Home Cinema Bhola Shankar : ఆ హీరోయిన్ పుణ్యమా అని భోళాశంకర్ హిట్ కొడుతుందా.. చిరంజీవి పై...

Bhola Shankar : ఆ హీరోయిన్ పుణ్యమా అని భోళాశంకర్ హిట్ కొడుతుందా.. చిరంజీవి పై అలాంటి వార్త వైరల్?

those-heroine-sentiment-comments-on-chiranjeevi-movie-bhola-shankar

Bhola Shankar : ఆగస్టు 11వ తేదీన మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్గా, కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇటీవలే ఈ సినిమా హైదరాబాద్ శిల్పారామం లో ఘనంగా చేశారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ వేడుకకు అనేకమంది దర్శక, ( Sentiment on Bhola Shankar movie ) నిర్మాతలు విచ్చేశారు. ఇకపోతే చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్కడిగా అడుగుపెట్టి.. ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డ అన్నయ్య అని.. ఎంతో మంది తమ్ముళ్లకు ఇష్టమైన, ప్రాణపదమైన అన్నయ్య అని చిరు గురుంచి చెప్పుకొచ్చారు.

those-heroine-sentiment-comments-on-chiranjeevi-movie-bhola-shankar

 

బోలా శంకర్ సినిమా తమిళ్ లో వేదాలం సినిమాకి రీమేక్. అయితే చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలు ఎందుకు చేస్తారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారని తెలిసి.. దీనిపై చిరంజీవి గారు స్పందించారు. ఒక మంచి కంటెంట్ ఉంటే.. అది వేరే భాషలో ఉంటే.. మన భాష ఆడియన్స్ చూడాల్సిన అవసరం లేదా? అది మనవాళ్లకు అందించాల్సిన అవసరం కనిపించడం.. ఇందులో తప్పేముంది. పైగా వేదాళం ( Sentiment on Bhola Shankar movie ) సినిమా ఓటీటీ లో ఎక్కడా లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు నచ్చే ఈ సినిమా చేశాను. నాకు నచ్చే ఈ రీమేక్ సినిమాని ఒప్పుకున్నాను. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అలాగే ఈ సినిమాలో నటించిన తమన్నా . కీర్తి సురేష్ ని చిరంజీవి గారు ఎంతగానో పొగిడారు.

See also  Pawan Kalyan - Ram Charan : పవన్ కళ్యాణ్ సినిమాలో రాంచరణ్ ఆల్రెడీ నటించిన సినిమా ఒకటి ఉందని తెలుసా?

those-heroine-sentiment-comments-on-chiranjeevi-movie-bhola-shankar

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మెగా అభిమానులందరికీ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొడుతుందని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే.. ఈ సినిమా ట్రైలర్ లో చిరంజీవి అంత జోష్ గా కనిపిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆయన్ని ఒక యంగ్ హీరోలా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఈ సినిమాపై ఒక సెంటిమెంట్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ సెంటిమెంట్ ( Sentiment on Bhola Shankar movie ) వార్త కి చిరంజీవి అభిమానులైతే మాత్రం దాన్ని తిరస్కరిస్తున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏమిటో తెలుసుకుందాం.. భోళాశంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆ సినిమాలో హీరోయిన్ తమన్నా హాజరు కాలేదు. దానికి ఆమె వేరే చోట కి వెళ్లాల్సిన అవసరం పడటం వలన ఇక్కడికి హాజరుకాలేకపోయిందని చెప్పుకొచ్చారు.

See also  Vijay Deverakonda - Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయిపల్లవి అదిరిపోయే లిప్ లాక్!

those-heroine-sentiment-comments-on-chiranjeevi-movie-bhola-shankar

దీని మీద ఒక సెంటిమెంట్ పనిచేస్తుందట. వాల్తేరు వీరయ్య సినిమా జనవరిలో పండగలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఆ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆ సినిమాలో హీరోయిన్ శృతిహాసన్ రాలేదు. అందుకే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయిందని.. అదే సెంటిమెంట్ ఇప్పుడు కూడా వర్క్ అవుట్ అవుతుందని.. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఇందులో హీరోయిన్ తమన్నా రాకపోవడమే అదృష్టమని కొందరు అంటున్నారు. అలా తమన్నా రాలేని సెంటిమెంట్ వల్లే భోళాశంకర్ హిట్ అవుతుంది అనే పాయింట్ ని చిరంజీవి అభిమానులైతే మాత్రం ఒప్పుకోవడం లేదు. ఏ సెంటిమెంట్ వల్ల సినిమాలు హిట్ అవ్వవు. ఆ సినిమా కథలో కంటెంట్ మరియు హీరోలో ఉండే ట్యాలెంట్ వలన సినిమా హిట్ అవుతుంది. కాబట్టి భోళాశంకర్ 100% చిరంజీవి ట్యాలెంటు, ఆయన నటన ప్రభావం సినిమా, కంటెంట్ వలన హిట్ అవుతుందని అంటున్నారు.