చిత్రం వందేమాతరం. ఇక హిట్లతో, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూనే వెళ్లాడు. (rajasekhar sridevi marriage)

veteran-actors-rajasekhar-sridevi-marriage-got-canceled-because-of-him

ఒక దశలో కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలో తన సహనటి అయిన జీవితను పెళ్లి చేసుకున్నాడు. నిజానికి రాజశేఖర్ అతిలోక సుందరి, దివంగత నటి అయిన శ్రీదేవిని (rajasekhar sridevi marriage) వివాహమాడాల్సి ఉంది. మీరు విన్న ఈ విషయం అక్షర సత్యం ఎందుకంటే.. ఈ విషయాన్ని తాజాగా డాక్టర్.రాజశేఖర్ స్వయంగా తెలిపాడు. తాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆయన శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ పెళ్లి ఆఫర్ గురించి తెలిపాడు.. మొదట డాక్టర్ వృత్తి చేపట్టిన రాజశేఖర్ చాలా అందంగా, స్మార్ట్ గా ఉండేవాడట. ఆ సమయంలో శ్రీదేవి హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అయితే శ్రీదేవి ఫాదర్, రాజశేఖర్ ఫాదర్ మంచి మిత్రులు..అలాగే దూరపు బంధువులు..

See also  Sobhita Dhulipala : చైతూ ఎలాంటోడంటే.. సమంతే కరెక్ట్ అంటూ శోభిత అనుభవాలు బట్టబయలు..

veteran-actors-rajasekhar-sridevi-marriage-got-canceled-because-of-him

ఆ ఫ్రెండ్ షిప్ కారణం చేతనే శ్రీదేవి తండ్రి రాజశేఖర్ ను తన అల్లుడిగా చేసుకోవడానికి అడిగారంట. ఈ విషయాన్ని రాజశేఖర్ తండ్రి మొదట బయటపెట్టాడు. కానీ శ్రీదేవి సినీ రంగంలో ఉండడం చేత రాజశేఖర్ తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోలేదు. మావాడు ఏం.ఎస్ చదవాలి అనుకుంటున్నాడని ఇప్పుడే పెళ్లి వద్దని రాజశేఖర్ తల్లిదండ్రులు సున్నితంగా అతిలోక సుందరి శ్రీదేవి తండ్రి పెట్టిన పెళ్లి ప్రపోజల్ ను వద్దని చెప్పారట. అలా రాజశేఖర్ తండ్రి కారణంగా వీళ్ళిద్దరి పెళ్లి జరగలేదు. ఆ తర్వాత రాజశేఖర్ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాడు.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా అత్తారింటికి దారేది వలన అన్ని కోట్లు నష్టపోయనంటున్న ఆ నటుడు.. ధారుణమే పాపం..

veteran-actors-rajasekhar-sridevi-marriage-got-canceled-because-of-him

దీనికి మొదట రాజశేఖర్ తల్లిదండ్రులు అంగీకరించలేరు.. అయినప్పటికీ రాజశేఖర్ వెనక్కి తగ్గేదే లేదట.. ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చేసాడట ఆ విషయంలో.. దాంతో రాజశేఖర్ తల్లిదండ్రులు సినిమాలు చేయగానే అక్కడ ప్రేమ దోమ అని మళ్ళీ తిరిగితే అసలు ఒప్పుకునేది లేదని మేము ఎవరిని చూస్తే ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలని పెద్ద కండిషన్ పెట్టి సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారట.. కానీ చివరికి రాజశేఖర్ తన సహనటి అయిన జీవితను వివాహం చేసుకొని ఈ కండిషన్ కి బ్రేక్ క్ ఇచ్చాడు. మొత్తానికి శ్రీదేవి మెడలో మూడు ముళ్ళు వేయాల్సిన రాజశేఖర్ ఫైనల్ గా నటి జీవితతో ఏడు అడుగులు వేశాడు.