Megastar Chiranjivi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో నెంబర్ వన్ గా మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు , దాసరి చనిపోయాక హీరోగా మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా ఉన్నాడు. ఈ మధ్య రిలీజ్ ( That director insulted Chiranjeevi ) అయిన చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య , భోళా శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ మరియి జనాలు చిరంజీవి గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు. చిరంజీవి అందరికీ కావాల్సిన వ్యక్తిగా మంచి పేరు వస్తున్న తరుణంలో వాల్తేర్ వీరయ్య ఫంక్షన్ లో అనవసరంగా పొలిటికల్ కామెంట్స్ చేసి విమర్శలు పాలు అయ్యాడు..
టైం బాగాలేనప్పుడు ఎంత పెద్ద హీరో అయినా సినిమా ఆడదు, ఏ దుర్ధ్యేసం లేకుండా చేసిన కామెంట్స్ అయినా సరే అనవసర తలనొప్పులకు కారణం అవుతాయి. అసలు విషయానికి వస్తే.. ఒకప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే హీరోలకి ( That director insulted Chiranjeevi ) యజమానులాంటి వారు లెక్క , వారు కుర్చీల్లో కూర్చుంటే మనం హీరోలుగా కీర్తించబడే బడా బడా వ్యక్తులు నేల మీద బుద్దిగా కూర్చునే పరిస్థితి. NTR , ANR సైతం కటిక నేలపై కూర్చుని ఉండగా వారి నిర్మాతలు దర్జాగా కుర్చీలో కూర్చుని ఉండే పిక్స్ ఇప్పటికి నెట్ లో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో నిర్మాతలంటే హీరోలకి అంతటి గౌరవం భయం ఉండేవి .
అవకాశం ఇస్తే చాలు భగవంతుడా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాలుగురూపాయలు తీసుకుని పోదాం అనుకునే వాళ్లు. ఆ తరువాత NTR , ANR ఏస్థాయిలో సక్సెస్ అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు. అదే ప్రొడ్యూసర్స్ అడ్వాన్సులు ( That director insulted Chiranjeevi ) సూట్కేసులో పెట్టుకుని, వాళ్ల ఇళ్ల ముందు క్యూ లైన్లో నిలుచుకునే వాళ్లు అంట, కాలం మహిమ అలాంటిది మరి. మెగాస్టార్ గా చిరంజీవికి సైతం NTR , ANR కి జరిగినట్టే ఒక తీవ్ర అవమానం జరిగిందని , ఆ అవమానాన్ని దగ్గరి నుండి చూసిన సీనియర్ యాక్టర్ తులసి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.
చిరంజీవి మొదట్లో సైడ్ యాక్టర్ గా వర్క్ చేసే రోజుల్లో ఒకరోజు సినిమా షూటింగ్ కి కాస్త లెట్ గా వచ్చాడు అంట , ఆసినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న తమ్మారెడ్డి భరధ్వాజ్ చిరంజీవి మీద ఫయర్ అయ్యి, ఇలా లేట్గా వస్తే ఎలా ? నీకోసం ఇక్కడ ఎంత మంది వెయిట్ చేయాలి అని గట్టిగా అడిగి, ఈ సినిమాలో నువ్వు కొనసాగాలి అంటే ఈరోజు మొత్తం ఎండలో నిలబడు అని పనిష్మెంట్ ఇవ్వడంతో .. మెగాస్టార్ మౌనంగా ఎండలో నిలబడి , ఇంకెప్పుడు షూటింగ్ కి లెట్ గా రాలేదు అంట. కానీ ఇప్పుడు పరిస్థితి , సినిమా మొదలు పెట్టిన ఎన్ని సంవత్సరాలకి పూర్తి అవుద్దో తెలియదు, సెట్ లోకి హీరో ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు, ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ నడుస్తోంది… ఒక్కో టైం లో ఒక్కొక్కరి హవా నడుస్తుంది మరి.