Home Cinema Tollywood : మీకిష్టమైన ఈ సూపర్ హిట్ జంటలు మీకోసం ఇలా..

Tollywood : మీకిష్టమైన ఈ సూపర్ హిట్ జంటలు మీకోసం ఇలా..

Tollywood-super-hit-couple

Tollywood : సినిమాల్లో తారలంటే నిజంగా సామాన్యులకు చాలా ఇష్టం. మా హీరో, మా హీరోయిన్,నేను వాళ్ళ ఫ్యాన్ ని అని చెప్పుకుంటూ ఎంతో గర్వంగా తిరుగుతారు. వాళ్ళ అభిమాన హీరో, హీరోయిన్ కోసం.. వాళ్ళ మాటలని, వాళ్ల టైం ని, వాళ్ళ డబ్బుని అన్నిటిని ఖర్చు చేస్తారు. అదే సినిమా రంగంలో నటించే వాళ్ళ అదృష్టం కూడా.. అందుకే ( Tollywood super hit couples ) అభిమానుల ఆనందాన్ని, అరుపులని చూసి నటీనటులు పొంగిపోతుంటారు. మీ అండ ఇలా ఉన్నంతకాలం నేను ఎంతైనా ఇంకా కష్టపడతాను అని ప్రతి హీరో, హీరోయిన్ కూడా చెప్తూనే ఉంటారు. అలాగే హీరో, హీరోయిన్స్ కలిసి నటించిన వాటిలో కొన్ని జంటలు ప్రేక్షకులకు చాలా నచ్చుతారు.

Tollywood-super-hit-couple-again

సినిమాల్లో ఒక హీరో ఎంతోమంది హీరోయిన్స్ తో.. ఒక హీరోయిన్ ఎందరో హీరోలతో కలిసి డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు నటిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని జంటలు మాత్రం అలా గుర్తుండిపోతాయి. ఆ జంటలు మళ్ళీ వస్తున్నాయి ఆ జంట సినిమా మళ్ళీ వస్తుందంటే ప్రేక్షకులు అభిమానంతో పొంగిపోతుంటారు. ( Tollywood super hit couples ) నాగేశ్వరావు – సావిత్రి , ఎన్టీఆర్ – వాణిశ్రీ అలాగే చిరంజీవితో కొందరు హీరోయిన్స్ విజయశాంతి, రాధ, భానుప్రియ ఇలాంటి వాళ్లు.. అలాగే వెంకటేష్ – సౌందర్య.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జంటలు మనకు నచ్చుతాయి. ఏ హీరో, హీరోయిన్ ఎవరెవరితో నటించిన కూడా.. ఒక ఇద్దరి కెమిస్ట్రీ మాత్రం అందరికీ నచ్చుతుంది.

See also  Akhil : తట్టుకోలేక బిల్డింగ్ మీద నుంచి దూకేసిన అఖిల్ వీడియో వైరల్.. ఆందోళనలో అక్కినేని కుటుంబం..

Tollywood-super-hit-couple-like

అలా ఆ హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ నచ్చితే.. మళ్ళీ వాళ్ళ సినిమా వస్తే బాగుండును అని ఎదురు చూస్తారు. ఆ జంటతో సినిమా వస్తుంది అంటే అందరూ ఎగబడింది చూస్తారు. అలాగే ఇటీవల కాలంలో ప్రేక్షకుల్ని అలరించిన కొన్ని జంటలు మళ్ళీ వాళ్ళు కలిసి నటిస్తున్నారు. అప్పట్లో అంటే హీరోయిన్స్, హీరోలు తక్కువగా ఉండటం ( Tollywood super hit couples ) వలన ఒక జంట నచ్చితే అదే జంట మళ్ళీ మళ్ళీ కనిపించేవారు. నాగేశ్వరావు -సావిత్రి, ఎన్టీఆర్ -సావిత్రి, భానుమతి ఇలా అందరూ కూడా మళ్లీమళ్లీ నటించేవారు. ఎందుకంటే.. అప్పట్లో తక్కువ మంది హీరోలు,అతి తక్కువ మంది హీరోయిన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఒక హీరో ఒక హీరోయిన్ తో నటించేస్తే.. మళ్ళీ వేరే హీరోయిన్ కొత్త కొత్తగా వచ్చేస్తున్నారు. ఒక జంటను మళ్ళీ మళ్ళీ చూపించడం కష్టంగానే ఉంటుంది.

See also  Neha Shetty: దాచుకున్న ఎద అందాలు డార్క్ మోడ్ లో ధార బొస్తున్న డీజే టిల్లు హీరోయిన్

Tollywood-super-hit-couple-those

అలాంటి ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో.. మళ్లీ మనకి జంటగా కనిపించబోయే మన టాలీవుడ్ స్టార్స్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం.. లవ్ స్టోరీ సినిమాతో నాగచైతన్య – సాయి పల్లవి జంట అందరికీ నచ్చింది. ఈ జంట మళ్ళీ చందు మొండేటి దర్శకత్వంలో నటిస్తున్నారు. అలాగే విజయ్ దళపతి – త్రిష వీళ్ళిద్దరి జంట అంటే అందరికీ చాలా ఇష్టం. మళ్ళీ వీళ్ళిద్దరూ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చాలా కాలం తర్వాత లియో సినిమాలో నటిస్తున్నారు. అలాగే రామ్ చరణ్ – కియారా అద్వానీ కలిసి మళ్ళీ గేమ్ చేజర్లో నటిస్తున్నారు. అలాగే మాస్ మహారాజ్ రవితేజ శ్రీలీల కలిసి నటించి.. బ్లాక్ బస్టర్ కొట్టారు మళ్ళీ ఈ జంట నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి, అనుష్క ఒక సినిమాలో ఒక పాటలో మెరిసారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి 157 సినిమాలో కలిసి నటిస్తారని అంటున్నారు. అలా మనకు ఇష్టమైన జంటలు మళ్లీ మనకు కనబడడానికి.. కనువిందు చేయడానికి ముందుకు వస్తున్నాయి.