Home Cinema Heroines: ఈ హీరోయిన్లు ఇండస్ట్రీ లో తండ్రి కొడుకులిద్దరితో రొమాన్స్ చేస్తూ ఆడి పాడి అలరించారు....

Heroines: ఈ హీరోయిన్లు ఇండస్ట్రీ లో తండ్రి కొడుకులిద్దరితో రొమాన్స్ చేస్తూ ఆడి పాడి అలరించారు. వాళ్ళు ఎవరంటే.?

Heroines Acting: మనందరికీ తెలిసిన విషయమే మన హీరోలు అరవై ఏళ్ల వయసు పైన పడుతున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పటికీ హీరోలుగా కొనసాగుతూనే ఉంటారు. కానీ హీరోయిన్ల విషయంలో అలా సాగదు. వాళ్లు కేవలం చాలా తక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఒక వేళ స్టార్డం తెచ్చుకుంటే ఓ దతాబ్దం పాటు తెర మీద కనిపిస్తారు. కానీ స్టార్డం లభించకపోతే మాత్రం వచ్చిన రెండు మూడు సంవత్సరాల లోపు ఇండస్ట్రీకి దూరమైపోతారు. అయితే స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్లు మాత్రం తండ్రులతో నటించి ఆ తర్వాత వాళ్ళ కొడుకుతో కూడా నటించిన నటీమణులు ఎందరో మన ఇండస్ట్రీలో లేకపోలేదు.

these-heroines-entertained-in-the-industry-by-acting-and-singing-romance-with-both-father-and-son

అలాంటి వాళ్ళ పేరు చెప్తే ముఖ్యంగా మనకు గుర్తించేది అలనాటి తార అతిలోకసుందరి శ్రీదేవి.. సీనియర్ ఎన్టీఆర్ నాగేశ్వరరావు గార్లతో పాటు నాగార్జునతో కూడా నటించింది. అంతేకాక ఎన్టీఆర్ తో నటించిన తర్వాత కూడా చాలా చిత్రాల్లో బాలకృష్ణతో నటించే అవకాశం లభించినప్పటికీ పలు కారణాల వల్ల శ్రీదేవి తిరస్కరించింది. ఇక జయసుధ కూడా సీనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ తో కూడా ఓ చిత్రంలో నటించింది. అలనాటి తార రాధ కూడా ఎన్టీఆర్ బాలకృష్ణతో పాటు ఏఎన్నార్ నాగార్జునలతో కూడా ఆడి పాడింది. ఇక ఇలాంటి కోవలోకి కాజల్ అగర్వాల్ కూడా ప్రస్తుతం ఉన్న ఇలాంటి హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది.

See also  Jr. NTR: జానియర్ ఎన్టీఆర్ ని దరిద్రం నుంచి బయట పడేయడానికి.. ఆ వ్యక్తి ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు.

these-heroines-entertained-in-the-industry-by-acting-and-singing-romance-with-both-father-and-son

మెగా పవర్ స్టార్ నటించిన మగధీర చిత్రంలో రామ్ చరణ్ సరసన ఆడిపాడి చిందులేసిన ఈ అమ్మడు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 చిత్రంతో చిరంజీవి సరసన కూడా మెరిసింది. అలా తండ్రి కొడుకులైనా చిరంజీవి రామ్ చరణ్ తో కలిసి నటించిన హీరోయిన్స్ జాబితాలో కాజల్ చేరిపోయింది. ఇక తను మాత్రమే కాకుండా తమన్నా సైతం కూడా ఈ జాబితాలోకి చేరింది. ఇక తమన్నా రాంచరణ్ తో కలిసి రచ్చ చిత్రం లో నటించిన తాజాగా చిరంజీవి నటించబోతున్న భోళా శంకర్ చిత్రంలో కూడా చిరంజీవి సరశన తమన్నా నటిస్తున్నది.

See also  Slik Smitha : సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ లో కీలకమైన రెండు విషయాలు ఏడుపు రప్పిస్తున్నాయి..

these-heroines-entertained-in-the-industry-by-acting-and-singing-romance-with-both-father-and-son

ఇక ఈ చిత్రానికంటే ముందే సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత నాగ చైతన్యతో వచ్చిన యుద్ధం శరణం గచ్చామి చిత్రంలో లావణ్య త్రిపాఠి నటించగా సోగ్గాడే చిన్ని నాయన సరసన కూడా లావణ్య త్రిపాఠి నాగార్జునతో ఆడి పాడి అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక తండ్రి కొడుకులు నటించిన హీరోయిన్ లిస్టులో చేరిన మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రారండోయ్ వేడుక చూద్దాం అనే చిత్రంతో నాగ చైతన్య తో హీరోయిన్ గా ఆడి పాడిన ఈ బ్యూటీ ఆ తర్వాత అక్కినేని నాగార్జున తో మన్మధుడు 2 చిత్రంలో నాగార్జున తో కలిసి రొమాన్స్ చేసింది. ఇక ఈ హీరోయిన్లు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రి కొడుకుల తో ఆడి పాడి అలరించిన  హీరోయిన్ జాబితాలో చేరిపోయారు.(Heroines Acting)