
Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత, త్రిష, అనుష్క వీళ్ళందరికీ ఎంత పెద్ద క్రేజ్, ఇమేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళలో త్రిష సంగతికి వస్తే.. ఆమె తన సినిమాలతో తాను బిజీ బిజీగా ఉంది. అలాగే అనుష్క ( Samantha will act with that Bollywood star hero ) బాహుబలి సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమె నాలుగు సంవత్సరాలు పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ తర్వాత ఇటీవల రిలీజ్ అయిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమాపై అసలు అంచనాలు లేకపోయినా కూడా రిలీజ్ అయిన తర్వాత అందరినీ ఆకట్టుకుంది.
ఇకపోతే సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. కొంతకాలం తనకు రెస్ట్ కావాలంటూ.. ఖుషి సినిమాను పూర్తిచేసి.. అలాగే తను చేస్తున్న వెబ్ సిరీస్ ని కూడా పూర్తిచేసి.. మిగిలిన సినిమాల అడ్వాన్సుల్ రిటన్ ఇచ్చి మరి రెస్ట్ లో ఉంది. అయితే సమంత, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ఖుషి సినిమా ఇటీవల రిలీజ్ ( Samantha will act with that Bollywood star hero ) అయింది. ఈ సినిమాపై అందరూ భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. గాని అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. డిజాస్టర్ గా కూడా మిగలలేదు. కలెక్షన్స్ దగ్గర ఎంత చూసుకున్నా కొంత వీక్ గానే ఉందనే ప్రచారాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత రెస్ట్ లో ఉండగా ఆమెకు మరొక క్రేజీ ఆఫర్ వచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా సినిమా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ తో సల్మాన్ ఖాన్ హీరోగా, కరణ్ జోహార్ ఒక ప్రాజెక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా డిసైడ్ అయ్యారు గాని హీరోయిన్ ఎవరు ( Samantha will act with that Bollywood star hero ) పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఇటీవల రిలీజైన జవాన్ సినిమాలో షారుక్ ఖాన్ సరసన నయనతార నటించడంతో అది బ్లాక్ బస్టర్ మనందరికీ తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో కూడా సౌత్ ఇండియా నుంచి హీరోయిన్ పెడదామని ఆలోచించారట. ఆలోచనలో త్రిష, అనుష్క వీళ్లిద్దరిలో ఎవరినైనా సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్గా పెడదామని కరన్ జోహార్ మొదట ఆలోచించాడంట.
ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరికంటే సమంతానే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారు అంట. సల్మాన్ ఖాన్ పక్కన సమంతాను పెట్టి సినిమా తీయాలని ఆలోచనలో ఉన్నారట. అయితే మరి సమంత ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న ఆమె ఇప్పుడు సినిమా ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియదు కానీ.. దీనిపై నెటిజనులైతే రియాక్ట్ అవుతున్నారు. సల్మాన్ ఖాన్ హైటు, అతని పర్సనాలిటీ పక్కన సమంత ఎలా ఉంటుంది.. అసలు ఇద్దరికీ జోడీ కుదురుతుందా అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు అదొక కొత్త జోడిలా ఉంటుంది కదా ఖచ్చితంగా అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తారని మరికొందరు అంటున్నారు. ఈ ఇద్దరు జోడి నిజంగా తెరపైకి వస్తుందా? వస్తే సక్సెస్ ని అందుకుంటుందా అనేది తర్వాత తెలుసుకోవాల్సిందే..