Pawan Kalyan – Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన బ్రో సినిమాకి సామాన్య ప్రేక్షకుడి దగ్గర నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మాత్రం బ్లాక్ బస్టర్ వచ్చింది. ఈ సందర్భంగా బ్రో చిత్ర బృందం వాళ్ళు సక్సెస్ ( Trivikram and Pawan Kalyan ) మీట్ పెట్టుకున్నారు. ఈ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ.. నా ధైర్యం, నా బలం, నా భయం అన్నీ త్రివిక్రమ్ గారేనని.. ఆయనకు నేను జీవితంలో ఎంతో రుణపడి ఉంటానని.. తమన్ చెప్పడం జరిగింది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో .. రేపు ఓజి ఇవన్నీ కూడా ఆయన నాకు రికమండ్ చేసినవే.. నేనెప్పుడూ త్రివిక్రమ్ గారి రుణం మర్చిపోలేను అని అన్నాడు.
తమన్ మాట్లాడిన మాటలతో.. ఇప్పటికే అందరిలోనూ త్రివిక్రమ్ పై ఒక రకమైన అనుమానం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ ఎలా చెప్తే అలా వింటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. త్రివిక్రంలో ఆ తెలివితేటలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ని తన వైపు తిప్పుకుంటూ.. పవన్ కళ్యాణ్ కావాల్సిందే చేస్తున్నట్టు చేస్తూ.. తనకు ( Trivikram and Pawan Kalyan ) కావాల్సిన పని చేసుకుంటాడని ఒకరకమైన టాక్ ఉంది. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సినిమాల్లో, అటు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన ఎన్నో సినిమాలు ఒప్పుకొని.. ముందుగా ఒప్పుకున్న సినిమాలు అన్నిటినీ కూడా పక్కనపెట్టి.. బ్రో సినిమా పూర్తి చేసినట్టు అర్థమవుతుంది.
అలాగే నెక్స్ట్ ఓజి సినిమా కూడా బాగానే నడుస్తుంది. కానీ హరిహరవీరమల్లు, హరీష్ శంకర్ సినిమాలు ఆగిపోయినట్టే కనిపిస్తున్నాయి. అంటే త్రివిక్రమ్ చేయి ఉన్న సినిమాలు చాలా స్పీడ్ గా అవుతున్నాయి. అలాగే బ్రో సినిమాని అన్నిటినీ ( Trivikram and Pawan Kalyan ) పక్కనపెట్టి బ్రో సినిమాని కంప్లీట్ చేయించినందుకు త్రివిక్రమ్ కొంత డబ్బు కూడా తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ ఓజీ సినిమాలో కూడా త్రివిక్రమ్ హ్యాండ్ ఉందని అందుకే అది కూడా పూర్తవుతుంది అని అనుకుంటున్నారు. ఇలా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ తో తన నిర్ణయాలు తగ్గట్టుగా అలాంటి పనులు చేయిస్తూ బాగా సంపాదించుకుంటున్నాడని విమర్శకులు విమర్శిస్తున్నారు.
అయితే ఇలాంటి తెలివితేటలు ఎంతో కాలం సాగవని.. ఇదంతా శాశ్వతం కాదని కొందరి నెటిజనులు కామెంట్ చేస్తుంటే.. మరి కొందరు ఇవన్నీ ఎవరికి వాళ్లు ఊహించుకుంటారు గాని.. పవన్ కళ్యాణ్ ఏమైనా చిన్న పిల్లాడా? తనకు తెలియదా> ఏ సినిమా ముందు చేయాలి? ఏ సినిమా తర్వాత చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకోవడం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా తమన్ మాట్లాడిన మాటల్లోంచి త్రివిక్రమ్ హవా చాలా ఉందని, పవన్ కళ్యాణ్ తో తనకు కావాల్సిన పనులు అలా తొందరగా చేయించుకుంటున్నాడని కామెంట్స్ అయితే మాత్రం రాక తప్పడం లేదు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది పవన్ కళ్యాణ్ కి, త్రివిక్రమ్ కి మాత్రమే తెలియాలి.