The Star Heroine: అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీ విద్య మన తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన మలయాళీ ముద్దుగుమ్మ ఆయనప్పటికీ చూడడానికి అచ్చ తెలుగు అమ్మాయిల మన తెలుగింటి ఆడపడుచు గా కనిపిస్తూ ఎందరో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న తెలుగులో ఎన్నో చిత్రాలు తన దైన శైలిలో ఎన్నో పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు దక్కించుకొని ఇక్కడ చిర స్థాయిగా నిలిచినటువంటి ఆమె జీవితంలో పలు ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి. అవేమిటంటే.. ఇరవై రెండు ఏళ్ళ వయసు లోనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే
మలయాళీ అసిస్టెంట్ డైరెక్టర్ అయినటువంటి డైరెక్టర్ జార్జ్ ఆమె ప్రేమలో మునిగిపోయిందట.. కాగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఆమెని అసలు వద్దని ఎంత చెప్పినా వాళ్ల మాటలు అసలు లెక్కచేయకుండా ఇంట్లో వాళ్ళని పక్కన పెట్టి మరి జార్జిని చాలా గుడ్డిగా నమ్మి అతడిని వివాహం చేసుకున్న దట.. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లో నే వీళ్లిద్దరి మధ్యల ఏవో ఏవేవో మనస్పర్ధలు రావడంతో ఇక చేసేదేమీ లేక 1980 సంవత్సరంలోనే అతనితో విడాకులు తీసుకుని విడిపోయింది. భర్తతో విడాకుల అనంతరం ఆమె నడి రోడ్డు మీద నిలబడుతూ అసలు ఏం చేయాలో తెలియని దీన స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఎదుర్కొన్నది..
అయితే శ్రీ విద్య తల్లి ఎం ఎల్ వసంత కుమారి మళ్లీ చేర దీయడంతో ఏవీఎం సంస్థ బ్యానర్ లో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసింది. అలా మళ్లీ ఆమె జీవితం తిరిగి కొత్తగా మలుపు తిరిగింది. అయితే ఆమె ప్రేమించిన వ్యక్తి ఎవరో కాదు లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గాఢంగా ప్రేమించింది. అతడినే సర్వస్వం అంటూ పూర్తిగా నమ్మేసింది. కమల్ హాసన్ వివాహం చేసుకుంటాడని ఎంత గానో ఎదురు చూసింది. కానీ చివరికి అతను ఎంత గానో ద్రోహం చేశాడని తెలుస్తుంది. కమల్ శ్రీ విద్య ను కాదని చాలా వివాహాలు చేసుకోవడమే కాకుండా ఎన్నో యవ్వారాలు కూడా నడిపాడు.
ఇక ఆ తర్వాత ఎవరిని వివాహం చేసుకోకుండా శ్రీ విద్య 2006వ సంవత్సరంలో బోన్ క్యాన్సర్ తో మరణించింది ఆమె చనిపోవడానికి ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో నేను వివాహం చేసుకోవాలని అనుకున్న ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడే స్వయంగా పిలిచి తన చిత్రంలో అతడికి అమ్మ పాత్ర వేయననడంతో వేశానని తెలియపరిచింది. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉంటాయని అయితే ఇలాంటి క్షమించే గుణం మీకు వచ్చిందని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం అది కచ్చితంగా ఆ భగవంతుడు కరుణించిన ప్రసాదంగా భావిస్తానని చెబుతానంటూ శ్రీ విద్య తెలియ పరిచింది. ఇక ఏది ఏమైనాప్పటికీ నాకు పెళ్లికి ముందున్న జీవితమే ఎంతో బాగుందని కూడా శ్రీ విద్య (The Star Heroine) వివరించింది.