Trishas Stardom: ఇటీవలి కాలం లో సోషల్ మీడియా లో విపరీతంగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు త్రిష కృష్ణన్.. నలభై ఏళ్ల వయసు పై బడి దాటినప్పటికీ ఈ చెన్నై బ్యూటీ ఇంకా ఇరవై ఐదు ఏళ్ల కుర్ర హీరోయిన్ లా కనపడుతూ.. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం నెట్టింట ఒకటే ముచ్చట త్రిష పెళ్లి చేసుకోబోతోంది అని.. ఓ మలయాళ స్టార్ ప్రొడ్యూసర్ ని త్రిష వివాహం చేసుకోబోతున్నది అంటూ ఒక వార్త అయితే నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ విషయానికి తాజాగా త్రిష చెక్ పెట్టినట్లు కూడా మనకు వినిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. నువ్వు ఎవరో నీకు తెలుసు.. నీ టీమ్ ఏంటో కూడా నీకు తెలుసు.. ఇకనైనా సైలెంట్ గా ఉండు. ఇలాంటి వార్తలు ఆపు.. ఛీర్స్ అంటూ ఆమె తన సోషల్ మీడియా ఖాతా లో ట్వీట్ చేసింది.
దాంతో ఒక్క సారిగా ఆమె చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. అదే విధంగా త్రిష పెళ్లి వార్తలకు కూడా పుల్ స్టాప్ పడినట్టు మనకు తెలుస్తుంది. కాగా ఆమె చేసిన ట్వీట్ ప్రస్తుతం మరో కొత్త వివాదానికి తెర లేపి చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే ఇలాంటి న్యూస్ ప్రచారం చేసే వాళ్ళు ఎవరో త్రిషకు తెలిసే ఉంటుందట. అందుకే ఆమె ఎలా ఫీడ్ చేసిందని చాలా మంది త్రిష అభిమానులు కాకుండా జనాలు సైతం భావిస్తున్నారు. గతంలో త్రిష చెన్నైకి చెందిన ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్ధం చేసుకుని పెళ్ళి పీటలు ఎక్కకుండా రద్దు చేసుకుంది.
ఇక ఇదే కాకుండా త్రిష పై ఇలాంటి దుష్ప్రచారం చేయడంలో ఆ ఇద్దరి పేర్లు విపరీతంగా వినిపిస్తున్నాయంట. మరి ఆ ఇద్దరు ఎవరో కాదు. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఒకరైతే మరొకరు తమిళ్ స్టార్ హీరో విజయ్ వీళ్లిద్దరి కావాలని మరి డబ్బులు ఇచ్చి మరి త్రిష పై ఇలాంటి చెడు ప్రచారాన్ని చేయిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గతంలో కూడా విజయ్ ఫ్యాన్స్ ఇలాగే త్రిష పై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన దృష్టి చేశారు. ఇక మరో పక్క నయనతార పి ఆర్ టీం కూడా త్రిష ఎదుగుతుందని ఈ వయసులో కూడా త్రిష కి వరుస అవకాశాలు వస్తున్నాయని ఆమె స్టార్డమ్ ఓర్వ లేక ఆమె ఏజ్ ని గుర్తు చేయాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ఎన్నో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారని త్రిష అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో త్రిష (Trishas Stardom) స్టార్టమ్ ఓరువలేక ఇటు నయనతార మరియు విజయ్ లు కావాలనే త్రిష పెళ్లి వార్తలు వైరల్ చేస్తున్నారని విషయం అయితే ఫైనల్ అవుతుంది.