Uday Kiran : చిత్రం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అప్పటి యంగ్ హీరో ఉదయ్ కిరణ్.. మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. ఉదయ్ కిరణ్ సినిమా అంటే అబ్బాయిలు అమ్మాయిలు ఎంతో ఉత్సాహంగా వెళ్లేవారు. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ( Uday Kiran bad time started ) ప్రేమ కథ చిత్రాలలో అద్భుతంగా నటించేవాడు. తన వాయిస్ కి, నటనకి, పర్సనాలిటీకి అన్నిటికీ ప్రేమకథా చిత్రాలు చక్కగా సూట్ అయ్యేవి. దానితో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అవుతాడు కచ్చితంగా అని పెద్ద నేమ్ తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్. చిత్రం సినిమా తర్వాత ” నువ్వు నేను ” సినిమా రిలీజ్ అయింది. నువ్వు నేను సినిమా ఒక సెన్సేషన్ సృష్టించింది.
నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అంటూ టైటిల్ సాంగ్ తో ఆ రోజుల్లో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తుండేది. ఉదయ్ కిరణ్ అప్పటి అదృష్టం ఏమిటో తెలియదు గానీ అలా సినిమాలో పాటలు కూడా అంతగానే హిట్ అయ్యేవి. లవర్స్ అందులో పాటల్ని రిపీట్ రిపీట్ గా వింటూ ఉండేవారు. చిత్రం ఒక ( Uday Kiran bad time started ) రకమైన ప్రేమ కథ చిత్రం అయితే.. నువ్వు నేను ఇంకొక రకమైన ప్రేమ కథ చిత్రం.. అలాగే ఆ తర్వాత మనసంతా నువ్వే అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాగా.. ఎవరూ ఊహించని రేంజ్ లో ఆ సినిమాని హైలెట్ చేసాడు. చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా అంటూ ఆ పాటలు ఏ ఆటోలో వెళ్లిన, బస్సులో వెళ్ళిన, ఎక్కడికి వెళ్లినా ఇవే పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఉదయ్ కిరణ్ సినిమాలంటే అంత క్రేజ్ ఉండేది.
అలాంటి ఉదయ్ కిరణ్ సినిమా ఆఫర్లు లేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ సినిమా ఆఫర్లు ఎందుకు రావడం మానేశాయి? ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు కావాలని ఎవరిని సినిమాల్లో పెట్టుకోనివ్వడం లేదని.. అందుకే అతనికి ఆఫర్లు లేవని కొందరు అంటే.. లేదు ఉదయ్ కిరణ్ కి నార్మల్గానే ఆఫర్ రావడం లేదు అని అనేవారు. ఇది ఇలా ఉంటే సీనియర్ నటి సుధ కి ఉదయ్ కిరణ్ అంటే చాలా అభిమానం.మీ సుధ ఒక ఇంటర్వ్యూలో ( Uday Kiran bad time started ) మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ ని ఆమె దత్తతు తీసుకోవాలని కూడా అనుకుని.. మొత్తం పేపర్లన్నీ కూడా రెడీ చేసి ఉదయ్ కిరణ్ కి పంపిందట. అయితే ఉద్య కిరణ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో, తిరిగి ఫోన్ చేయకపోవడంతో ఆమెకు కోపం వచ్చి ఊరుకున్నానని..
ఆ రోజే ఉదయ్ కిరణ్ ఆమెకు తన పెళ్లి పత్రికను పంపాడు అని.. అది చూసి కోపం వచ్చి ఆ పెళ్లికి కూడా వెళ్లలేదని చెప్పింది. కానీ ఆ రోజు ఆమెకి ఉదయ్ కిరణ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. జీవితంలో ఏదో పెద్ద ప్రమాదం ఉందని ఏదో చెడు అతని జీవితంలోకి ఎంటర్ అవుతుందని అనిపించింది అంట. ఉదయ్ కిరణ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వలన ఏదో ప్రమాదం పొంచి ఉందని ఆమెకు అనిపించింది అంట. ఇలా ఆమె చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఉదయ్ కిరణ్ జీవితం నాశనం అయిపోయి, అలా డిప్రెషన్ లోకి వెళ్లిపోవడానికి కారణం అతని భార్య నా? ఆమె రావడం వల్ల అతని జీవితంలో అలా జరిగిందా? అంటూ నెటిజనులు ఒకిరితో ఇంకొకరు కామెంట్ చేసుకుంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.