Home Cinema Tejasvi Madivada: పెళ్ళికి సిద్దమైన తేజస్వి మడివాడ..పెళ్ళికొడుకు ఎవరో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Tejasvi Madivada: పెళ్ళికి సిద్దమైన తేజస్వి మడివాడ..పెళ్ళికొడుకు ఎవరో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Tejasvi Madivada Marriage: టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పెళ్లి సంబరాలే కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగుతున్న హీరోలు హీరోయిన్లు వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. రీసెంట్ గా శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. అతి త్వరలోనే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల పెళ్లి కూడా జరగబోతుంది. ఇలా ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా కొనసాగిన ఎంతో మంది నటులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి మరీ పెళ్లి చేసుకుంటున్నారు.

tejaswi-madivada-getting-married

ఇప్పుడు ప్రముఖ క్యారక్టర్ ఆర్టిస్టు మరియు బిగ్ బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ తేజస్వి మడివాడ కూడా అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది(Tejasvi Madivada Marriage). తన చిరకాల మిత్రుడితో ఆమె కొంతకాలం నుండి డేటింగ్ లో ఉంది. రీసెంట్ గానే వీళ్ళ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పి ఒప్పించారట, త్వరలోనే నిశ్చితార్థం కూడా జరగబోతుంది. అయితే పెళ్లి కొడుకు ఇండస్ట్రీ కి సంబంధించినవాడా?, లేక బయట వాడా అనేది తెలియాల్సి ఉంది. తేజస్వి మడివాడ చాలా బోల్డ్ గా మాట్లాడుతూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉండేది, కొంతమందికి ఆమె ప్రవర్తన నచ్చేది, మరి కొంతమందికి నచ్చేది కాదు.

See also  Upasana : ఉపాసన ధరించిన ఈ పింక్ డ్రెస్ విలువ ఎంతో తెలిస్తే మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి..

tejasvi-madivada-marriage

అధిక శాతం మంది ప్రేక్షకులు నచ్చని వారే ఉంటారు, అందుకే ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొద్దిరోజులకే బయటకి వెళ్ళిపోయింది. అయితే గతం కొన్ని ఇంటర్వ్యూస్ లో ఈమె పెళ్లి గురించి తనకి ఉన్న అభిప్రాయాన్ని చాలా బోల్డ్ గా చెప్పింది, పెళ్లి అంటేనే ట్రాష్ అన్నట్టు మాట్లాడే ఈమె ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుండడం విశేషం. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండే తేజస్వి మడివాడ కి ఈమధ్య సినిమాల్లో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రతీ సినిమాలో ఈమె హీరో కి కానీ లేదా హీరోయిన్ కి కానీ చెల్లెలుగా నటిస్తూ ఉండేది.

See also  Varun Lavanya Haldi: అదిరిపోయే హల్దీ ఫోటోలతో వరుణ్ లావణ్య..

actress-tejasvi-madivada

పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అంతే కాకుండా బిగ్ బాస్ ఓటీటీ మరియు ‘BB జోడి’ వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమెకి సినిమాల్లో బాగా అవకాశాలు తగ్గిపోవడం వల్లే పెళ్ళికి సిద్ధం అయ్యినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి, ఇది నిజం కూడా అయ్యుండొచ్చు అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నటి తేజస్వి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలిసిన పేరు అయింది. నటి తేజస్వి మోడలింగ్ మరియు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కూడా కనిపించింది.