Vijay Devarakonda-Karthi: అల్లు అరవింద్ గీతా గోవిందం2 సినిమాను సర్కారు వారి పాట సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాంతో తెరకేక్కించాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. అయితే ఇదే క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన రెమ్యునరేషన్ మొదలైన విషయాలు మాట్లాడి అడ్వాన్సులు కూడా ఇచ్చేశాడట అల్లు అరవింద్. కానీ రాత్రికి రాత్రి దిల్ రాజు పథకం మార్చి గీతాగోవిందం2 సినిమాను ఆయన నిర్మించే విధంగా అగ్రిమెంట్ రాసుకొని మరి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేశాడట.
ఈ దెబ్బకి షాక్ అయిపోయిన అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజుని ఎడాపెడా కడిగేయాలని గట్టిగా కదిగేయ్యాలనుకున్నాడట. కానీ గెల్ట్ సభ్యుల రిక్వెస్ట్ మేరకు ఈ వివాదాన్ని అంతటితో ముగించారు. అయినప్పటికీ అల్లు అరవింద్ ఆ బాధను మర్చిపోలేదు. ఇదే క్రమంలో అల్లు అరవింద్ కూల్ చేయడానికి పరశురాం తన భార్యతో కలిసి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లాడంట.. అయినా కూడా అల్లు అరవింద్ కోపం మాత్రం తగ్గలేదు. ఇదే క్రమంలో అల్లు అరవింద్ పరశురాం దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నాడట.
గీత గోవిందం2 సినిమా కంటే ముందే నేను చెప్పిన హీరోతో ఒక హిట్ సినిమా ఇవ్వాలని మాట తీసుకున్నారట. అయితే విజయ్ దేవరకొండ ఎంతగానో ఎదురుచూస్తున్న గీతాగోవిందం2 ఆపేసి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీతో (Vijay Devarakonda-Karthi) అదిరిపోయే సినిమా ప్లాన్ చేశారట. ఇవాలో, రేపో ఆ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందంటూ మనకు తెలుస్తుంది. ఇదే క్రమంలో అల్లు అరవింద్, పరశురాం వీళ్లిద్దరూ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు దిల్ రాజు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు.
కానీ మధ్యలో హీరోగా ఫిక్స్ అయిన విజయ్ దేవరకొండ కి మాత్రం పెద్ద బొక్క పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సమంత అనారోగ్యం కారణంతో ఇప్పటికే ఖుషి సినిమా వాయిదాల మీద వాయిదాలు అవుతూ చాలా ఆలస్యమైంది. అటు గౌతం తిన్నూరుతో సినిమా కూడా లేట్ అవుతుంది. ఇప్పుడు గీతగోవిందం2 సినిమా కూడా చేయి దాటిపోయింది. ఇలా విజయ్ దేవరకొండకు ఎటువైపు చూసినా పెద్ద బొక్కే పెట్టేస్తున్నారు అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్ చేస్తున్నారు.