Trisha Cancelled Her Marriage: వర్షం చిత్రంతో ప్రభాస్ సరసన తన తొలి చిత్ర పరిచయం తెలుగు పరిశ్రమలో మొదలైంది. ఇక ఆ తర్వాత ఇటు టాలీవుడ్ నుంచి మొదలు పెడితే అటు కోలీవుడ్ వరకు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు అప్పట్లో ఓ వెలుగు వెలుగుతూ ముందుకు దూసుకుపోయింది. కొద్ది రోజులు సినీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మళ్ళీ దూసుకుపోతుంది. ఇక ఇటీవలే ఈ చెన్నై అమ్మడు నటించిన చిత్రం పోన్నియల్ సెల్వమ్.. ఇక మణిరత్నం తెరకెక్కిచ్చిన ఈ చిత్రంతో మళ్లీ త్రిష కు పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి. దాంతో ఈ చిత్రంలో త్రిష ‘కుందువై’ పాత్రలో చాలా అద్భుతంగా నటించి మరొకసారి ప్రేక్షకుల మన్ననలు పొందిది.
పోయిన సంవత్సరం ఈ చిత్రం యొక్క మొదటి భాగం విడుదలయి హిట్ టాక్ తో దూసుకుపోయినది. ఈ సంవత్సరం ఏప్రిల్ 28న పొన్నియల్ సెల్వన్ 2 రిలీజ్ చేయగా బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. ఇక కలెక్షన్ల పరంగాను బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేవగొడుతోంది. దీంతో ఈ చిత్రంతో త్రిషకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ఆఫర్లు వరుసగా క్యూ కడుతున్నాయి. ఈ విషయం పక్కన పెట్టినట్లయితే త్రిష వయస్సు ఆల్రెడీ నాలుగు దతాబ్దాలకు పైబడి చేరింది. అయినా సరే ఈ చెన్నై అమ్మడు పెళ్లి అనే విషయం గురించి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇక ఎందరో స్టార్ హీరోలతో గతంలో ప్రేమాయణం నడిపిన ఈ అమ్మడు.
గతంలో రానా, ధనుష్, శింబు వంటి వారితో ప్రేమాయణం కొనసాగించింది. అయితే 2015 వ సంవత్సరంలో కోలీవుడ్ నిర్మాత మరియు ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియంతో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ.. అది జరిగిన కొన్ని రోజులకే ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ త్రిష కూడా వరుణ్ తో తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకున్నానని తెలిపింది. మరి త్రిష, వరుణ్ మణియన్ తో తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుని ఏడు అడుగులు వేయలేక పోగా.? పెళ్లి కూడా రద్దు చేసుకోకపోవడానికి కారణం.? అన్న ప్రశ్నలు చాలామంది మదిలో ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
దీనికి అసలైన కారణం.. వివాహం అనంతరం త్రిష తన సినీ జీవితాన్ని వదులుకోవాలని వరుణ్ కుటుంబం త్రిషకు తెలిపారట. కానీ ఇందుకోసం త్రిష ససేమిరా ఒప్పుకోలేదట. వివాహం కోసం నాకు ఎంతో ఇష్టమైన నటన జీవితాన్ని విడువలేనని.. చివరికి హీరోయిన్ ఆఫర్లు రాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానైనా కొనసాగుతానని త్రిష ఖచ్చితంగా ముక్కుసూటిగా తేల్చి చెప్పేసిందిట. దాంతో వరుణ్ కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేస్తామని చెప్పడంతో వరుణ్ కూడా చివరికి కుటుంబ సభ్యులకే సపోర్ట్ చేయగా దాంతో చివరికి చేసేదేమీ లేక త్రిష తానే వివాహం (Trisha Cancelled Her Marriage) చేసుకొనని తెగేసి తెలిసి చెప్పేసిందట. దాంతో నిశ్చితార్థం జరిగిన కొద్ది రోజులకి వీరిద్దరూ జంట పెళ్లి వరకు వెళ్లకుండా విడిపోయారు.