
Mahesh Babu – Namratha : టాలీవుడ్ లో అందాల రాజకుమారుడు అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అని అంటారు. ఇప్పటికీ మహేష్ బాబుని ఇంత అందంగా, ఇంత యంగ్ గా ఎలా ఉంటాడు ఈ ఏజ్ లో కూడా అని అందరూ అడిగే ప్రశ్న. ఉం స్టాపబుల్ ప్రోగ్రాం లో కూడా బాలకృష్ణ మహేష్ బాబుని అడిగింది ఇదే. నువ్వు ఏ కొట్లో ( Trisha had a link for Mahesh wedding ) బియ్యం కొంటావు బాబు.. ఇంత యంగ్ గా ఉన్నావు అని.. అలాంటి అందగాడు నమ్రుతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు,నమ్రత.. వంశీ సినిమాతో ఒకరినొకరు కలుసుకొని ఆ పరిచయం ప్రేమగా అతి తొందరగానే మారిపోయింది.
మహేష్ బాబు, నమ్రతాల్లో మొదట నమ్రతానే మహేష్ బాబుని ప్రపోజ్ చేసింది అంట. మహేష్ బాబుకి కూడా నమ్రత అంటే ఇష్టం ఉండటం వల్ల వెంటనే ఆయన ఓకే చెప్పేసాడంట. అలా వాళ్ళిద్దరి ప్రేమ మొదలైంది. కానీ ఆ ప్రేమని ( Trisha had a link for Mahesh wedding ) ఎక్కడ బయటపడనీయ కుండా ఒకరితో ఒకరు జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా కొన్నాళ్లు పాటు ఆ ప్రేమని నడిపారు. అయితే మహేష్ బాబు పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్ళు వెంటనే ఒప్పుకోలేదు అన్న సంగతి తెలిసిందే. నార్త్ సైడ్ అమ్మాయి అవడం వల్ల, సినిమా ఆర్టిస్ట్ అవడం వల్ల కృష్ణ గారు వద్దన్నారని వార్తలు వస్తూ ఉంటాయి.
ఆ క్రమంలో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మహేష్ బాబు, నమ్రత ఇద్దరు కూడా కొంతకాలం టైం తీసుకున్నారు కానీ.. అనుకోకుండా వాళ్ల పెళ్లి సడన్గా చాలా సింపుల్ గా జరిగిపోయింది. అసలు ఒక స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ ల పెళ్లి లా ఉండదు. సామాన్యుల పెళ్లి కంటే కూడా చాలా సామాన్యంగా అనిపిస్తుంది. అలా వాళ్ల పెళ్లి జరగడానికి కారకరాలు త్రిష అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు, నమ్రత ( Trisha had a link for Mahesh wedding ) సడన్గా పెళ్లి చేసుకోవడానికి త్రిష కారణమని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. మహేష్ బాబు, నమ్రతాల పెళ్లికి త్రిషకి లింక్ ఏమిటని అనుకుంటున్నారా?
మహేష్ బాబు, త్రిష కలిసి అతడు సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటిసారిగా చేశారు. మొదటి సినిమాతోనే వీళ్లిద్దరూ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. బావ మరదలు అంటే వీళ్ళలాగే ఉండాలని అందరూ అనుకునేవారు. ఇక వాళ్ళిద్దరూ నటన, చనువు అంతా కూడా ఇరగదీసారు. దానితో వీళ్ళిద్దరూ బయట కూడా చాలా క్లోజ్ గా ఉన్నారని.. అప్పట్లో వార్తలు తెగ వచ్చేవి. మహేష్ బాబు, త్రిష ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని, డేటింగ్ లో ఉన్నారని, చాలా క్లోజ్ గా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి. ఇవన్నీ నమ్రత చెవిని పడి మహేష్ ని అడగ్గా.. మహేష్ అవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పాడంట. ఏదేమైనా వెంటనే మన పెళ్లి జరగాలి.. లేదంటే మనం బ్రేకప్ చేసేద్దాం అని అనడంతో.. ఇంక ఏది ఆలోచించకుండా వెంటనే సింపుల్గా పెళ్లి చేసేసుకున్నాడంట మహేష్ బాబు. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. త్రిష వలన పెళ్లి వీలైనంత తొందరగా జరిగి.. ఇద్దరు బంగారం లాంటి పిల్లలతో.. ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నారు. అందుకే ఏం జరిగినా మన మంచికే అని పెద్దలంటారు.