Venkatesh Rejected Movie Nagarjuna: ఒక హీరో చెయ్యాల్సిన సినిమా మరో హీరో చెయ్యడం,అది హిట్ లేదా ఫ్లాప్ అవ్వడం అనేది మన టాలీవుడ్ లో కొత్తేమి కాదు. దశాబ్దాల నుండి ఇలా జరుగుతూనే ఉంది, ఆ తర్వాత కొద్దిరోజుల తర్వాత ఎవరో ఒకరి ద్వారా పలానా సూపర్ హిట్ సినిమాని మీ హీరో మిస్ అయ్యాడు అని తెలియడం , సదరు హీరో అభిమాని అయ్యో అవునా ఎలాంటి సినిమాని మిస్ అయ్యాడు మా హీరో అని ఫీల్ అవ్వడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం.
అలా విక్టరీ వెంకటేష్ విషయం లో కూడా ఒకటి జరిగింది అట. అసలు విషయం లోకి వెళ్తే మాస్ హీరోయిజం కి సరికొత్త నిర్వచనం తెలిపిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గతం లో వెంకటేష్ తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడట. కానీ వెంకటేష్ కి ఎందుకో ఆ చిత్రం సబ్జెక్టు నచ్చక రిజెక్ట్ చేసాడట. ఆ సినిమా మరేదో కాదు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన శివమణి చిత్రం. ఈ సినిమాలోకి నాగార్జున లోని నట విశ్వరూపం మొత్తం బయటపెట్టాడు పూరి జగన్నాథ్. నాగార్జున అంతకు ముందు కూడా మాస్ సినిమాలు చేసాడు కానీ, క్యారక్టర్ పరంగా ఇంత డిఫరెంట్ గా మాత్రం చెయ్యడం అదే తొలిసారి.
ఫ్యాన్స్ నాగార్జున ని ఆ యాంగిల్ లో చూసి ఎంతో మురిసిపోయారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై అప్పట్లో అక్కినేని ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ సినిమాని ముందుగా వెంకటేష్ తో చెయ్యాలి అనుకున్నాడట పూరి జగన్నాథ్. వెంకటేష్ కి ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది కానీ, సెకండ్ హాఫ్ కి మరియు ఫస్ట్ హాఫ్ కి అసలు సంబంధమే లేనట్టుగా అనిపిస్తుంది, ఇది వర్కౌట్ అవ్వదేమో అని అన్నాడట వెంకీ. నాకు నమ్మకం లేదు ఈ సినిమా మీద, ఏమనుకోకు వేరే కథ చేద్దాం అని అన్నాడట.
ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున ని కలిసి ఈ కథ వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెప్పి ఈ సినిమా చెయ్యడం, అది సూపర్ హిట్ అవ్వడం అన్నీ అలా అలా జరిగిపోయాయి (Venkatesh Rejected Movie Nagarjuna). ఇక ప్రస్తుతపు విషయానికి వస్తే నాగార్జున ఈరోజు తన కార్ కలెక్షన్ కాతాలోకి ఒక కొత్త కారును చేర్చాడు, అదే కియా ఈవి6. ఈ కారును తన ఇంటివద్దే డెలివరీ తీసుకున్నాడు నాగార్జున. అమల కోసం గిఫ్టుగా కొన్నాడు అని అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు. మరికొందరు ఐతే నాగ చైతన్య లానే తండ్రి నాగార్జునకు కూడా కారులు అనే పిచ్చి అను అనుకుంటున్నారు.