
Vaishnavi Chaitanya : బేబీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క రోజుతో తన స్టార్ ను మార్చుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. ఈమె ముందు వెబ్ సిరీస్ లో నటించినప్పటికీ.. ఎవరికీ కూడా పెద్దగా తెలియదు. బేబీ సినిమాలో ( Vaishnavi Chaitanya got an offer ) నటించిన తర్వాత.. తన తొలి చిత్రమైనప్పటికీ కూడా తాను నటించిన విధానం, ఆడియన్స్ ఆకట్టుకున్న ట్యాలెంట్ చూసి ఎందరో దర్శకులు ఇప్పుడు ఆమె వెంట పడుతున్నారు. అయితే ఒక చిన్న లో బడ్జెట్ సినిమాలో.. ఒక చిన్న హీరోతో నటించి.. ఆమె ఇంత క్రేజ్ సంపాదించుకోవడం నిజంగా ఆమె అదృష్టమనే అనుకోవాలి.
అయితే బేబీ సినిమా తర్వాత.. వైష్ణవి చైతన్యకి ఎలాంటి సినిమా వస్తుంది? ఏ హీరోతో వస్తుంది? అని అభిమానులు అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే అల్లు శిరీష్ తో కలిసి సినిమా చేస్తుందని తెలిసింది. సెకండ్ సినిమా ( Vaishnavi Chaitanya got an offer ) అల్లు అరవింద్ నిర్మాణంలో తీసే సినిమాలో నటించనుంది అని అనుకున్నారు కానీ.. ఇప్పుడు మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అది వింటే ఇంకా ఎంత అదృష్టాన్ని సంపాదించుకుంది వైష్ణవి చైతన్య అర్థమవుతుంది. వైష్ణవి చైతన్య పై డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు కన్నేసాడంట. ఆమెను ఎలాగైనా తన సినిమాలో పెట్టుకోవాలని అనుకున్నాడంట.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు మనందరికీ తెలుసు. పూరి జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. అందుకే ఇస్మార్ట్ డబల్ సినిమాని సీక్వల్ గా తీయబోతున్న సంగతి మన ( Vaishnavi Chaitanya got an offer ) అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బేబీ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడంట పూరి జగన్నాథ్. అందుకని తన సినిమాలో నటించమని వైష్ణవి చైతన్యని వెళ్లి అడిగాడంట. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఇంకా అఫీషియల్ గా ఎవరి నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.
వైష్ణవి చైతన్యకి ఇది చాలా పెద్ద ఆఫర్ అని.. ఇస్మార్ట్ డబల్ సినిమా పాన్ ఇండియా సినిమా అని.. రెండవ సినిమానే పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టింది అంటే వైష్ణవి చైతన్య నిజంగా అదృష్టవంతురాలని.. నిజంగా ఈ సినిమాలో ఆమెకు మంచి క్యారెక్టర్ గాని ఇస్తే.. ఆమె చించేయగలదని.. అంత బాగా చేసి ఒకవేళ పేరు తెచ్చుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పేరు తెచ్చుకున్న ఈమె.. పాన్ ఇండియా స్టార్ గా మంచి పేరుగాని తెచ్చుకుందా.. బాలీవుడ్ లెవెల్ వరకు వెళ్లిపోతుందని అభిమానులు అనుకుంటున్నారు. ఇవన్నీ వైష్ణవి చైతన్య కు ఇంకా బాగా తెలుసు కదా.. అందుకే ఆమె పూరి జగన్నాథ్ అడిగిన ఆఫర్ కి వెంటనే ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఏమో ఈ వార్త అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తరవాత మనకు కంఫర్మ్ అని అర్థమవుతుంది.