Home Cinema Devara : దేవర సినిమా ఆరోజే రిలీజ్ చేయడం వెనుక అసలు రహస్యం అదా..

Devara : దేవర సినిమా ఆరోజే రిలీజ్ చేయడం వెనుక అసలు రహస్యం అదా..

this-is-the-secret-of-the-jr-ntr-movie-devara-release-date

Devara : ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. అన్ని భాషల్లో భారత దేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే( Devara movie release date ) ఇప్పుడున్న క్రేజ్ మామూలుది కాదు. సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కలిసి చేసిన ప్రతి సినిమా సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు.. ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అలాంటిది వీళ్ళిద్దరూ లాస్ట్ లో చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకున్నారు. ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

jr ntr-devara-movie-release-date

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ నటిస్తున్న సంగతి మన అందరికీ తెలుసు. జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సినిమా ఇది. ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమెకు ( Devara movie release date ) జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి చేసే అవకాశం కోసమే ఆ పాత్రకు వెంటనే ఓకే చెప్పానని చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ అంటే చాలా ఇష్టమని ఆమె ఫోటోలను బట్టి ఆమె ప్రవర్తన బట్టి తెలుస్తూ ఉంటుంది. కానీ దేవర సినిమాలో ఆమె పాత్ర విభిన్నంగా ఉంటుంది. అయినా కూడా ఆమె ఇష్ట పడింది కారణం.. కేవలం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మొదటి సినిమా తెలుగులో నటించాలని కోరిక ఉండడం వల్లే అని ఎన్నోసార్లు వార్తలు విన్నాము.

See also  Upasana Delivery: ఆ ప్రత్యేకమైన డెలివరీ రోజు రామ్ చరణ్ తన భార్య ఉపాసన కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే శభాష్ అంటారు.

jr ntr-devara-movie-release-secret

ఇదిలా ఉంటే దేవర సినిమా ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని గత కొంతకాలంగా నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వాళ్ళ ఎదురుచూపులకు ఏప్రిల్ 5వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉందని రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. అయితే ( Devara movie release date ) ఏప్రిల్ 5వ తేదీని ఈ సినిమా రిలీజ్ చేయడం వెనక రహస్యం ఉందంటూ.. కొన్ని కారణాల వలన ఈ సినిమాని ఏప్రిల్ ఐదో తేదీని విడుదల చేస్తున్నారంటూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 5వ తేదీ ఎవరిదైనా బర్త్డే ఉందా? జాన్వి కపూర్తిగాని, ఎన్టీఆర్ గానీ లేదా ఆ సినిమాలో నటిస్తున్న వాళ్ళది గాని, దర్శకుడు గానీ, నిర్మాతది కానీ అని ఆలోచించడం మొదలుపెట్టారు.

See also  Allu Arjun family celebration : అల్లు అర్జున్ కి అవార్డు సెలబ్రేషన్ గాను కుటుంబంతో సూపర్ పిక్స్, వీడియో వైరల్..

jr ntr-devara-movie

కానీ ఇవేమీ కాదు.. ఏప్రిల్ 5వ తేదీ దేవర సినిమాని రిలీజ్ చేయడం వెనుక ఉన్న సీక్రెట్ బిజినెస్. ఏ హీరోతో ఏ దర్శకుడు కాంబినేషన్లో సినిమా తీసినప్పటికీ.. అల్టిమేట్ గోల్ ఆ సినిమాపై వచ్చే కలెక్షన్స్. సినిమా కలెక్షన్స్ ఎంత గట్టిగా వస్తే.. ఆ సినిమా అంత సక్సెస్ అయినట్టు. కలెక్షన్లు వర్షం కురిపిస్తే నిర్మాత దగ్గర నుంచి ఒక చిన్న టెక్నీషియన్ వరకు అందరూ ఆనందంతో పొంగిపోతారు. అందరికీ ఏదో రకమైన లాభం, ఆనందం, సంతృప్తి అన్ని ఉంటాయి. ఏప్రిల్ 5 వతేదీ విడుదల చేయడం వెనక ఉన్న రహస్యం ఏమిటంటే.. ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం. 6 , 7 తేదీలు సెలవులు. ఇవి సినిమాకి బాగా కలిసి రావడమే కాకుండా.. 9వ తేదీ ఉగాది. అంటే ఉగాది పండుగ కూడా అందరూ ఒకటి రెండు రోజులు సినిమా మీద పడతారు. అంతేకాకుండా 13 ,14 తేదీలు వీకెండ్. ఇక ఐదో తేదీ నుంచి 14వ తేదీ వరకు తిరుగులేని ఎక్కువ సెలవులు ఉండడంతో.. అంతేకాకుండా ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమీ పండగ కూడా ఉంది. ఇలా అన్ని చూసుకొని.. అంత ప్లాన్ గా ఈ సినిమాను రిలీజ్ చేశారని అనుకుంటున్నారు.