Home Cinema Jawan: జవాన్ లో విజ‌య్ సేతుప‌తి పాత్రని ఆ కారణంగా మిస్ చేసుకున్న మన టాలీవుడ్...

Jawan: జవాన్ లో విజ‌య్ సేతుప‌తి పాత్రని ఆ కారణంగా మిస్ చేసుకున్న మన టాలీవుడ్ హీరో..

tollywood-star-hero-missed-the-villain-role-in-jawan-movie-because-of-that-reason

Jawan: సెప్టెంబర్ 7వ తేదీ దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన జవాన్ మూవీ ఒక ఊపు ఊపుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్గా, అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జవాన్ సినిమా ఎవ్వరూ ( Star hero missed Jawan ) ఊహించనంత స్థాయిలో సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాపై కొంతవరకు అంచనాలైతే ఉన్నాయి గాని.. ఇంత భారీగా ఎవరు ఊహించలేదు. ఎందుకంటే సాధారణంగా ఏ హీరో సినిమా అయినా ఒకటి బ్లాక్ బస్టర్ అయితే.. ఆ తర్వాత వచ్చిన సినిమాపై అంచనాలు పెరుగుతాయి కాని.. కలెక్షన్స్ మాత్రం తగ్గుతాయని అందరూ ఊహిస్తారు.

Jawan - Nani

ఎందుకంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత దాని తర్వాత అదే హీరో సినిమా వస్తుంది అంటే.. ఈ సినిమాతో ఈ సినిమాని అన్ని రకాలుగా పోల్చుకుంటారు. అలా పోల్చి చూడడంలో ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కానీ జవాన్ ( Star hero missed Jawan ) సినిమా అలా కాదు.. షారుక్ ఖాన్ హిట్ లాస్ట్ మూవీ పఠాన్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత వచ్చిన సినిమానే జవాన్. అందుకని జవాన్ అందరికీ అంచనాలు ఉన్నప్పటికీ ఎక్కడో ఒక మూల చిన్న భయం అయితే మాత్రం లేదని చెప్పలేం.

See also  Tollywood Actress: నన్ను ట్రై చేసుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ. ఎగబడుతున్న కుర్రాళ్లు.

Jawan-villain

అలాంటిది జవాన్ సినిమా ఇప్పుడు తిరుగులేని విజయంలో దూసుకు వెళ్ళిపోతుంది. తొలిరోజునే 129 కోట్ల రూపాయలని కలెక్షన్ తీసుకువచ్చిన జవాన్ సినిమా ఫస్ట్ వీక్ లో 500 కోట్ల పైగా కలెక్షన్ తీసుకువచ్చింది. ఇప్పటివరకు ( Star hero missed Jawan ) బాలీవుడ్ లో మొదటి వీక్ లో ఇంత భారీ కలెక్షన్ తెచ్చిన సినిమా లేదంటూ బ్రేక్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ రోల్. విలన్ గా విజయ్ సేతుపతి ఒక్కొక్కచోట షారుఖ్ ఖాన్ ని కూడా డామినేట్ చేసినంత బాగా నటించాడు. అయితే ఈ పాత్రలో మొదట ఆ విజయ్ సేతుపతి అనుకోలేదంట. మన టాలీవుడ్ లోనే ఒక హీరోని అనుకున్నారంట.

See also  Ram Charan : రామ్ చరణ్ కి అలాంటి ప్రయోగం అవసరమా? వాళ్లకి మాత్రం టెన్షన్ గానే ఉందట!

Jawan-star-hero

షారుక్ ఖాన్ కి విలన్ గా నటించే రోల్ అంటే నిజంగా ఒక అదృష్టమనే భావిస్తారు ఎవరైనా కూడా.. అలాంటిది మన హీరోల్లో హీరోని అడిగారు అంటే గ్రేట్ అనుకోవాలి.. ఇంతకీ అతను ఎవరో కాదు.. నేచురల్ స్టార్ నాని. నానిని మొదట షారుక్ ఖాన్ కి విలన్ గా విజయసేతుపతి పాత్రలో నటించమని అడగ్గా.. నానికి తెగ నచ్చేసి ఓకే చెప్పాడంట. కానీ తీరా నానిని తీసుకెళ్లి రోల్ టెస్ట్ చేసిన తర్వాత.. ఓల్డ్ గెటప్ లో నాని సెట్ అయినట్టు దర్శకుడు అట్లకి అనిపించలేదంట. అందుకే వెంటనే నానితోనే ఈ విషయాన్ని అట్లీ చెప్పుకొచ్చాడంట. దాన్ని నాని చాలా పాజిటివ్ గా తీసుకొని నో ప్రాబ్లం అని చెప్పి సైడ్ అయిపోయాడు అంట. ఆ తర్వాత విజయ్ సేతుపతి ని అనుకుని తీసుకున్నారంట. మొత్తానికి ఏది ఏమైనా ఎవరిని ఎలా మార్చిన కూడా.. జవాన్ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం షారుక్ ఖాన్ అభిమానులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆనందాన్నిస్తుంది..