Home Cinema Chiranjeevi: ఆ యాక్టర్ వల్ల చిరంజీవి పెళ్లి ఆగిపోయేంత పనయ్యింది. కానీ చివరకు పెళ్లి ఎలా...

Chiranjeevi: ఆ యాక్టర్ వల్ల చిరంజీవి పెళ్లి ఆగిపోయేంత పనయ్యింది. కానీ చివరకు పెళ్లి ఎలా అయ్యిందంటే.?

Chiranjeevi Marriage: మెగాస్టార్ చిరంజీవి గారి పెళ్లి చినిగిన చొక్క వేసుకుని చేసుకున్న సంగతి ప్రతి ఒక్క మెగాస్టార్ అభిమానులకే కాక యావత్ తెలుగు ప్రజానీకానికి తెలిసిందే.. ఇక ఆయన పెళ్లి సమయంలో ఎంత హడా విడి జరిగిందంటే అది మామూలు విషయం కాదు. మాటల్లో వర్ణించలేనిది అనే చెప్పాలి. ఎందుకంటే పెళ్లి పీటల వరకు వచ్చాక చిరంజీవి పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందట. అలా జరగడానికి ఆ వ్యక్తి కారణమట. మరి ఆ వ్యక్తి ఎవరు అసలు చిరంజీవి పెళ్లి ఎందుకు ఆగాల్సి వచ్చింది.? ఆ వ్యక్తి వల్లనే పెళ్లి ఆగిపోవాల్సి వచ్చిందా అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం.. మనందరికీ తెలిసిందే ఫిల్మ్ ఇండస్ట్రీ లో బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం తన స్వయం శక్తితో నటనని నమ్ముకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి మెగాస్టార్ గా మారిపోయాడు చిరంజీవి.

See also  Manchu Lakshmi - Anushka : మంచులక్ష్మిని ముంచేసిన అనుష్క !

that-hero-tried-to-stop-chiranjeevi-marriage-but-failed-atlast-who-is-that-hero

అలాంటి మెగాస్టార్ మొదట్లో ఎలాంటి పాత్ర అయినా సరే అవలీలగా కాదు కూడదు అనే మాట లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ సినిమాలలో నటించి ప్రస్తుతం ఈ స్థాయికి ఎదిగాడు. ఇక ఆ సమయంలో చిరంజీవి కి ఉన్న అలాంటి కసి పట్టుదల చూసే అల్లు రామలింగయ్య ఎలాగైనా సరే చిరంజీవిని తన అల్లుడిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఇక అల్లు అరవింద్ అయితే చిరంజీవి గుణ గణాలు ఎలాంటివో చాలా సీక్రెట్ గా తెలుసుకున్నారట. అలా తండ్రి కొడుకులిద్దరూ పూర్తిగా చిరంజీవి గురించి తెలుసుకొని ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు అనేది లేవని పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాతే సురేఖకు బాగా సెట్ అవుతాడని భావించి చిరంజీవికి ఈ విషయం వివరించి చెప్పారట.

See also  Samantha - Sreeja: ఓ వైపు సమంత మరోవైపు శ్రీజ - వీళ్లిద్దరికి ఒకేసారి అలా ఎలా జ్ఞానోదయం అయ్యిందబ్బా..

that-hero-tried-to-stop-chiranjeevi-marriage-but-failed-atlast-who-is-that-hero

అయితే మెగాస్టార్ చిరు సైతం వాళ్లు అడిగిన పెళ్లి ప్రపోజల్ కాదు కూడదు వద్దని చెప్పకుండా సురేఖను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. అయితే వీరి వివాహ సమయంలో ఓ సంఘటన జరిగిందట.. అదేమిటంటే చిరంజీవి తాళి కట్టే సమయం వరకు కూడా షూటింగ్లోనే కొనసాగుతున్నాడట.. అందుకు ప్రధానమైన కారణం అప్పట్లో నూతన ప్రసాద్ అనే నటుడు డేట్స్ దొరికేవి కావట. ఆయన ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ రెండు మూడు నెలల పాటు ఆయన డేట్ దొరకడం చాలా కష్టమట. ఇక చిరంజీవి పెళ్లి రోజు చిరంజీవి నూతన ప్రసాద్ కి మధ్య కొన్ని మెయిన్స్ షూటింగ్స్ చిత్రీకరించాల్సి ఉందట. ఆ కారణం చేతనే చిరంజీవి తన పెళ్లిని కూడా వాయిదా వేసుకోవాలని నిశ్చయించుకున్నాడట.

See also  Sukumar - Baby : బేబీ సినిమాలో ఆ సీన్స్ పై సుకుమార్ వర్ణన కేక!

that-hero-tried-to-stop-chiranjeevi-marriage-but-failed-atlast-who-is-that-hero

చివరికి పెళ్లి వాయిదా వేసుకునే వరకు కూడా వెళ్లారట.. కానీ ఆ సినిమా నిర్మాత చిరంజీవి పెళ్లి గురించి ఆలోచించి ఆయన పెళ్లి ఎక్కడ జరుగుతుందో అని పూర్తి వివరాలు తెలుసుకొని అక్కడికి దగ్గర్లోనే షూటింగ్ చేయాలని నిశ్చయించుకున్నారట. అలా షూటింగ్ ముగించుకొని చిరంజీవి నేరుగా అదే చినిగిన చొక్కా వేసుకొని సురేఖ మెడలో మూడు ముళ్ళు వేశాడట. ఇలా నూతన ప్రసాద్ వల్ల చిరంజీవి పెళ్లి చివరికి ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందట.. కానీ నిర్మాత చాకచక్యంగా వ్యవహరించి చిరంజీవి పెళ్లి చేసుకునే దగ్గర్లోనే షూటింగ్ సెట్ ఏర్పాటు చేసి మరి ముహూర్తం సమయానికి చిరంజీవి పెళ్లి మండపానికి వచ్చేలా సర్దుబాట్లు చేయడంతో చిరంజీవి సురేఖల పెళ్లి (Chiranjeevi Marriage) అన్ని ట్విస్టుల నడుమ జరిగిందట.