Animal movie : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిందే. ఆ క్రేజ్ ఈరోజుకి అలాగే అతనికి నిలబడి ఉండడం నిజంగా ( Star hero rejected the Animal movie ) అదృష్టం. అందుకే ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ హీరోగా ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమాపై యావత్ భారతదేశం ఒక కన్నేసి ఉంది. ఈ సినిమా మొదట అనౌన్స్ చేసినప్పుడు ఎవరు పెద్దగా క్రేజ్ చూపించలేదు కానీ.. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి.
డిసెంబర్ ఒకటో తేదీని సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అనిమల్ ( Star hero rejected the Animal movie ) సినిమా చిత్ర బృందం వాళ్ళు .. వాళ్ళ ప్రమోషన్స్ కూడా చాలా స్పీడ్ చేశారు. లేకపోతే వాళ్ళ ప్రమోషన్ తీరు విధానం కూడా చాలా యాక్టివ్ గా తెలివిగా చేసుకుంటున్నారు. తెలుగు భాషలో అసలు ఎటువంటి క్రేజ్ లేని హీరో రణ్బీర్ కపూర్.. అతనికంటూ ఏమి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం లేదు. కానీ అనిమల్ సినిమా కోసం మాత్రం తెలుగు ఆడియోస్ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేలా ప్రమోషన్ చేసుకున్నారు చిత్ర టీం వాళ్ళు.
సందీప్ రెడ్డి వంగ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలతోనే ఉన్నారు. విపరీతమైన కాన్ఫిడెన్స్ తో ఆయన అర్జున్ రెడ్డి కంటే కూడా ఎక్కువ సక్సెస్ అవుతుందని కచ్చితంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక దర్శకుడు అంత కాన్ఫిడెంట్గా చెప్పడంతో.. మరోపక్క ప్రమోషన్స్ భారీగా నడుస్తుండడంతో.. టీజర్, ట్రైలర్, టలు అందర్నీ ( Star hero rejected the Animal movie ) ఆకట్టుకోవడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాల పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా రణ్బీర్ కపూర్ ని అనుకోలేదంట. అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన వెంటనే సందీప్ రెడ్డి వంగతం సెకండ్ సినిమా మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడంట. మహేష్ బాబు కోసమే ఈ కథను రాసుకుని వెళ్లి కధ వినిపించాడంట. అయితే కథ నచ్చింది కానీ.. ఇంత వైల్డ్ గా ఇంతవరకు నేను నటించలేదని, అలాంటి పాత్రని నటిస్తే యాక్సెప్ట్ చేస్తారో, లేదో తెలియదు కనుక చేయనని చెప్పేసాడంట.
ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా హిందీలో రీ మేక్ చేసి అది బ్లాక్ బస్టర్ ఫిట్ అవ్వడంతో.. రన్బీర్ కపూర్ కన్ను సందీప్ రెడ్డి వంగ మీద పడిందంట. అందుకే అతనితో సినిమా చేయాలని రన్బీర్ కపూర్ ఆశపడడంతో.. ఈ కథ కూడా రెడీగా ఉండడంతో ఈ సినిమాకి ఒప్పుకున్నాడంట సందీప్ రెడ్డి వంగ. ఇలా మహేష్ బాబు వదులుకున్న ఈ సినిమా ఇప్పుడు విపరీతమైన క్రేజ్ తో ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాని మహేష్ బాబు వదులుకొని మంచి పని చేశాడా లేదా సరైన నిర్ణయం కాదా అనేది సినిమా రిలీజ్ అయి సక్సెస్ తర్వాత చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా థియేటర్ రైట్స్ మాత్రం చాలా భారీగానే అమ్ముడుపోయాయి. దర్శకుడు తెలుగు వాడవ్వడం వలన.. హిందీ హీరో అయినా కూడా ఈ సినిమాని దిల్ రాజు ఏకంగా 15 కోట్లకు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజంగా కళ్ళు చెదిరే వార్త. ఒక హిందీ హీరో సినిమాకి తెలుగులో ఇంత పెద్ద భారీ బడ్జెట్ తో థ్రియేటికల్ రైట్స్ కొనడం అంటే మామూలు విషయం కాదని అందరూ అనుకుంటున్నారు.