Home Cinema Akkineni Heroes : అక్కినేని హీరోల సినిమాలు వరుస ఫ్లాప్స్ అవ్వడానికి అసలు కారణం చెప్పిన...

Akkineni Heroes : అక్కినేని హీరోల సినిమాలు వరుస ఫ్లాప్స్ అవ్వడానికి అసలు కారణం చెప్పిన వేణు స్వామి..

venu-swamy-comments-about-akkineni-heroes-movie-career

Akkineni Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాలు సినిమా రంగానికి అంటిపెట్టుకొని ఉండి దానికి వెన్నుముఖల కాసుకొని ఉన్నవాళ్లు ఉన్నారు. అలాంటి కుటుంబాల్లో అక్కినేని కుటుంబం ఒకటి. అక్కినేని కుటుంబం ( Venu Swamy and Akkineni Heroes ) నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత అక్కినేని నాగార్జున, నాగార్జున తర్వాత ఆయన కొడుకులిద్దరూ నాగచైతన్య, అఖిల్ సినిమా రంగంలో కి వచ్చారు. నాగేశ్వరరావు తర్వాత నాగర్జున వరకు వాళ్లు ఒక పొజిషన్ ఆక్యుపై చేసుకొని.. సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగారు. అలాగే నాగార్జున తర్వాత నాగచైతన్య ఎంటర్ అయ్యి.. తను కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ ఎంటర్ అయ్యాడు.

venu-swamy-comments-about-akkineni-heroes-movie-career

అయితే గత కొంతకాలంగా అక్కినేని కుటుంబానికి మంచి హిట్ అనేది రావడం లేదు. చాలా రోజులుగా చాలా విధాలుగా ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్నా కూడా నాగార్జున నుంచి అఖిల్ వరకు ముగ్గురికి కూడా ఒక బ్లాక్ బస్టర్ అనేది తగలడం లేదు. నాగార్జున మన్మధుడు 2 సినిమా అలాగే ఆఫీసర్ సినిమాలు రెండు కూడా మంచి అంచనాలతోనే రిలీజ్ అయ్యి.. రెండు కూడా నిరుత్సాపరిచాయి. అలాగే నాగార్జున చేసిన లాస్ట్ సినిమా ది గోస్ట్ సినిమా ( Venu Swamy and Akkineni Heroes ) కూడా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత నాగార్జున ఇంతవరకు వేరే సినిమా రాలేదు. అలాగే ఏ డైరెక్టర్ తో సినిమా మొదలెడుతున్నట్టు అనౌన్స్మెంట్ కూడా రాలేదు. అలాగే నాగచైతన్య కెరీర్ లో చూస్తే లవ్ స్టోరీ, బంగార్రాజు లాంటి సినిమాలో కొంత సక్సెస్ ని అందుకున్నా.. ఆ తర్వాత రిలీజ్ అయిన థాంక్యూ, కస్టడీ లాంటి సినిమాలు నిరుత్సాపరిచాయి.

See also  Sakshi Dhoni: పవన్ కళ్యాణ్ - ప్రభాస్ లతో చిత్రాలు తీయాలంటే మా ఆస్తులను అమ్ముకోవలంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సాక్షి ధోని.

venu-swamy-comments-about-akkineni-heroes-movie-career

ఇక అఖిల్ సంగతి కి వస్తే.. ఇంతవరకు అతని కెరీర్ ఏమిటో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఇలా ఎన్నో సమస్యలతో అక్కినేని కుటుంబం సతమతమవుతుంది. నాగచైతన్య.. చందు ముండేటితో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు కానీ.. నాగార్జున ఇంతవరకు నెక్స్ట్ సినిమా ఏమిటో ఏమి తెలియడం లేదు. అలాగే అఖిల్ది అసలు తెలియడం లేదు. దీనితో అక్కినేని అభిమానులందరికీ ఆందోళన మొదలైంది. ఇదిలా ( Venu Swamy and Akkineni Heroes ) ఉంటే గత కొంతకాలంగా ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామికి మంచి పాపులారిటీ పెరుగుతూ ఉంది. అతను సెలబ్రిటీస్ గురించి జరగబోయేవన్ని చెబుతూ ఉన్నాడు. అతను చెప్పే దాంట్లో కొన్ని నిజాలు అయ్యేసరికి అతని మీద నమ్మకం కూడా చాలా భారీగానే పెరుగుతుంది. అతని మీద నమ్మకం సామాన్యుడికి పెరుగు ఎంత పెరుగుతుంది అన్నది పక్కన పెడితే.. ఎందుకంటే సామాన్యుడు ఎంత పెరిగినా అతని దగ్గరకు వెళ్ళి అంత రెమ్యూనరేషన్ ఇచ్చుకోలేడు. కాబట్టి సెలబ్రిటీస్ మాత్రం అతని దగ్గరకి వెళ్లి..

See also  Tamannaah: ఒక్క నెలలో నటి తమన్నా ఇంత సంపాదిస్తుందా.. ఈ రేంజ్ ఎవరికీ ఉండదేమో..

venu-swamy-comments-about-akkineni-heroes-movie-career

వాళ్లకు కావాల్సిన జాతకాన్ని చెప్పించుకుని.. అతను చెప్పిన పరిహారాలు ప్రకారం పూజలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కినేని కుటుంబం గురించి వేణు స్వామి కొన్ని కామెంట్లు చేశారు. అక్కినేని హీరోలకు ఫ్లాప్స్ రావడానికి కారణం.. వాళ్లకి కెరీర్లో ఇటీవల కాలంలో సక్సెస్ అనేది లేకపోవడానికి కారణం.. వాళ్ళ కుటుంబానికి వంశ దోషం ఉందని.. ఆ దోషానికి పరిహారంగా పూజలు చేయిస్తే ఆ దోషం పోయి.. వాళ్ళ కెరీర్ బాగుపడుతుందని.. వాళ్ళ కుటుంబం ముందుకు వెళుతుందని వేణు స్వామి చెప్పడం జరిగింది. వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని అభిమానులైతే ఆ పూజ ఏదో చేయించుకుని మా హీరోలు ముందుకు వెళ్తే బాగుంటుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.