Home Cinema Tollywood Heroines : టాలీవుడ్ లో రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న ఈ హీరోయిన్స్ ఎం మిస్...

Tollywood Heroines : టాలీవుడ్ లో రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న ఈ హీరోయిన్స్ ఎం మిస్ అయ్యారో తెలుసా?

tollywood-heroines-who-did-secret-marriages-missed-this

Tollywood Heroines: మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ముఖ్యం.. అందులోను ఆడవాళ్లకు అది ఇంకా ముఖ్యమని.. సెక్యూరిటీని, గౌరవాన్ని అన్నిటిని ఇస్తుందని భావన. అలాగే ఇక సెలబ్రిటీస్ విషయంలోకి వస్తే, ముఖ్యంగా సినిమా వాళ్ళ విషయంలోకి వస్తే.. హీరోలు పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ( Tollywood Heroines secret marriages ) వాళ్ళు హీరోలుగా నటించగలిగినంత కాలం ఏదో ఒక ఆఫర్స్ దొరుకుతూ కంటిన్యూస్ గా హీరోలుగా ఉంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం అలా కాదు.. వాళ్లకు ఒక ఫేమ్, నేమ్ ఉన్నంతకాలం ఉంటారు.. ఒకవేళ పెళ్లి జరిగితే మాత్రం సినిమాల నుంచి సైడ్ అయిపోతారు. అయితే ఇలాంటి ట్రెండ్ పూర్వం ఉండేది కానీ.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న కూడా హీరోయిన్స్ సినిమాల్లో యాక్టివ్గానే ఉంటున్నారు.

tollywood-heroines-who-did-secret-marriages-missed-this

పెళ్లయిన హీరోయిన్ కి ఇప్పుడు సినిమా రంగం కూడా అవకాశాలు ఇస్తుంది.. అలాగే ప్రేక్షకులు కూడా పెళ్లయిన హీరోయిన్ ని ఆదరిస్తున్నారు. అప్పటితో ( Tollywood Heroines secret marriages ) పోల్చుకుంటే ఇప్పుడు సినిమా రంగం ఇంకా కొంచెం బాగా అప్డేట్ అయిందని.. మంచి అవకాశాలు ఇస్తుందని అర్థం అవుతుంది. మన టాలీవుడ్ లో కొంతమంది హీరోయిన్స్ సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంతకీ అలా రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఎవరో ఒక్కసారి కన్నేద్దాం..

See also  Upasana : ఉపాసన బిడ్డ పై పవన్ భార్య పక్క ప్లాన్డ్ గా బాబోయ్!

అతిలోక సుందరి శ్రీదేవి: దివంగత నటి శ్రీదేవి ఎంత అందగత్తె, ఆమె చెరగని అందం సినీ అభిమానులకు ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. శ్రీదేవి మొదట హీరో నితిన్ చక్రవర్తిని ప్రేమించి.. అతనితో రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పెళ్లైన మూడేళ్ల కి అతనితో విడిపోయింది. విడిపోయిన తర్వాత శ్రీదేవి బోనీ కపూర్ ని రెండవ పెళ్లి చేసుకుంది.

tollywood-heroines-who-did-secret-marriages-missed-this

రమ్యకృష్ణ: రమ్యకృష్ణ ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన కృష్ణవంశీతో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమె ఎవరికీ తెలియకుండా 2003లో కృష్ణవంశీని పెళ్లి చేసుకోవడం జరిగింది. రమ్యకృష్ణ అప్పట్లో ఎంత గ్లామర్ హీరోయిన్ అనేది మన అందరికీ తెలిసిందే.

See also  Samantha: ఆహ.. ఇన్నాళ్ళకి సమంత ఇంత మంచి మూడ్ లో ఉండడం చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు గా..

శ్రియ: శ్రియ స్టార్ హీరోయిన్గా ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలు సరసన నటించి కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది. చక్కటి కళ్ళతో అందమైన రూపంతో ఆమె నటిస్తే.. సినిమా మినిమం గ్యారంటీ అన్నట్టు ఎంతో మంచి కెరియర్ సాగించింది. ఆమె కూడా రష్యాకి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూనే ఉంది.

సాత్నా టైటస్: ఈమె ఎవరో మీ అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది. బిచ్చగాడు సినిమాలో నటించి తెలుగు తమిళ భాషల్లో ఈమె చాలా పాపులర్ అయింది. చూడటానికి చామనచాయ రంగులో ఉన్నా.. మంచి కలవున్న ముఖం. ఈమె బిచ్చగాడు సినిమా డిస్ట్రిబ్యూటర్ అయిన కార్తీక్ తో ప్రేమలో పడి.. ఆ ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల.. పారిపోయి రహస్యంగా పెళ్లి చేసుకుంది.

tollywood-heroines-who-did-secret-marriages-missed-this

ప్రణీత: ప్రణీత చూడ్డానికి చాలా అందంగా ఉండే ఈమె అత్తారింటికి దారేది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఈమె నితిన్ రాజు అనే ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి చేసుకున్న విషయం ఫోటోలు బయటపడే వరకు ఎవరికీ కూడా తెలియలేదు.

See also  Varun Tej - Lavanya Tripathi : వరుణ్ తేజ్ తో తన మొదటి ముద్దులో.. ఎంత కష్టమో సీక్రెట్ చెప్పేసిన లావణ్య త్రిపాఠి!

అయితే అప్పట్లో ఇలా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకుని ఆ తర్వాత వారి వైవాహిక జీవితం బాగుందా, బాలేదా అనేది పక్కన పెడితే.. ఈ రోజుల్లో పెళ్లి అంటే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకు ఎంతో వైభవంగా.. ప్రతి చిన్న సంప్రదాయాన్ని ( Tollywood Heroines secret marriages ) ఒక పెద్ద ఫంక్షన్ లా చేసుకుంటూ.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పైగా సెలబ్రిటీస్ అంటే ఇంకా దాన్ని ప్రతి అభిమాని షేర్లు చేస్తూ.. దాని మీద కామెంట్లు చేస్తూ.. ఆ పెళ్లిని కనీసం ఒక నెల రెండు నెలలు నెటిజనులు అంగరంగ వైభవంగా నెట్ ఇంట్లో జరుపుతూ ఉన్నారు. అలాంటి ఆనందాన్ని రహస్యంగా పెళ్లి చేసుకున్న మన టాలీవుడ్ హీరోయిన్స్ మిస్ అయినట్టే అనిపిస్తుంది.