Heroines : నటీనటులు సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు అసలు మేము నిలబడగలమా? మాకంటూ ఒక గుర్తింపు వస్తుందా అనే భయంతో వస్తారు. ఆ తర్వాత వాళ్ళు నిలబడిన తర్వాత ఎంతకాలం ఉంటారు, ఎలా ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. కానీ అతి కొద్ది కాలంలో స్టార్డం వస్తే మాత్రం చాలా కాలం కొనసాగే ( heroines acted with father and son ) అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హీరోలకైతే చాలా ఎక్కువ కాలమే సినిమా రంగంలో నిలబడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హీరోయిన్స్ కి హీరోలతో పోల్చుకుంటే.. వాళ్లు ఎంత స్టార్ హీరోయిన్స్ ఐనా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్స్ గా నిలబడడం కష్టమే. ఎందుకంటే ఎంత ఏజ్డ్ హీరో కైనా మంచి యంగ్ హీరోయిన్ జతగా ఉండాలి.
తనతో పాటు నటించిన పాత హీరోయిన్స్ అందరూ తల్లి పాత్రలోకి, అక్క పాత్రలోకో, అమ్మమ్మల పాత్రలోకి వెళ్ళిపోతారు గాని.. హీరో మాత్రం ఇంకా వయసులో ఉన్న మంచి అమ్మాయిలతో డాన్స్ చేస్తూ, ఫైట్ చేస్తూ యంగ్ గా ఉన్నట్టే కనిపిస్తాడు. అదే హీరోల్లో ఉన్న ప్లస్ పాయింట్. వీళ్ళు మాత్రం రెండు మూడు జనరేషన్ల అమ్మాయిలతో ( heroines acted with father and son ) కుర్రకారులగా నటించేసి మంచి రొమాన్స్ చేస్తారు. అయితే హీరోయిన్స్ కూడా ఒకటి రెండు తరాల తో కలిసి నటించే హీరోయిన్స్ కూడా లేకపోలేదు. స్టార్డం తెచ్చుకున్న హీరోయిన్స్ అందరూ ఎక్కువ కాలం హీరోయిన్స్ గానే నటిస్తూ ఉండలేరు కానీ.. కొందరు హీరోయిన్స్ మాత్రం స్ట్రాంగ్ గా ఎక్కువ కాలమే ఉండి తండ్రితోను.. కొడుకుతో కూడా నటించి రొమాన్స్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు.
అతిలోకసుందరి శ్రీదేవి.. అక్కినేని నాగేశ్వరావు గారితో నటించింది. ఆయన కొడుకు నాగార్జునతో ఆఖరిపోరాటం, గోవింద గోవింద సినిమాల్లో కూడా నటించింది. అలాగే జయసుధ కూడా ఎన్టీఆర్ తోనీ నటించింది అలాగే ఆయన కొడుకు బాలకృష్ణతో కూడా ఆమె నటించింది. రాధ కూడా ఎన్టీఆర్ తోనీ నటించింది.. ఆయన కొడుకు ( heroines acted with father and son ) బాలకృష్ణతో కూడా నటించింది. అలాగే రాధా ఏఎన్ఆర్ తోనీ నటించింది. ఆయన కొడుకు నాగార్జునతో కూడా నటించింది. ఇక పాత హీరోయిన్లను పక్కన పెడితే కొంచెం కొత్త హీరోయిన్ కాజల్ ముందు కొడుకుతో మగధీరలో రామ్ చరణ్ తో నటించిన తర్వాత తండ్రితో చిరంజీవితో కలిసి ఖైదీ నెంబర్ 150 లో నటించింది.
ఇలా చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి నటించిన ఘనత తమన్నాకు కూడా దక్కింది. రచ్చ సినిమాలో తమన్నా రాంచరణ్ తో నటించగా.. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి హీరోయిన్గా తమన్నా నటించింది. రకుల్ ప్రీత్ సింగ్ నాగచైతన్య తో కలిసి రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించింది. ఆ తర్వాత అతను తండ్రి నాగార్జునతో కలిసి మన్మధుడు 2 లో నటించింది. ఇలా తండ్రి కొడుకులతో రొమాన్స్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు. కాకపోతే ముందు జనరేషన్ వాళ్ళు ముందు వాళ్ళతో నటించిన హీరోయిన్ ని తర్వాత వాళ్ళ కొడుకులతో నటిస్తే.. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ముందు కొడుకులు నటించేసిన హీరోయిన్ తో తండ్రులు పోటీపడి మరి నటిస్తున్నారు..