Nayanthara: మొదట మలయాళం మరియు తమిళ చిత్రాలలో విజయాలు సాధించిన నయనతార తెలుగులో వెంకటేష్ సరసన లక్ష్మీ చిత్రంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు పొందుతూ ఎన్నో చిత్రాల్లో నటించిన నయనతారకు లేడీస్ సూపర్ స్టార్ గా పేరు పొందింది. దాదాపు సౌత్ లో అన్ని భాషల్లో తాను నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాలను చేయనుంది. సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నయనతార దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది అయినప్పటికీ ఈమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
హీరోయిన్లలో అత్యధిక రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్న హీరోయిన్ గా నయనతార మొదటి స్థానంలో ఉంది. ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు ఇన్నేళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు దీటుగా ఏమాత్రం తన క్రేజ్ తప్పించుకోకుండా అదే హోదా అనుభవిస్తూ పాపులారిటీ తన సొంతం చేసుకుంది. ఇంతటి స్టార్డం దక్కించుకున్న నయనతార అంటే అసలు ఆ స్టార్ హీరోకు నచ్చేది కాదట.. నయనతారని చూస్తేనే ఆ స్టార్ హీరో చీదరించుకుంటాడని సమాచారం. మరింతకు ఆ స్టార్ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు ఏ విషయంలో ఇలా జరిగిందంటే..
సాధారణంగా తల పొగరు ఉన్న హీరోయిన్లను ఎవరైనా సరే భరించడం కష్టమని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు చెప్పిన మాట వినరు.. వాళ్ళు చెప్పిందే నెగ్గాలి అన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అందుకే అలాంటి వాళ్ళని చాలా దూరం పెట్టేస్తుంటారు కొందరు. మామూలు జనాలు సామాన్యులకే కాదు ఇండస్ట్రీలో చెందిన వాళ్లలో కూడా చాలామందికి తల పొగరు ఉందనే చెప్పాలి. ముఖ్యంగా హీరోల కంటే హీరోయిన్లలో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. రెండు మూడు హిట్లు అందుకోగానే కొందరు స్టార్ హీరోయిన్ల ఫీల్ అవుతూ తల పొగరు చూపిస్తూ ఉంటారు.
ఎందుకంటే మమ్మల్ని ఏమనరులే అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఇండస్ట్రీలో చాలామందికి తలనొప్పిగా మారుతుంటారు. ఇలాంటి హీరోయిన్లను కొంతమంది స్టార్ హీరోలు వారి దగ్గరికి దరి చేరనివ్వరు కూడా.. ఈ క్రమంలోనే మహేష్ బాబు కూడా ఒక హీరోయిన్ ని అంటే బాగా చీదరించుకుంటాడట.. ఆమె ఎవరో కాదు ((Nayanthara)) నయనతార.. మహేష్ బాబు తో దాదాపు మూడు చిత్రాలతో ఆమెకు అవకాశం వచ్చినప్పటికీ మహేష్ బాబు వద్దని చెప్పాడట. ఎందుకంటే ఆమె మూవీ ప్రమోషన్ లో కూడా అసలు యాక్టివ్ గా ఉండదని, ఇదేకాక మీకు చాలా తల పొగరు ఉంటుందని అలాంటి వారితో మూవ్ అవ్వడం చాలా కష్టమైన పని అని మనకు తెలిసిన సమాచారం.