Home Cinema Tollywood Celebrities: తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ సెలబ్రిటీ వీళ్ళే..

Tollywood Celebrities: తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ సెలబ్రిటీ వీళ్ళే..

Tollywoods Celebrities: మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు, హీరోయిన్లను దర్శకులని, నిర్మాతలను ప్రేమించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొందరైతే మొదట పెద్దలు కుదిర్చిన సంబంధం నచ్చక విడాకులు తీసుకొని వెళ్ళిపోయి మరల తోటి నటీనటులతో ప్రేమలో పడివాళ్ళని ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకి ఇష్టం లేక పోయినప్పటికీ వాళ్లని ఎదిరించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు మన ఇండస్ట్రీల లో ఉన్నారు. మరి అలా మన ఇండస్ట్రీలో తల్లిదండ్రులకు ఇష్టం లేక పోయినప్పటికీ వాళ్లని ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ సెలబ్రిటీలు ఆ జంటలు ఎవరో మనం ఎప్పుడు తెలుసుకుందాం.

tollywoods-celebrities-who-loved-and-married-their-partner-against-their-parents-will

అక్కినేని నాగార్జున – అమల:  అక్కినేని నాగార్జున మొదట ఇంట్లో చూసిన సంబంధం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరు వద్ద ఏవేవో మనస్పర్ధలు కారణంగా అక్కినేని నాగ చైతన్య పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చి ఆ తర్వాత తోటి నటి అయిన అమలతో ప్రేమలో పడి వాళ్లకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఆమెనే వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత వీళ్ళిద్దరికీ అక్కినేని అఖిల్ జన్మించాడు.

See also  Lavanya Tripathi : పెళ్లి తర్వాత మొదటి పోస్ట్ లోనే లావణ్య వరుణ్ గురించి ఆ సీక్రెట్ చెప్పేసింది..

మహేష్ బాబు – నమ్రత: మహేష్ బాబు నమ్రత ల పెళ్లి కూడా సూపర్ స్టార్ కృష్ణ కి అస్సలు ఇష్టం లేదట. కానీ ఇందిరా దేవి, మహేష్ బాబు అక్క మంజుల కారణంగానే వాళ్ళిద్దరూ బలవంతం చేయడం వల్లనే కృష్ణ గారికి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా చివరకు వీళ్ళ పెళ్లిని అంగీకరించారు. అయితే నమ్రత ఫ్యామిలీకి మహేష్ బాబుకి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టమే.. ఇక ఆ తర్వాత వివాహం అనంతరం నమ్రత గురించి తెలిశాక కృష్ణ కూడా తన కోడలిగా స్వీకరించి తన కోడలు అయినందుకు ఎంతో సంతోషపడ్డాడట.

See also  Akkineni Family : అక్కినేని కుటుంబంలో స్టన్ అయ్యే ఏజ్ గ్యాప్ తో పెళ్లి సందడి.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

Tollywood Celebrities

 

 

నందమూరి తారకరత్న – అలేఖ్య రెడ్డి: హీరో నందమూరి తారకరత్న కూడా తన తల్లిదండ్రులకు ఇష్టం లేక పోయినప్పటికీ ఎంతో ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే అలేఖ్య రెడ్డికి ముందే వివాహం జరిగి అతనితో విడాకులు తీసుకుంది. దాంతో అసలు ఇంట్లో వాళ్ళు అంగీకరించలేరు. చివరికి తారకరత్న చనిపోయే వరకు కూడా తల్లిదండ్రుల దగ్గరికి రానీయ లేదట.

Tollywood Celebrities

 

దేవయాని – రాజ్ కుమార్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సుస్వాగతం సినిమాలో హీరోయిన్ గా నటించిన దేవయాని అంటే అందరికీ గుర్తు ఉంటుంది కదా.. ఆ హీరోయిన్ కూడా ఇంట్లో తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుందట..

See also  Agent movie censor review : ఏజెంట్ సెన్సార్ రివ్యూ.. వాళ్ళ 3గ్గురి పాత్ర ఇలా ఉండటం వలన కలక్షన్స్..

tollywoods-celebrities-who-loved-and-married-their-partner-against-their-parents-will

సూర్య – జ్యోతిక: సౌత్ స్టార్ హీరో సూర్య స్టార్ హీరోయిన్ జ్యోతికల వివాహం కూడా ఇంట్లో వాళ్లకి అస్సలు ఇష్టం లేదట. మరీ ముఖ్యంగా సూర్య తండ్రికి జ్యోతిక వివాహం చేసుకోవాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట.. కానీ వివాహం అనంతరం వీళ్లిద్దరు పెళ్లిని తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. ఇలా వీళ్ళే కాకుండా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలు తన ఇంట్లో తల్లిదండ్రులకి ఇష్టం వివాహం చేసుకొని ఆ తరువాత తల్లిదండ్రులు అంగీకారంతో ఒకటైన జంటలు ఎందరో మరెందరు ఉన్నారు. (Tollywoods Celebrities)