Home Cinema Upasana : క్లింకార తో కలసి ఉపాసన బతుకమ్మ డాన్స్ కి వాళ్ళు ఎలా ఫ్లాట్...

Upasana : క్లింకార తో కలసి ఉపాసన బతుకమ్మ డాన్స్ కి వాళ్ళు ఎలా ఫ్లాట్ అయ్యారో చూడండి..

upasana-dance-in-bathukamma-celebration-with-her-daughter-klin-kaara

Upasana : తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ అంటే ఎంతో అందరికీ ఇష్టం. ఏడాదికోసారి వచ్చే ఈ పండుగ రోజు తొమ్మిది రోజులపాటు బతుకమ్మను తయారుచేసి, ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. నిన్న అక్టోబర్ 22 సద్దుల బతుకమ్మ.. ఆరోజు అంతా పెద్ద బతుకమ్మను చేసి దాని చుట్టూ చేరి ( Upasana dance in Bathukamma celebration ) ఆడవాళ్లు, పిల్లలు అందరూ ఆడుతూ.. మళ్ళీ ఏడాది రావమ్మా అని సాగనంపుతారు. ఈ పండుగని కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీల సైతం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇక సినిమా వాళ్లయితే ఇంకా వైభవంగా, ఆనందంగా ఈ వేడుకనే ఎవరికి తోచినట్టు వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు.

Upasana-Bhathukamma-dance-celebration

అలాగే బతుకమ్మ పండుగని మెగా కుటుంబంలో చాలా అద్భుతంగా, ఎంతో ఘనంగా చేసుకున్నారు. ముఖ్యంగా ఉపాసన ఇందులో పాల్గొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తన చిన్ని పాప క్లింకార తో కలిసి ఈ వేడుకలో తను ( Upasana dance in Bathukamma celebration ) ఎంతో ఆనందాన్ని తాను పొందుతూ.. అందరికీ అందిస్తూ.. చాలా చక్కగా చక్కటి తల్లిగా, మంచి కోడలుగా తన వంతు తాను ఎంతో బాగా పార్టిసిపేట్ చేసింది. మెగా కుటుంబం సేవా సమాజ్ బాలికా నిలయంలో చిన్నారులతో కలిసి వేడుక చేసుకున్నారు. ఉపాసన కూడా వారితో కలిసి బతుకమ్మ ఆడటమే కాకుండా.. తన కూతురు క్లింకారని ఎత్తుకొని మరి డాన్స్ చేసింది.

See also  Naga Vamsi : పవన్ కళ్యాణ్ వలన సూసైడ్ చేసుకోవాలి అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కాపాడాడు

Upasana-Bhathukamma-dance

 

క్లింకార పుట్టిన తర్వాత వచ్చే ప్రతి వేడుకని, ప్రతి పండుగని కూడా ఉపాసన ఎంతో శ్రద్ధగా చేస్తుంది. దానిలో తన కూతురు పుట్టిన దగ్గరనుంచి ప్రతి విషయాన్ని కేర్ తీసుకుంటూ.. వాటన్నిటిని ఆస్వాదిస్తూ తన కూతురు ఎదిగిన ( Upasana dance in Bathukamma celebration ) తర్వాత ప్రతి మెమరీ ని చూపించాలనే ఉపాసన అలా చేస్తుందని అర్థమవుతుంది. క్లింకార పుట్టిన తర్వాత వచ్చిన మొదటి బతుకమ్మ తల్లి పండుగలో ఉపాసన తన కూతురు తో కలిసి ఆనందంగా పంచుకోవడమే కాకుండా.. ఆ ఫోటోల్ని, వీడియోలను వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకోవడం ఇంకా విశేషం.

See also  Top Telegu movies : 2023 లో తోపు తెలుగు సినిమా ఇదే.. నాని దశరా మూవీ తో లెక్కలు మారాయి.

Upasana-Bhathukamma-Klinkaara

ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ” జనాలు నాకు శక్తినిస్తే, కుటుంబం బలామిస్తుంది. ఎంతో ప్రత్యేకమైన దసరా పండుగ రోజు అర్థవంతమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన శక్తిని మనలో నింపుకుందాం. సానుకూల దృక్పథాన్ని పెంచుకుందాం. మా అమ్మమ్మ ఆచరించే సాంప్రదాయాలను దసరా సజీవంగా ఉంచుతుంది. బాలిక నిలయంలో దసరా వేడుక చేసుకొని సంతోషాన్ని పంచుకుందాం. ” అని క్యాప్షన్ తో రాసుకుంది. సాంప్రదాయాలకు ఇంత గౌరవాన్ని ఇచ్చి, పెద్దలకు అంత మర్యాదనిచ్చి.. ఇలాంటి వ్యక్తి రామ్ చరణ్ జీవితంలో భార్యగా రావడం, మెగా కుటుంబానికి కోడలు అవ్వడం నిజంగా అదృష్టమని మెగా అభిమానులందరూ ఆనందంతో పొంగిపోతూ.. ఎప్పుడు ఇలాగే ఉపాసన ఆనందంగా ఉంటూ, కుటుంబ గౌరవాన్ని పెంచే విధంగా, తను తన బిడ్డ, భర్త అందరు ఆనందంగా ఉండాలని.. మెగా అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.