Home Cinema Upasana : టెన్షన్ లో రామ్ చరణ్.. హాస్పిటల్ లో ఉపాసనా!

Upasana : టెన్షన్ లో రామ్ చరణ్.. హాస్పిటల్ లో ఉపాసనా!

upasana-join-in-apollo-hospital-in-jubilee-hills-hyderabad

Upasana : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వారసుడో, వారసురాలో రాబోతున్న సమయం దగ్గరికి వచ్చేసింది. రెండు రోజుల క్రితమే ఉపాసన తన డెలివరీ డేటు, టైము కూడా చెప్పడం జరిగింది. రేపు పొద్దున్న 6:30 గంటలకు డెలివరీ కాబోతుంది. అందుకే ఈరోజు సాయంత్రం ఉపాసన హాస్పిటల్ లో జాయిన్ అయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ( Upasana join in Apollo Hospital ) అపోలో హాస్పిటల్ లో ఉపాసన డెలివరీ కోసం జాయిన్ అవ్వడం జరిగింది. రామ్ చరణ్ ఉపాసనలు ప్రేమించి పెళ్లి చేసుకుని.. చక్కటి భార్యాభర్తలుగా పదేళ్ల వాళ్ళ జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా జీవించారు. వీళ్ళిద్దరికీ ఎప్పుడు పిల్లలు పుడతారని.. మెగా కుటుంబంలో వారసుడు ఎప్పుడు వస్తాడని.. ఎన్నో ఏళ్ల నుంచి ఎందరో కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

upasana-join-in-apollo-hospital-in-jubilee-hills-hyderabad

ఎంతమంది ఎన్ని చేసినా కూడా.. జీవితంలో సక్సెస్ అయిన తర్వాత.. అన్ని రకాలుగా సెటిల్ అయిన తర్వాత.. బేబీకి 100% మేము న్యాయం చేయగలం అనుకున్న తర్వాతే.. పిల్లల్ని కనాలి అని డిసైడ్ అయిన ఉపాసన రాంచరణ్ లు.. ఒకే మాట మీద ఉండి, ఒకలాంటి ఆలోచనలతోనే.. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఆ నిర్ణయాన్ని అలాగే క్యారీ చేశారు. దానికి మెగా కుటుంబం కూడా నూటికి నూరు శాతం సపోర్ట్ ఇచ్చి.. ఎంతో ( Upasana join in Apollo Hospital ) ఆనందంగా వాళ్లను ఉండనిచ్చారు. ఉపాసన ప్రెగ్నెంట్ అనితెలిసిన దగ్గర్నుంచి రామ్ చరణ్ ఎంత బిజీలో ఉన్నప్పటికీ తాను ఎక్కడికి వెళ్లినా కూడా.. ఉపాసనని సాధ్యమైనంత వరకు తనతో తీసుకుని వెళ్లి.. తను పూర్తి సమయాన్ని వర్క్ టైం కాకుండా.. మిగిలిన టైం అంతా కూడా భార్యకే ఇచ్చి ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు.

See also  Extra - Ordinary Man Teaser Review : ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా టీజర్ రివ్యూ..

upasana-join-in-apollo-hospital-in-jubilee-hills-hyderabad

అంత పెద్ద కుటుంబంలో వారసుడైయుండి..పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. వరల్డ్ వైడ్ ఫేమస్ ఉన్న సెలెబ్రిటీ అయ్యుండి కూడా.. భార్య దగ్గర మాత్రం ఒక సామాన్యమైన భర్తల ఎప్పటికప్పుడు ఆమెకు నచ్చిన వంటలు వండుతూ తినిపిస్తున్నట్టు.. ఆమెను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు.. సోషల్ మీడియాలో ( Upasana join in Apollo Hospital ) ఎప్పటికప్పుడు పోస్ట్ చేసి.. ప్రతి తన అభిమానికి ఆడవారిని ఇలాగే గౌరవించాలని, ప్రేమించాలని చూపించిన రియల్ హీరో రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోట్ అవుతున్న సందర్భంగా.. మెగా అభిమానులందరూ ఆ శుభ ఘడియల కోసం ఎదురుచూస్తున్నారు.

See also  M. M. Keeravani : ఆస్కార్ విన్నర్ కీరవాణి మెదడులో ఆ ప్రాబ్లెమ్ వచ్చిందా?

upasana-join-in-apollo-hospital-in-jubilee-hills-hyderabad

ఉపాసన హాస్పిటల్ లో జాయిన్ అవ్వడానికి వెళుతూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక సామాన్యమైన మనిషిగా ఆమె ట్రాక్ సూట్ వేసుకొని హాస్పిటల్ లోకి వెళ్తూ ఉంది. ఆమెతోపాటు రామ్ చరణ్, రామ్ చరణ్ తల్లి సురేఖ ఇద్దరు కూడా వెళ్తున్నారు. అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ చాలా సింపుల్ గా భార్య పక్కనే నడుస్తూ ఆమెకు ధైర్యం చెబుతున్నట్టుగా కనిపిస్తున్నాడు కానీ.. లోపల లోపల రాంచరణ్ లో ఏదో టెన్షన్ కనిపిస్తుందని అభిమానులు వాపోతున్నారు. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు.. పండంటి బిడ్డ కచ్చితంగా పుట్టి.. మంచి హ్యాపీనెస్ ఇస్తాడని అందరూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నారు. చూడాలి రేపు మెగాస్టార్ చిరంజీవికి బుల్లి మనవడు లేక మనవరాలు ఎవరు పుడతారో..