Home Cinema Athulya Ravi: ప్రేమకంటే ముఖ్యమైనది.. పెళ్ళికి ముందు కావాల్సింది, చేసుకోవాల్సింది అదేనంటూ ప్రేమికులకు సలహ ఇస్తున్న...

Athulya Ravi: ప్రేమకంటే ముఖ్యమైనది.. పెళ్ళికి ముందు కావాల్సింది, చేసుకోవాల్సింది అదేనంటూ ప్రేమికులకు సలహ ఇస్తున్న హీరోయిన్.

Athulya Ravi: తెలుగు చిత్ర పరిశ్రమ లోకి నిత్యం ఎందరో కొత్త కొత్త హీరోయిన్లు పరిచయం అవుతూనే ఉంటారు. అలాంటి మన టాలీవుడ్ లోకి మీటర్ అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది యంగ్ బ్యూటీ ఆతుల్య రవి.. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో భాగంగా పాల్గొన్న ఈ అమ్మడు మారుతున్న కాలానికి అనుగుణంగా పెళ్లి వంటి పలు విషయాల గురించి ఇక్కడి పద్ధతులు సంస్కృతి సాంప్రదాయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆ వాక్యాలు ఒక్క సారిగా సోషల్ మీడియా అంతటా చుట్టూ ముట్టేస్తూ వైరల్ గా మారాయి. దాంతో ఈ అమ్మడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లోకి వచ్చి సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి.

the-heroine-athulya-ravi-advises-the-lovers-that-what-is-more-important-than-love

తెలుగులో ఈ బ్యూటీ నటించిన మీటర్ చిత్రం తర్వాత ఆతుల్య కు (Athulya Ravi) ఆశించిన స్ధాయిలో అంతగా తెలుగులో మరే చిత్రాలలో అవకాశాలు తలుపు తట్టలేదు. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో.ఈ బ్యూటీ చేతిలో వరుసగా సినిమాలు క్యూ కట్టడంతో ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాలలో నటిస్తూ చాలా బిజీ బిజీగా తన సినీ లైఫ్ ను కొనసాగిస్తుంది. అయితే కోలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీ ఇటీవలే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తన కెరియర్ గురించి కూడా మాట్లాడింది. అందులో భాగంగా ఆమె తన అభిప్రాయాల గురించి వ్యక్తం చేయడానికి నేను సందేహపడను నిర్మోహమాటంగా ఏదైనా సరే తెలియజేస్తాను అంటూ తన మనసులో దాచుకొని దాని గురించి ఆవేదన చెందుతూ మదనపడను అంటూ పలు విషయాలు వెల్లడించింది.

See also  RGV: నువ్వు NTR - MGR అనుకుంటున్నావా.? అంటూ పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.

Actress athulya Ravi

ఇక ఇదే విషయం సినిమా లోనూ ఎంపికలోను నేనంటే అంటూ ఆమె మాట్లాడింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న యువతలో సహజీవనం చేసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో వాళ్ళ మధ్య రిలేషన్లు కొత్త రూపులు సంతరించుకుంటున్నాయి అంటూ ఆమె మాట్లాడింది. ఇక ఆమె దృష్టిలో సహజీవనం అనేది చాలా వ్యక్తిగతమైన విషయం. పెళ్లికి ముందు నేను అస్సలు సహజీవనం చేయడానికి అంగీకరించను. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం.. అదే కావాలనుకునేవారు పెళ్లి అనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టి పెళ్లి చేసుకొని అలాంటి పనులు చేయడం ఉత్తమం అంటూ వెల్లడించింది. ఇక ఇదే కాకుండా నేటి యువత ప్రతి ఒక్కరు ప్రేమ అనే దారిలో తిరుగుతూ అదే జీవితం గా అనుకుంటున్నారు.

See also  Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ పై సంచలన వార్త!

Heroine Athulya Ravi

ముందు వాళ్ళు ప్రేమలో ఉన్నవాళ్లు మీరు మీ జీవితంలో స్థిర పడిన తర్వాతే పెళ్లి అనేది దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. లేదంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేసింది. ఇది కేవలం నా అభిప్రాయం నా వ్యక్తిగత నా మనసులో ఉన్న మాట అంటూ కుండబద్దలు కొట్టి చెప్పింది. దాంతో ఒక్క సారిగా ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఇటు వెబ్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవ్వడంతో ఆమె అభిమానులు సైతం ఆమె మాట్లాడిన ఈ మాటలను షేర్ చేయసాగారు. మరో వైపు ఆమె నిత్యం తన సోషల్ మీడియా ఖాతాలో ఘాటైన హాటు సొగసైన సోకుల వంటి ఫోటోషూట్స్ ను పోస్ట్ చేస్తున్నడంతో విపరీతంగా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..