Home Cinema Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ పై వైరల్ అవుతున్న ఆ నటుడి మాటలు..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ పై వైరల్ అవుతున్న ఆ నటుడి మాటలు..

That senior Artist comments on Pawan Kalyan future

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవికి తమ్ముడుగా మెగా కుటుంబం నుంచి సినిమా రంగంలో అడుగుపెట్టి, ఆ తర్వాత తనదైన శైలిలో కొత్తదనంతో నటించి ప్రేక్షకుల గుండెల్లో ( That senior Artist comments on Pawan Kalyan future ) ఎంత పెద్ద స్థానాన్ని సంపాదించారో మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమానులు అంటేనే ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది అందరికీ.. ఎందుకంటే వాళ్ళు, వాళ్ళ గుండెల్లో గుడికట్టి మరి ఆయన్ని దేవుడిలా పూజిస్తారు. పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి అక్కడ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎంత పెద్ద సక్సెస్ ని సాధించారో మనందరికీ తెలిసిందే.

రాజకీయ రంగంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలపాటు ఎక్కడ అలసిపోకుండా, వెనుతిరగకుండా పోరాడి.. ఇప్పుడు ఒక మంచి స్థానంలో నిలబడ్డారు. ఆయన అభిమానులు ప్రస్తుతం ఆనందంతో పొంగిపోతున్నారు. కేవలం సినీ అభిమానులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది పవన్ కళ్యాణ్ పై ( That senior Artist comments on Pawan Kalyan future ) అభిమానం ఉన్నవాళ్లు ఆనందంతో పొంగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటుడు నరేష్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విజయనిర్మల కొడుకు సీనియర్ నటుడు నరేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినీ అభిమానులు అందరికీ ఎంతగానో పరిచయమే.

See also  Chiranjeevi-Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేసిన మిస్టేక్ కి చిరంజీవి ఆ వ్యక్తిని క్షమాపణ ఇలా అడిగారంట!

ఆయన హీరోగా సినిమా రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా ఎంతో పెద్ద పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఆయనకు తన పర్సనల్ లైఫ్ కి ( That senior Artist comments on Pawan Kalyan future ) సంబంధించి పవిత్ర లోకేష్ తో కలిసి ఆయన చేస్తున్న సహజీవనంపై అనేక వార్తలు వచ్చి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వాళ్ళ కథపై ఒక సినిమా తీసి.. అది ఫ్లాప్ కూడా అయింది అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. నరేష్ లేటెస్ట్ సినిమా వీరాంజనేయ విహారయాత్ర అనే సినిమా ఆగస్టు 14వ తేదీన ఈటీవీలో రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ ఆగస్టు 14వ తేదీన అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ పై ఆ చిత్ర బృందం వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటీవీతో తనకి 40 ఏళ్ల బంధం ఉందని చెప్పుకొచ్చారు.

See also  Niharika : నిహారిక భార్యగా కోడలిగా ఎలాంటిదో తెగించి చెప్పిన ఆ వ్యక్తి మాటలు నిజమేనా?

అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం పై తనకు చాలా ఆనందంగా ఉందని, స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి నేటి వరకు సినీ పరిశ్రమ రాజకీయ రంగాలిది అభినవ సంబందం అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ లో చాలా గట్టి దమ్ముందని నాకు ఎప్పుడో తెలుసు. దాన్ని కచ్చితంగా ఆయన నిరూపించుకుంటారని తెలుసు. అందుకే ఈరోజు ఇంతటి ఘనవిజయాన్ని సాధించారు. అంతేకాదు ఇప్పుడే చెప్తున్నాను.. ఫ్యూచర్లో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతారని నరేష్ చెప్పకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో సీఎం అవుతారని నరేష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.