Ram Pothineni Heroine: తెలుగు చిత్ర పరిశ్రమ లో చాక్లెట్ బాయ్ గా తన దైన శైలి లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో రామ్ పోతినేని.. మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలియానాను పరిచయం చేస్తూ తనూ పరిచయమైన తొలి చిత్రం దేవదాస్ ద్వారా పరిచయమయ్యాడు రామ్ పోతినేని. తన అందంతో గ్లామర్ తో ఎందరో అమ్మాయిల కలల రాకుమారుడు ఫేవరెట్ హీరోగా నిలిచాడు.. అలా దేవదాసు చిత్రం అనంతరం నాటి నుండి నేటి వరకు రామ్ పోతినేని ఎందరో హీరోయిన్ల తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాలీవుడ్ లో మంచి హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన నటించిన చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం స్కంద.. ఇప్పటికే ఈ చిత్రం నుండి వెలువడ్డ పాటలు, టీజర్ కూడా ఎంతగానో అలరించి అందర్నీ ఆకట్టుకున్నాయి.
ఇక ఈ విషయాన్ని అంతా పక్కన పెడితే మన టాపిక్ విషయం లోకి వచ్చినట్లయితే.. రామ్ పోతినేని గతంలో ఆ స్టార్ హీరోయిన్ ప్రేమ పేరుతో విపరీతంగా మోసం చేసిందంటూ మీడియా మొత్తం కూడా వస్తుందని చాలా మంది కి తెలుసు. ఇప్పటికీ ఈ విషయం ఎన్నో సార్లు వెలుగు లోకి వచ్చింది. మరొక సారి ఈ విషయం పై చర్చ కొనసాగుతున్న తరుణం లో మరొక సారి వైరల్ గా మారింది. అసలు హీరో రామ్ పోతినేని నమ్మించి మోసం చేసిన ఆ హీరోయిన్ ఎవరనేది మనం ఇప్పుడు చూద్దాం. రామ్ పోతినేని 2008వ సంవత్సరం లో జెనీలియా తో కలిసి నటించిన చిత్రం రెడీ. ఇక ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో వీరి కాంబినేషన్ కి మంచి పేరు గుర్తింపు లభించాయి.
ఇక అప్పటికే జెనీలియా రితిష్ దేశ్ ముఖ్ తో ప్రేమ లో ఉంటూ ఆ ప్రేమని కొనసాగించలేక పలు గొడవల వలన బ్రేకప్ చెప్పేసిందట. దానికి ప్రధానమైన కారణం ఆమె మ్యాగజైన్ కోసం బికినీ లో ఫోటో దిగడం తో ఆ ఫోటోలు కాస్త అప్పట్లో విపరీతంగా వైరల్ అయి జెనీలియా కి రితీష్ కి మధ్య గొడవలు జరిగిన అనంతరం వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందట. దాంతో ఆ తర్వాత జెనీలియా రామ్ పోతినేని రెడీ చిత్రం సమయంలో రామ్ కు విపరీతంగా దగ్గర అయింది. అలా రెండు సంవత్సరాల పాటు పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతూ డేట్ చేసిన జెనీలియా మళ్లీ ఉన్నట్టుండి ఏమైందో తెలియదు రితీష్ వైపు తిరిగిందట.
ఇక్కడ పీకల్లోతు ప్రేమలో ముంచేసి రితీష్ దేశ్ ముఖ్ తో ప్యాకప్ అయ్యి అతని పెళ్లి చేసుకోవడానికి ముస్తాబయింది. కానీ రామ్ పోతినేని తో మాత్రం మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసింది. అలా అప్పట్లో రామ్ పోతినేని వదిలేసి మళ్లీ రితిష్ దేశముఖ తో తిరిగే సరికి చాలా మంది తెలుగు సినీ ప్రముఖులు మరియు నెటిజన్స్ జెనీలియా (Ram Pothineni Heroine) రామ్ ని వాడుకొని వదిలేసిందంటూ మాట్లాడుకున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి అప్పుడప్పుడు చర్చ కొనసాగుతూనే ఉంటుంది.