Devara: ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా గురించి ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై సినీ వర్గంలో ఎన్టీఆర్ అభిమానులు ( Devera movie got crores of money in losses ) విపరీతమైన భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆస్కార్ అవార్డు సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టు ఇది. గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేలా చూసుకోవాలని.. కచ్చితంగా ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారని విషయం అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో జాన్వి కపూర్ తొలిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. జాన్వీ కపూర్ కి కూడా ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం దొరకాలని ఆశగా ఎదురు చూస్తున్న సంగతి ( Devera movie got crores of money in losses ) ఆవిడ ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. దీనితో ఆమె కోరిక కూడా తీరుతుంది. అంతేకాకుండా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ని హిందీలో మాత్రమే కాకుండా తెలుగులో వాళ్ల హీరో సరసన నటించేలా చూడాలని కోరుకున్న అభిమానుల కోరిక కూడా తీరుతుంది. ఈ రకంగా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ అయితే క్రియేట్ చేశాడు కొరటాల శివ.
ఇదిలా ఉంటే దేవర షూటింగ్ అప్డేట్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో ఇప్పుడు ఒక కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవర షూటింగ్ దశలోనే 20 కోట్ల వరకు నష్టపోయిందని.. దానికి కారణం కూడా జూనియర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. అసలు షూటింగ్ దశలోనే 20 కోట్లు ( Devera movie got crores of money in losses ) నష్టం ఏమిటి? దానికి మళ్ళీ కారణం మా హీరో ఏంటని అభిమానులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాటన్నిటిని ఎన్టీఆర్కి చూపించారంట.
వాటిని పరిశీలించిన ఎన్టీఆర్ కొన్ని సీన్స్ కి ఎన్టీఆర్ సంతృప్తి పడలేదంట. దేవర సినిమా పాన్ ఇండియా సినిమా అవడం వలన దేశంలో ఉన్న అందరికీ ఈ సినిమా ఎక్కేలా ఉండాలని.. అంత ప్రతిష్టాత్మకంగా తీయాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నారట. ఈ క్రమంలోనే నాలుగో షెడ్యూల్లో సైఫ్ హాలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మీద క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారంట. అవి చూసిన ఎన్టీఆర్కి అస్సలు సంతృప్తి కలగలేదంట. ఆ మొత్తం ఎపిసోడ్ని మళ్లీ తీయమని చిత్రీకరించమని చెప్పారంట. అలాగే ఇంకొన్నిటిలో కొన్ని సీన్స్ నచ్చలేదంట. వాటిని మళ్ళీ రీ షూట్ చేయమని చెప్పాడు అంట. ఎన్టీఆర్ చెప్పిన తర్వాత చిత్ర బృందం కచ్చితంగా చేసి తీరాలి. అది మళ్ళీ చేయడం వలన నిర్మాతలకు 20 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు అంట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఈ సినిమా మీద అంత శ్రద్ధ పెడుతున్నారని అర్ధం..