Rx100 : లో బడ్జెట్లో కొత్త వాళ్లు సినిమాకి అంటే దాని మీద ఎవరికీ పెద్దగా అంచనాలు ఉండవు. అలా ఎన్నో సినిమాలను అవి థియేటర్లోకి వచ్చాయని గాని, వెళ్లాయని కూడా చాలామందికి తెలియదు. అలా సినిమాలను తీసి నష్టపోయిన వాళ్ళు కూడా ( heroine rejected the Rx100 ) ఎంతోమంది ఉన్నారు. కానీ కొన్ని సినిమాలు కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త దర్శకుడు తో కూడా.. లో బడ్జెట్లో సినిమా తీసుకుని.. ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసుకుని.. సంపాదించడమే కాకుండా.. ఎన్నటికీ ఆ సినిమాని మర్చిపోలేని పరిస్థితుల్లో పెట్టె కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఆర్ఎక్స్ 100 సినిమా ఒకటి. ఈ సినిమాను ఎప్పటికీ ఎవరూ మర్చిపోలేరు . అది ఎప్పుడు ట్రెండింగ్ గానే ఉంటుంది.
ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరో, హీరోయిన్, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే. కార్తికేయ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మొత్తం హీరోయిన్ ( heroine rejected the Rx100 ) మీదే ఆధారపడి ఉంటుంది. ఆమె క్యారెక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది. హీరోయిన్ ని అంత విలన్ గా సినిమా మొత్తానికి చూపించిన సినిమా ఇదేనేమో. హీరోయిన్ అంత బోల్డ్ గా చూపించిన సినిమా ఇదేనేమో అన్నట్టుగా చాలా అద్భుతంగా తీశాడు ఆ దర్శకుడు. కేవలం నోటిమాట ద్వారా, ఒకరి ద్వారా ఒకరికి సినిమా బాగుందని తెలిసి కొన్ని కోట్ల లాభాన్ని సంపాదించి పెట్టి సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాలో కంటెంట్ ఉంటే.. దాన్ని ఎలాంటి సినిమా నైనా ఆడియన్స్ అందలమెక్కిస్తారు అనడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ.
ఈ సినిమాలో హీరోయిన్ కు వచ్చిన పేరు అంత ఇంత కాదు. ఇప్పటికీ ఆమెను ఎవరు మర్చిపోలేరు. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి సినిమాలు ఆఫర్ వచ్చాయి.. ఎంత నిలబడింది, ఏమైంది అనేది పక్కన పెడితే.. ఆర్ఎక్స్ 100 అనగానే ఆ ( heroine rejected the Rx100 ) హీరోయిన్ గుర్తుకొచ్చి తీరుతుంది. లేదా ఆ హీరోయిన్ ని చూడగానే ఆర్ఎక్స్ 100 సినిమా గుర్తుకొస్తుంది అంత గొప్ప సినిమా అది. అయితే ఇలాంటి సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఫస్ట్ పాయల్ కి అవకాశం రాలేదంట. ఇంకొక హీరోయిన్ ని దర్శకుడు అడిగాడంట కానీ.. ఆ హీరోయిన్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి మొత్తం విని.. అంత బోల్డ్ గా ఉన్న పాత్రని చేయకూడదని, చేయలేనని ఆ సినిమాని నో చెప్పిందంట. ఆమె నో చెప్పిన తర్వాత పాయల్ని తీసుకోవడం జరిగింది అంట.
ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అవడంతో కచ్చితంగా ఆ హీరోయిన్ బాధపడే ఉంటది. అలాంటి గొప్ప అవకాశాన్ని కోల్పోవడం నిజంగా బాధాకరంగానే మిగిలిపోయి ఉంటది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే నందిత శ్వేత. ఈ హీరోయిన్ కి అప్పటికే టాలీవుడ్ లో కొంత క్రేజ్ వచ్చింది. ఈమె అప్పటికే నిఖిల్ తో కలిసి ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్గా అవకాశం తనకి వచ్చిన దానిని రిజెక్ట్ చేసింది అన్న విషయాన్ని.. స్వయంగా నందిత శ్వేత తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ఆమె హిడింబ ప్రమోషన్ లో బిజీగా ఉంది. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం జూలై 20వ తారీఖున విడుదలకు సిద్ధంగా ఉంది.