Home Cinema Sai Dharam Tej: పెళ్ళయిన ఆ స్టార్ హీరోయిన్ నా క్రష్ అంటూ తెలిపిన సుప్రీం...

Sai Dharam Tej: పెళ్ళయిన ఆ స్టార్ హీరోయిన్ నా క్రష్ అంటూ తెలిపిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్..

The Supreme Hero: మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనేంటో తన మొదటి సినిమా తోనే తెలుగు చిత్ర పరిశ్రమలో నిరూపించుకున్నాడు. ఇక ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విరూపాక్ష చిత్రం మనందరికీ తెలిసిన విషయమే.. ప్రమాదం నుండి కోలుకున్న తరువాత వచ్చిన తన మొదటి సినిమా కావడంతో అదే విధంగా ఈ సినిమా కూడా మంచి విజయాన్ని కైవసం చేసుకోవడంతో ఆయనకు అన్నీ కలిసి వచ్చాయి. దర్శకుడు కార్తీక్ వర్మ దండు నిర్మించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కు జంటగా సంయుక్త మీనన్ నటించినది.

See also  Jabardasth show: జబర్దస్త్ షో నిలిపివేయనున్నారా.? దానికి కారణం అనసూయ ఉసురు తగలడమేనా..

the-married-star-heroine-is-the-supreme-hero-who-said-that-she-is-my-crush

విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం మంచి హిట్ టాక్ తో దూసుకుపోయింది. విడుదలైన మొదటి వారంలోని భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు బద్దలు కొట్టింది. మరి అదే విధంగా సాయి ధరం తేజ్ సినీ కెరియర్లో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకోగలిగాడు ఈ చిత్రం ద్వారా.. ఇక మనకు తెలిసిన విషయం ప్రకారం ఒక సంతోషకరమైన విషయం ఉంది. అదేంటంటే ఈ సినిమా సీక్వెల్ కూడా రాబోతోంది.. ఇక ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఫుల్ ఖుషి లో ఉన్నాడు. సుప్రీం హీరో (The Supreme Hero) దాంతో ఈయన సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేశాడు.

See also  Anushka : అనుష్క అసలు విషయం బయటపడిపోయింది.. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి?

the-married-star-heroine-is-the-supreme-hero-who-said-that-she-is-my-crush

ఇక ఈ చిత్రం విడుదలకు ముందే ప్రమోషన్ లో పాల్గొన్న ఈయన ఎన్నో విషయాలు తెలిపినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తన అభిమానుల కోసం మరిన్ని వ్యక్తిగత విషయాలు వాళ్లతో పంచుకున్నాడు. #ASKSDT అనే హ్యాంగ్ స్టాక్ తో అభిమానులతో ముచ్చటిస్తూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఇక తన అభిమానులు అడిగే ఒక్కో ప్రశ్నకు ఒక్కొక్కటిగా సమాధానాలు చెబుతూ వచ్చాడు సాయి ధరం తేజ్.. ఇక అందులో భాగంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్న ఏంటంటే నీ క్రష్ ఎవరు అని అడిగాడు.. దాంతో సుప్రీం హీరో స్పందిస్తూ టక్కున సమంత అని సమాధానం చెప్పాడు.

See also  BIG BOSS 7: ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 లో నాగార్జున రెమ్యూనరేషన్ ఎంత పుచ్చుకున్నాడో తెలిస్తే పిచ్చేక్కాల్సిందే..

the-married-star-heroine-is-the-supreme-hero-who-said-that-she-is-my-crush

దాంతో కొందరు పెళ్లయిన హీరోయిన్ క్రష్ అవ్వడం ఏంటంటే రిప్లై ఇస్తున్నారు. మరి ప్రస్తుతం ఉన్న హీరోలలో మీ అభిమాన హీరో అని ఎవరంటే రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ అని సమాధానం తెలిపాడు. ఇక ఇదే విషయంపై సదరు మెగా అభిమానులు మెగా కాంపౌండ్ లో అంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ కూడా సుప్రీం హీరో.. రవితేజ, ప్రభాస్ అంటే ఇష్టమని సాయి ధరంతేజ్ చెప్పడంతో ఇదే విషయాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే సాయి ధరంతేజ్ అలాగే చిత్ర యూనిట్ మొత్తం విరూపాక్ష విజయాన్ని అంబరంగా సంబరంగా వేడుక చేసుకుంటున్నారని చెప్పాలి.