Home Cinema Nidhhi Agerwal: వేణు స్వామి చేసిన ఆ పూజలు నిధి అగర్వాల్ కి కలిసి వచ్చినట్టేనా.?

Nidhhi Agerwal: వేణు స్వామి చేసిన ఆ పూజలు నిధి అగర్వాల్ కి కలిసి వచ్చినట్టేనా.?

Actress Nidhhi Agerwal: ఎంతో అందం మూట కట్టుకున్న ఈ అమ్మడు నిధి అగర్వాల్ పుట్టింది మన హైదరాబాదులోనే.. కానీ తన సినీ జీవితం మొదలు పెట్టింది మాత్రం బాలీవుడ్లో.. ఇక ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య సరసన సవ్యసాచి అనే చిత్రంతో తెలుగు సినిమా ప్రపంచంలో ఓ గ్లామర్ బ్యూటీగా తన దైన శైలిలో ముద్ర వేసుకుంది. కేవలం తన గ్లామర్ తోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం తన సినీ కెరీర్ బాగుండాలని మంచిగా ముందుకు పయనం అవ్వాలని మంచి మంచి చిత్రాలలో సూపర్ అవకాశాలు రావాలని..

the-worship-done-by-venu-swami-has-come-together-with-actress-nidhhi-agerwal

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేత నిధి అగర్వాల్ ఇంట్లో రాజ శ్యామల యాగం చేయించుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక ఈ యాగాన్ని వేణు స్వామి సమక్షంలో ఎంతో నియమనిష్ట నిబంధనలతో జరిపించిన ఈ యాగం వల్ల నిధి అగర్వాల్ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కిందా మరి ఆమెకు అవకాశాలు లభిస్తున్నాయా అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి.. ఎందుకంటే? ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరహర వీరమల్లు అనే చిత్రంలో ఈ బ్యూటీ అవకాశం కొట్టేసింది. నిజానికి చెప్పాలంటే రాజశ్యామల యాగం చేయకముందే ఈ అమ్మడు ఈ చిత్రానికి సైన్ చేసింది. కానీ.. ఈ సినిమా అనేక కారణాల చేత లేట్ అవుతూ ముందుకు సాగడం లేదు..

See also  Chiranjeevi : ఇండస్ట్రీ కుటుంబానికి చెందిన ఆ స్త్రీ వలన చిరంజీవి అన్ని బంధాలను వదిలేసి చివరికి ఇలా మిగిలాడట..

the-worship-done-by-venu-swami-has-come-together-with-actress-nidhhi-agerwal

మనందరికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితంలో ఎంత బిజీగా ఉన్నాడో తెలిసిన విషయమే.. అయినప్పటికీ మరో పక్క తాను కమిట్మెంట్ ఇచ్చిన చిత్రాలను పూర్తి చేస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పనులు మొత్తం వాయిదా పడ్డాయి. మరి ఎప్పుడు పూర్తవుతుందో? ఎప్పుడు విడుదల అవుతుందో? అన్న విషయాలపై నిధి అగర్వాల్ కూడా చాలా ఆందోళనలో పడిందనే చెప్పాలి. దాంతో అలాంటి సమయంలోనే నిధి (Actress Nidhhi Agerwal) ఇంట్లో పూజలు చేయించుకోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు ఎలాగో అలా ఆ పూజలు అయితే చేయించుకుంది. కాబట్టే ప్రస్తుతం ఆమెకు మాలీవుడ్ లో ఓ రెండు చిత్రాలకు సైన్ చేసిందన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

See also  Naga Chaitanya: ఒరినాయనో..!! సమంత కంటే ముందే ఆమెతో ఎఫైర్ నడిపించిన నాగచైతన్య.??

the-worship-done-by-venu-swami-has-come-together-with-actress-nidhhi-agerwal

మాలీవుడ్ లో సదా సీదా హీరోలతో కాకుండా ఇద్దరు అగ్ర హీరోలతోనే సినిమాలు చేయబోతుందట.. ప్రస్తుతం అందుకు సంబంధించిన మొత్తం విషయాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. దాంతో వేణు స్వామి చేయించిన పూజల వల్లే నీది అగర్వాల్ కి ఆ పూజలు చేయించిన తగ్గ ఫలితం వచ్చిందని చెప్పవచ్చు. ఇకపోతే తెలుగులో అవకాశాలు రాకపోయినప్పటికీ ఏదో ఒక భాషలో అగ్ర హీరోలతో అవకాశం వచ్చింది అక్కడైనా తన నటన ద్వారా మంచి అవకాశాలు లభిస్తూ స్టార్ హోదాని అందుకుంటే మాత్రం కచ్చితంగా మళ్ళీ టాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది అలుగూరు సినీ ప్రముకులు భావిస్తున్నారు.