
Akira Nandan: ఇటీవల కాలంలో మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. వివాహం అనంతరం వరుణ్ ఫుల్ జోష్ మీద ఉన్నాడని చెప్పాలి. ఖాళీ లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రంలో నటించగా వరుణ్ సరసన మానుషి చిల్లర్, రుహాని శర్మలు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించగా సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సందీప్ ముద్ద రిసైనర్స్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.
ఆపరేషన్ వాలెంటైన్ నుంచి విడుదలైన టీజర్ సాంగ్స్ మరియు పోస్టర్స్ చిత్రాన్ని హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి, కాగా ఈ చిత్రం మార్చి ఒకటో తారీఖున అంగరంగ వైభవంగా విడుదలకు సిద్ధంగా ఉన్నది, ఇదే క్రమంలో వరుణ్ తేజ్ ప్రమోషన్లు బిజీగా గడుపుతున్నాడు, అయితే తాజాగా వరుణ్ కాలేజ్ కి వెళ్ళగా అక్కడ ఆకిరానందన్ (Pawan Kalyan Son) తో ఉన్న బాండింగ్ గురించి ఓ ప్రశ్న తలెత్తింది. దీంతో మెగా హీరో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు, అందులో భాగంగా ఆ నేటిజన్ మీకు ఆకిర కి ఉన్న బాండింగ్ ఎలా ఉంటుందో మాకు చెప్తారా అని అడిగాడు.
దానికి వరుణ్ సరదాగా నా తమ్ముడుతో నేను బాగుంటాడు, నా చెల్లితో కూడా మంచిగా ఉంటా అని ఎవడు చెప్పుకోడు బయట.. అవును నా చిన్న తమ్ముడు ఆఖరి నందన్ (Pawan Kalyan Son) మా మధ్య గొప్ప బాండింగ్ ఉంది. ఇప్పుడు చదువుకోడానికి ఫారన్ కి వెళ్ళాడు. ఇలాంటి సినిమా ప్రమోషన్ల చిన్నపిల్లాడి గురించి మాట్లాడకండి బాగోదు మా తమ్ముడు దిష్టి తగులుతుంది అంటూ తెలిపాడు. వరుణ్ దాంతో అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అవ్వగా ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
View this post on Instagram