Home Cinema Varalaxmi Sarathkumar: ఒక్కడితో నేను సరిపెట్టుకోలేకనే పెళ్లి చేసుకోలేదు – వరలక్ష్మి శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar: ఒక్కడితో నేను సరిపెట్టుకోలేకనే పెళ్లి చేసుకోలేదు – వరలక్ష్మి శరత్ కుమార్.

Varalaxmi Sarathkumar: స్టార్ హీరో కొడుకు అయినా కూతురైన కానీ అదే తరహాలో స్టార్ హీరోగా స్టార్ హీరోయిన్ గా అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. వాళ్లకు నచ్చిన పాత్రలలో వాళ్లు చేసుకుంటూ ఉండొచ్చని నిరూపించింది. దానికి ఉదాహరణగా నిలిచినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్. ప్రముఖ తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో హీరోయిన్ గా నటించి కొన్ని హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకుంది. కానీ ఆ తర్వాత నటించినటువంటి పలు చిత్రాలు డిజాస్టర్ గా నిలవడంతో..

varalaxmi-sarathkumar-reveals-why-she-didnt-marry-till-date-one-is-not-enough

వరలక్ష్మి శరత్ కుమార్ కి హీరోయిన్ గా అవకాశాలు రావడం మానేశాయి. పైగా దర్శక నిర్మాతలు సైతం ఆమెను హీరోయిన్ గా పెట్టి సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించలేదు. దాంతో వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ పిక్స్ లో ఉండగానే సరైన నిర్ణయం తీసుకుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు లేడీ విలన్ రోల్స్ కి మారిపోయి.. ప్రస్తుతం సౌత్ మొత్తం మీద మోస్ట్ డిమాండ్ ఉన్న లేడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్.(Varalaxmi Sarathkumar)

See also  BRO : బ్రో టికెట్స్ బుకింగ్స్ సినిమా రేంజి ఏమిటో చెప్పకనే క్లియర్ గా చెప్పేస్తున్నాయి.

varalaxmi-sarathkumar-reveals-why-she-didnt-marry-till-date-one-is-not-enough

ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. మరి అదే విధంగా ఇంటర్వ్యూస్ లో కూడా చాలా బోల్డ్ గానే తన స్టేట్మెంట్ ను ఇస్తుంటుంది. అయితే ఆమె చేసిన కొన్ని కామెంట్స్ అప్పుడప్పుడు వివాదాలకు కూడా తెర లేపుతూ ఉంటాయి. కాగా ఆమె ఇటీవలే చేసిన కొన్ని కామెంట్స్ కూడా అలాంటివే.. ఒక యాంకర్ ఆమె పెళ్లి విషయంపై చర్చిస్తూ మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు? అని అడగగా.. ఆ ప్రశ్నకు వరలక్ష్మి శరత్ కుమార్ సమాధానం చెబుతూ..

See also  Ramcharan Birthday special: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. 200 కోట్లతో అక్కడ నుంచి ఎలక్షన్ బరిలో దిగుతున్నాడు..

varalaxmi-sarathkumar-reveals-why-she-didnt-marry-till-date-one-is-not-enough

పెళ్లి చేసుకుని ఏం చేయాలి. రోజు ఒక్కడి ముఖమే చూస్తూ ఉండాలా.. అనే సరికి యాంకర్ ముఖం చిన్న పోయింది. ఇక అదే కాకుండా అసలు ప్రేమించుకుంటేనే పెళ్లి చేసుకోవాలి, ప్రేమించుకోకుండా చేసుకునే పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు. అలాంటి బలవంతపు జీవితాన్ని నేను అస్సలు అనుభవించలేదని. నాకు భవిష్యత్తు మీద ఎన్నో లక్ష్యాలు ఉన్నాయని.. సినిమాల నుండి నేను రిటైర్ అయిపోయాక నా లక్ష్యం రాజకీయాల్లోకి అడుగులు వేయాలని అనుకుంటున్నాను అంటూ తెలిపింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ కి సోషల్ మీడియాలో విభిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.