Home Cinema Varun – Lavanya : వరుణ్ లావణ్యాల పెళ్లి తరవాత మొదటి పండుగ దీపావళి ఫొటోల్లో...

Varun – Lavanya : వరుణ్ లావణ్యాల పెళ్లి తరవాత మొదటి పండుగ దీపావళి ఫొటోల్లో ఇది గమనించారా?

varun-tej-and-lavanya-tripathi-after-marriage-first-diwali-photos-viral

Varun – Lavanya : మెగా కుటుంబంలో ఏం జరిగినా కూడా మెగా అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా విశేషాలు తెలుసుకోవడానికి ఎదురు చూస్తారు. నిన్న దీపావళి సందర్భంగా.. యావత్ భారతదేశం తనదైన శైలిలో ( Varun and Lavanya Diwali ) ఎంతో ఆనందంగా.. ఎవరికి తోచినట్టు వాళ్ళు ఘనంగా చేసుకున్నారు. దీపావళి శుభాకాంక్షలు ఒకరికి ఒకరు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి పండుగ దీపావళి.ఈ పండుగను వాళ్ళు ఎలా చేసుకున్నారు, ఎవరితో చేసుకున్నారు అనేది అభిమానులందరికీ ఆత్రం.

Varun-Lavanya Diwali

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎన్నో ఏళ్లగా ప్రేమించుకుని.. వాళ్ళ ప్రేమను చాలా సీక్రెట్ గా పదిలంగా దాచుకొని.. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ కి వచ్చిన తర్వాత.. వాళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని పూర్తిగా పయనించగలం అని అర్థం ( Varun and Lavanya Diwali ) చేసుకున్నాక.. ఒకరి ఇష్యూస్ ని ఒకరు క్లోజ్ చేసుకుని.. చివరికి అప్పుడు పెద్దల దగ్గరకు వెళ్లి.. వాళ్ళ ప్రేమ గురించి చెప్పి.. వాళ్ళని ఒప్పించి, ఆ తర్వాత ప్రపంచానికి తెలియజేసి.. చక్కగా ఎంతో ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. నిజంగా ప్రేమికులకు ఉండాల్సిన లక్షణాలు ఇవే. ప్రేమించాను కదా అని వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా.. ఫ్యూచర్లో కలిసి బ్రతకగలమా లేదా అని అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి.

See also  Pawan Kalyan : వరుణ్ పెళ్ళికి పవన్ కళ్యాణ్ పట్టుకెళ్తున్న గిఫ్ట్ ఎయిర్పోర్ట్ లో కనబడిపోయింది.

Varun-Lavanya -firast-Diwali-after-marriage

ఒక ఆడ, మగ మధ్య కలిగిన అట్రాక్షన్ నా లేక వాళ్ళిద్దరి మధ్య నిజంగా అంతటి ప్రేమ ఉందా అనేది తెలుసుకోవడానికి కొంతకాల ప్రయాణం అవసరం. ఆ ప్రయాణంలో ఒకరి కష్టాలు ఒకరు, ఒకరు సుఖాలను ఒకరు ఎలా ఫీలవుతున్నారు ( Varun and Lavanya Diwali ) అనేదే జీవితం. వాటిని ఎంతవరకు మోస్తున్నారు అనేదే ప్రేమ. అయితే అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి చాలా మెచ్యూర్డ్ బ్రెయిన్ తో ఆలోచించి, ప్రతి అడుగు వేయడం నేర్చుకున్నారు. అలాగే వాళ్ళిద్దరికీ ఇటలీలో వాళ్ళ మొదటి ప్రేమ చిగురించిందని ఇటలీలోనే వాళ్ళిద్దరూ దంపతులయ్యారు. వాళ్ళ కోరికను మన్నించి.. మెగా కుటుంబం మొత్తం వాళ్లకి ఎంతో సపోర్ట్ ఇచ్చి.. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి బిజీ హీరోలు కూడా టైముని స్పెండ్ చేశారు.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ తేజ్ లావణ్య పెళ్ళికి ముందే బ్రేకప్.. దీనికి కారణం ఆ జంటేనట!

Varun-Lavanya -Diwali-after-marriage

అలాగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల.. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వినాయక చవితి వస్తే ఆ వేడుకను కూడా లావణ్య త్రిపాఠి అత్తగారి ఇంటికి వచ్చి అక్కడ వినాయక చవితిని చేసుకుంది. ఇప్పుడు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ దీపావళిని కూడా పుట్టింటికి వెళ్ళిపోకుండా అత్తారింట్లోనే ఎంతో చక్కగా చేసుకుంది. దీపావళి రోజు నాగబాబు, ఆయన భార్య, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక ఎంతో సరదాగా టపాసులు కాలుస్తూ పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఎంతో ఆనందింప చేస్తుంది. ముఖ్యంగా అందరూ గమనించిందేమిటంటే.. నిహారిక గత కొంతకాలంగా ఆ కుటుంబానికి దూరంగా ఉంటుంది అనే వార్తలు తెగ వచ్చాయి. కానీ లావణ్య త్రిపాఠి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత.. నిహారిక సినిమా ప్రారంభోత్సవానికి కుటుంబం అంతా వెళ్లడం, అలాగే దీపావళి పండుగకి నిహారిక కూడా ఇంట్లో వాళ్ళతో ఉండి.. అంత చక్కగా ఎంజాయ్ చేయడం చూస్తుంటే.. లావణ్య త్రిపాఠి కుటుంబం అంతా ఒకే తావి మీద, ఒకరితో ఒకరికి అభిమానం ఉండేలా నడిపిస్తుందని అందరూ గమనిస్తున్నారు.