Superstar Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. దక్షిణ భారత దేశంలోనే కాక యావత్ దేశం మొత్తం సూపర్ స్టార్ హీరో గా.. ఓ తలైవాగా ఎంతో గుర్తింపు పొందాడు.. ఇక తన సొంత రాష్ట్రం తమిళంలో ఎంత గొప్ప నటుడో అంత ఫేమస్ హీరో గురించి ప్రతి ఒక్క ప్రేక్షకులకు తెలుసు. తమిళ్ లో ఎంత మందికి తెలుసో తెలుగులో కూడా అంతే.. కోట్లాదిమంది అభిమానులని భాష ఏది అనేది లేకుండా అవలీలగా ఆయన సొంతం చేసుకున్నాడు. ఏ హీరోకి లేని ఏ హీరోకి రాని గుర్తింపు ఆయనకే దక్కిందని చెప్పాలి. అది ఎలాగంటే రజనీకాంత్ నటించినటువంటి ఎన్నో చిత్రాలు ఇతర భాషలలో కూడా విడుదలై సూపర్ డూపర్ హిట్ సంపాదించుకునేవి. మనందరికీ తెలిసిందే రజనీకాంత్ నటించిన రోబో చిత్రం గురించి ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శంకర్ కాగా 100 కోట్ల క్లబ్ లో చేరిన మూడవ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం అనంతరం అందుకు సీక్వెల్ గా రోబో 2 చిత్రం కూడా విడుదలై ఆశించిన స్థాయిలో అంచనాలను అయితే రాబట్టింది.
ఏడు పదుల వయసు దాటిన రజనీకాంత్ గురించి చెప్పాలంటే అసలు చూడ్డానికి చాలా సింపుల్ గా హీరో మెటీరియల్ లా ఉండనే ఉండరు. కానీ ఆయన నటనతో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. ఇక సినిమా ఇండస్ట్రీలో కడుగు పెట్టిన మొదట్లో హీరో గానే కాకుండా విలన్ గా కూడా ఎన్నో పాత్రలో నటించి అందరి మెప్పు పొందాడు. ఏడు పదుల వయసు దాటినప్పటికీ ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అంటే అది ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యనే విడుదలైన జైలర్ చిత్రం కూడా విడుదల సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా 650 కోట్ల వసూలను దాటిపోయింది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ కు సంబంధించిన ఓ వార్త అయితే నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే ఇంత పెద్ద గొప్ప సంచల సృష్టించినటువంటి రజనీకాంత్ కి ఓ మహిళ గుళ్లో పది రూపాయల బిక్ష వేసిందట. ఓ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ షూటింగ్ ముగించుకొని రజినీకాంత్ గుడికి వెళ్లారట దర్శనం అనంతరం గుడిలో ఓ పక్కన కూర్చున్నారట.
అప్పుడు రజనీకాంత్ (Superstar Rajinikanth) వేసుకున్న వేషధారణ చూసి ఓ గుజరాతి మహిళా బిచ్చగాడు అనుకుని పది రూపాయల నోటు అతను చేతిలో పెట్టి వెళ్లిపోయిందట. ఇక ఇది గమనించిన అక్కడున్న వాళ్ళందరూ వచ్చి ఆమెను పట్టుకొని నువ్వు ఏం చేశావో తెలుస్తుందా అంత పెద్ద స్టార్ హీరోకి నువ్వు ₹10 దానం చేస్తావా నీకెలా కనిపిస్తున్నాడు ఆయన బిచ్చగాడు అనుకుంటున్నావు అంటూ ఆమెను తెగ తిట్టారట. దాంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఆ గుజరాతి మహిళ తనను ఏం చేస్తారో అన్న భయంతో తెగ భయపడి పోయిందట.
కాగా రజనీకాంత్ మాత్రం వాళ్ళందరికీ నచ్చజెప్పి ఆమెకు నేనెవరో తెలియదు కనుక ఇలా జరిగింది అంటూ ఆ గొడవను అంతటితో ముగించాడట. అసలు విషయం తెలుసుకున్న ఆ గుజరాతి మహిళ నన్ను క్షమించండి నా 10 రూపాయలు నాకు అని అడగ్గా రజనీకాంత్ నా దగ్గరే ఉండనీయండి అని గుజరాతి మహిళను పంపించేసాడట. ఇంకా ఇదే కాకుండా ఆ పది రూపాయల కు మరో 10 లక్షలు జోడించి ఓ అనాధ శరణాయానికి దానం చేశాడట రజనీకాంత్.. కాగా అంత పెద్ద స్టార్ హీరో సూపర్ స్టార్ అయినప్పటికీ ఆ మహిళపై కొంచెం కూడా కోపం తెచ్చుకోకుండా రజినీకాంత్ వ్యవహరించినటువంటి తీరు అక్కడున్న వాళ్ళందరిని ఎంతో ఆకట్టుకున్నదట..