Varalaxmi Sarathkumar : శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన వరలక్ష్మి.. నెమ్మదిగా విలనిజం వైపు అడుగులు వేసింది. విలన్ గా ఆమెకు దొరికిన రెస్పాన్స్ సూపర్. ఇండస్ట్రీలో ఆడ విలన్స్ గాని సక్సెస్ ( Varalaxmi Sarathkumar comments on the marriage ) అయితే చాలా క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్లు అందంగా, హీరోయిన్ గా అలరించడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలరించడం ఒక రకం అయితే.. విలన్ గా అందరిని మెప్పించడం అనేది చాలా కష్టం. అలాంటి పాత్రల్ని అలవోకగా చేసే హీరోయిన్స్ అంటే రమ్యకృష్ణ తర్వాత చెప్పుకునే హీరోయిన్ వరలక్ష్మి అని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ గా సూపర్ గా సూట్ అవుతాది.
ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో.. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ను కొట్టిందో మనందరికీ తెలుసు. అందులో ఆమె ఒక చెల్లిగా, ఒక విలన్ కి భార్యగా, హీరోకి మేనత్తగా,మెయిన్ విలన్ గా ప్రతి పాత్రలో కూడా అదిరిపోయే నటన చేసింది. వీరసింహారెడ్డి అనగానే ( Varalaxmi Sarathkumar comments on the marriage ) వెంటనే వరలక్ష్మి ఫస్ట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమా టైటిల్ వీరసింహారెడ్డి అనే పిలుపుని.. ఆవిడ నోట్లోంచి ఎంత స్ట్రాంగ్ గా వస్తుంటే.. ఆ సినిమా అంత దద్దరిల్లింది. అంత స్ట్రాంగ్ గా ఆ సినిమా హిట్ కొట్టింది. అయితే ఇటీవల ఓంకార్ పోస్టుగా చేస్తున్న సిక్స్త్ సెన్స్ ప్రోగ్రామ్కి వరలక్ష్మి శరత్ కుమార్ వెళ్ళింది. ఆ ప్రోగ్రాం లో వరలక్ష్మి శరత్ కుమార్ ఆటలతో పాటలతో అందరిని అలరించింది.
అందులో ఆమెను కొన్ని ప్రశ్నలు వేశారు. పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏమిటి అనగానే చేతి వేళ్ళతో ఇంటు మార్క్ చూపించింది. అంటే అనగా.. బూతు కనిపిస్తే అలా క్రాస్ ఏ కదా కొడతాము అని అన్నది. అంటే పెళ్లంటే ఆమె దృష్టిలో ఒక బూతు అనే సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అలాగే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అనే దానిపై.. వయసు ( Varalaxmi Sarathkumar comments on the marriage ) వచ్చేసిందని పెళ్లి చేసుకోకూడదు.. ముందు మనల్ని మనం అర్థం చేసుకొని.. మనం ఏంటో మనకు తెలిసిన తర్వాతే.. వేరే వాళ్ళని ఆనందంగా ఉంచగలమని.. అప్పటివరకు కంగారుపడి పెళ్లి చేసుకోకూడదని చెప్పింది. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా..పెళ్లిని పట్టుకొని అంత మాట అనేసింది ఏంటి అని అనుకుంటున్నారు.
అలాగే ఇంకా ఓంకార్ వరలక్ష్మి ప్రశ్నిస్తూ.. ప్రతి మనిషి సక్సెస్ వెనకాల ఎవరో ఒకరు ఉంటారు కదా.. మీ సక్సెస్ వెనక మీ కుటుంబం ఎంతవరకు ఉంది? ఎవరున్నారు ? అని అడగ్గా.. నా సక్సెస్ వెనకాల ఎవరూ లేరు.. నాకు సంబంధించిన ప్రతి దానికి కారణం నేనే అని చాలా గట్టిగా, స్ట్రాంగ్ గా చెప్పింది. మీ ఫాదర్ శరత్ కుమార్ అండ్ మీ ఫామిలీ మీ కెరియర్ విషయంలో వాళ్ళ పాత్ర ఏమిటి అని అడగ్గా.. వరలక్ష్మి శరత్ కుమార్ సమాధానం ఇస్తూ.. మా అమ్మకి సినిమాల గురించి అంతగా తెలియదు. మా నాన్న సినిమాలు విషయంలో నేను నటించడానికి ఫస్ట్ నుంచి వ్యతిరేకమే. ఆయన నాకు సంబంధం లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అందుకే నా కెరియర్ సక్సెస్ కి నేనే కారణం అని చెప్పింది. మరి ఇప్పుడు మీ ఫాదర్ ఎలా ఫీలవుతున్నారు అని అడగ్గా.. ఇప్పుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అనే దానికంటే.. వరలక్ష్మి ఫాదర్ శరత్ కుమార్ అని చెప్పుకునే స్థాయికి నేను వచ్చేసాను కాబట్టి.. ఇప్పుడు ఆయన గర్వంగానే ఫీల్ అవుతున్నారని చెప్పింది.