Rajamouli – Tom Holland : తెలుగు సినిమా ఇండస్ట్రీ తనదైన శైలిలో నెమ్మదిగా అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్న సంగతి తెలుగు సినీ అభిమానులందరికీ తెలిసిందే. ఏ ఇండస్ట్రీ అయినా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తుంది. అలాంటి తరుణంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్దదిగా, స్ట్రాంగ్ గా, ఎదుటివాడికి వినబడేంత సౌండ్ గా అడుగు వేయించిన గొప్ప దర్శకుడు మన రాజమౌళి. తెలుగు ( Tom Holland speech about Rajamouli ) సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆస్కార్ అవార్డు వరకు ఖ్యాతిని తీసుకువెళ్లిన మన దర్శకుడిని ఎంత పొగిడినా అది తక్కువే. ఈరోజు మన తెలుగు హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కూడా బాలీవుడ్ కి చాలా ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో అందులో పాటకు ఆస్కార్ అవార్డుని అందుకునెలా.. ఆ సినిమా రాజమౌళి సృష్టించిన ఒక అద్భుతం. ఆ సినిమాకి అందులో పాటకి ఆస్కార్ అవార్డు వస్తుందని తెలుగు సినీ అభిమానులు కూడా ఊహించలేదు. అది కేవలం రాజమౌళి పట్టుదల. ఎలాగైనా ఆస్కార్ అవార్డు సాధించాలని ఆయన పట్టుదల, ఆయన తెలివి, అయిన టీం వర్క్ తోనే సాధించుకుని వచ్చాడు. ఇక మనలో మనం రాజమౌళి ( Tom Holland speech about Rajamouli ) గురించి ఎంత చెప్పుకున్నా, చెప్పుకుంటూనే ఉన్నా అది తరగనిది, అది ఒక రకమైన ఆనందం. కానీ రాజమౌళి గురించి చెప్పుకుంటుంది మనమే కాదు.. జాతీయస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.
నో వే హోం సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న హీరో టామ్ హాలండ్, హీరోయిన్ జెండాయ.. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఇటీవల ముంబై కి వచ్చారు. ఈ సందర్భంగా ఆ ఇంటర్నేషనల్ హీరో మాట్లాడుతూ.. ఇండియాలో నేను, జెండాయ సూపర్ టైమ్ స్పెండ్ చేసాం అది ఒన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వెకేషన్. నేను మళ్ళీ ( Tom Holland speech about Rajamouli ) ఇండియాకి రావడం కోసం ఎదురుచూస్తున్నాను. గ్రేట్ పీపుల్ ని మీట్ అయ్యాను. అంబానీ కల్చరల్ సెంటర్ చాలా బాగుంది. ఇండియా ట్రిప్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది అని చెప్పాడు. అలాగే అతను స్టేజ్ మీద మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి కూడా మాట్లాడాడు. అతను మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
ఈ స్పైడర్ మాన్ సినిమాలో హీరో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఆర్ఆర్ సినిమా చూశాను నాకు భలే నచ్చింది అంటూ తన రివ్యూ ని ఇచ్చాడు. స్పైడర్ మాన్ సినిమాలో హీరో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇంటర్నేషనల్ హీరో స్టేజ్ పైన మాట్లాడటం అంటే అది మామూలు విషయం కాదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక్క సినిమాతో రాజమౌళి వరల్డ్ సినిమా వాళ్ళని మెప్పించి.. రాజమౌళి సినిమాలో ఒక పాటకి ఆస్కార్ అవార్డు వస్తేనే.. సినిమా రివ్యూ ని హాలీవుడ్ హీరో ఇంటర్నేషనల్ లెవెల్ లో మెచ్చుకుని చూసి రివ్యూ ఇవ్వడం అంటే.. నిజంగా అది మామూలు సక్సెస్ కాదు. ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి వరకే పరిమితమైన రాజమౌళి.. నెక్స్ట్ ఆస్కార్బరిలో ఖచ్చితంగా నిలబడతాడని బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ యాక్షన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఇలాంటి క్యాటగిరీస్ మీద టార్గెట్ చేస్తాడని.. కచ్చితంగా రాజమౌళి ఇందులో ఒక ఆస్కార్ అవార్డుని కొడతాడని అందరూ అంచనాలను వేస్తున్నారు.